Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కివీస్ విన్ స్టన్ రీడ్ చివరి నిముషంలో అద్భుతం

Robert Vittek
రస్టెన్‌ బర్గ్‌: స్లోవెకియా ఆశలపై న్యూజీల్యాం డ్ ఆటగాడు నీళ్ళు చల్లాడు. ఆల్‌వైట్స్‌ (కివీస్‌) ఆటగాడు విన్‌స్టన్‌ రీడ్‌ సంచలన రీతిలో ఇంజూరీ సమయం (90+3) చివరి నిమిషంలో హెడర్‌ గోల్‌ చేశాడు. స్లొవేకియా సంబరాలపై నీళ్లు చల్లాడు. 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌ ఆడుతున్న న్యూజిలాండ్‌కు తొలి పాయింట్‌ అందించాడు.

కివీస్‌ జోరు: కివీస్‌ మ్యాచ్‌ గెలుస్తుందని కానీ..డ్రా చేసుకుంటుందని కానీ ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. ఎందుకంటే ప్రపంచకప్‌లో ఆ జట్టు అంతకుముందు (1982లో) ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. కానీ స్లొవేకియాతో మ్యాచ్‌లో ఆటగాళ్లు పట్టుదలను ప్రదర్శించారు. స్త్ట్రెకర్‌ క్రిస్‌ కిలెన్‌ తొలి ఐదు నిమిషాల్లోనే రెండుసార్లు ప్రత్యర్థి గోల్‌ పోస్ట్‌పై దాడి చేశాడు. మరోవైపు వ్లాదిమిర్‌ వీస్‌ (కోచ్‌ వ్లాదిమిర్‌ వీస్‌ కుమారుడు) కూడా స్లొవేకియాను కోలుకోన్విలేదు. వెంటనే పుంజుకున్న స్లొవేకియా బంతిని తన ఆధీనంలో ఉంచుకుంటూ కివీస్‌ జోరుకు బ్రేకులేసింది. తర్వాత వరుస దాడులతో ప్రత్యర్థి గోల్‌కీపర్‌ పాట్సన్‌పై ఒత్తిడి పెంచింది. ప్రథమార్ధం ముగియడానికి కొద్దిసేపటి ముందు స్లొవేకియాకు విటర్‌ గోల్‌ చేసినంత పనిచేశాడు.

అతడు తలతో బంతిని గోల్‌పోస్ట్‌వైపు నెట్టగా..దాన్ని పాట్సన్‌ వదిలేశాడు. ఈ లోపు కివీస్‌ డిఫెండర్‌ గోల్‌చేయకుండా అడ్డుపడ్డాడు. ద్వితీయార్ధంలో రెండు జట్లు నువ్వానేనా అన్నట్టు తలపడ్డాయి. కానీ మొదట సఫలమైంది మాత్రం స్లొవేకియానే. 50వ నిమిషంలో సెస్టాక్‌ అందించిన క్రాస్‌ను విటెక్‌ నేర్పుగా గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. గోల్‌ చేసిన ఆనందంలో ఆ జట్టు ఆటగాళ్లు మరింత రెచ్చిపోయారు. 58వ నిమిషంలో సెస్టాక్‌ అందించిన పాస్‌ను గోల్‌గా మలిచేందుకు అవకాశమున్నా హామ్సిక్‌ దాన్ని వృథా చేశాడు. ఆఖరి వరకు స్లొవేకియా పట్టువదల్లేదు. కానీ మూడు నిమిషాల ఇంజూరీ సమయాన్ని కివీస్‌ సద్వినియోగం చేసుకుంది. మ్యాచ్‌ ముగియడానికి కొన్ని సెకన్ల ముందు స్మెల్జ్‌ నుంచి బంతిని అందుకున్న రీడ్‌ తలతో గోల్‌ కొట్టాడు. చొక్కాను విప్పి గిరగిరా తిప్పుతూ సంబరాలు చేసుకున్నాడు. అందుకు రిఫరీ ఎల్లో కార్డు చూపించాల్సి వచ్చింది. ఏదైమైనా కివీస్‌కు చరిత్రాత్మక గోల్‌ అందించాడు రీడ్.
Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+