For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

FIFA U-17 వరల్డ్‌కప్: ఆరంభ వేడుకలు లేవు, కారణం ఇదీ

By Nageshwara Rao

హైదరాబాద్: ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ వేడుకలకు భారత్ తొలిసారిగా ఆథిత్యమిస్తోన్న సంగతి తెలిసిందే. నిజానికి ఓ మెగా టోర్నీ అంటే అట్టహాసంగా ఆరంభం కావాల్సిందే. ఒలింపిక్స్‌, క్రికెట్‌ ప్రపంచకప్‌ ఇలా ఏ టోర్నీ చూసినా ప్రారంభ వేడుకలు ఘనంగా జరుగుతాయి.

భారత్‌లో ఇప్పటివరకు నిర్వహించిన క్యాష్ రిచ్ టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభ వేడుకలు ఎంత ఘనంగా జరిగాయో మనం చూశాం. అయితే భారత్ తొలిసారిగా ఆతిథ్యం ఇవ్వనున్న ఫిఫా అండర్‌-17 వరల్డ్ కప్‌ ఆరంభం రోజున ఎలాంటి వేడుకలు జరగడం లేదు.

పా టోర్నీల్లో ఆరంభోత్స వేడుకలు ఉండవు

పా టోర్నీల్లో ఆరంభోత్స వేడుకలు ఉండవు

అదేమిటని ఆశ్చర్యపోకండి. నిజానికి ఫిపా టోర్నీల్లో ఆరంభోత్స వేడుకలను నిర్వహించకపోవడం ఎప్పటి నుంచో ఆనవాయితీ వస్తోంది. ఆయితే భారత ప్రభుత్వం ఘనంగానే ఫుట్‌బాల్‌ వరల్డ్ కప్‌ను ఆరంభించాలని ఆశించినా అందుకు ప్రపంచ ఫుట్‌బాల్‌ సంఘాల సమాఖ్య (ఫిఫా) నుంచి అనుమతి లభించలేదు.

ఆట అభివృద్ధికి ఉపయోగిస్తే మంచిది

ఆట అభివృద్ధికి ఉపయోగిస్తే మంచిది

'ఫిఫా అండర్‌-17 వరల్డ్ కప్‌లో ప్రధాన ఆకర్షణ ఫుట్‌బాలే. ఆరంభ వేడుకల నిర్వహణ కోసం ఖర్చు చేసే డబ్బును ఆట అభివృద్ధికి ఉపయోగిస్తే మంచిది. ప్రపంచవ్యాప్తంగా ఫిఫా టోర్నీలకు ఆరంభోత్సవ వేడుకలు ఉండవు' అని టోర్నీ డైకెక్టర్‌ జేవియర్‌ సెప్పి తెలిపారు.

2013లోనే భారత్‌కు ఆతిథ్య హక్కులు

2013లోనే భారత్‌కు ఆతిథ్య హక్కులు

శుక్రవారం నుంచే భారత్‌లో ఫిఫా అండర్‌-17 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. అజర్‌బైజాన్‌, ఐర్లాండ్‌, ఉజ్బెకిస్థాన్‌ లాంటి దేశాలతో పోటీపడి భారత్‌ ఈ టోర్నీ ఆతిథ్య హక్కుల్ని సంపాదించింది. 2013లోనే భారత్‌కు హక్కులు వచ్చాయి. ఎన్నోసార్లు ఫిఫా కమిటీలు ఇక్కడికి వచ్చి వేదికలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశాయి.

ఆసియాలో ఫుట్‌బాల్‌కు ప్రాచుర్యం కల్పించడం కోసమే

ఆసియాలో ఫుట్‌బాల్‌కు ప్రాచుర్యం కల్పించడం కోసమే

ఆసియాలో ఫుట్‌బాల్‌కు ప్రాచుర్యం కల్పించడమే ప్రధాన ఉద్దేశంతో ఫిఫా యువ ఆటగాళ్ల ఆతిథ్య హక్కులను అత్యధికసార్లు ఆసియా దేశాలకే కట్టబెట్టింది. ఈ టోర్నీకి ఆతిథ్యమివ్వనున్న ఐదో ఆసియా దేశం భారత్‌. చైనా (1985), జపాన్‌ (1993), కొరియా (2007), యూఏఈ (2013)లో ముందుఉన్నాయి.

ఏ స్థాయిలో అయినా భారత్‌కు ఇదే తొలిసారి

ఏ స్థాయిలో అయినా భారత్‌కు ఇదే తొలిసారి

ఏ స్థాయిలో అయినా ఒక ఫిఫా ప్రపంచకప్‌లో పాల్గొనబోతుండడం భారత్‌కు ఇదే తొలిసారి. ఈ టోర్నీలో ఆడే సువర్ణావకాశాన్ని దక్కించుకున్న భారత జట్టుకు అమర్‌జిత్‌సింగ్‌ నాయకత్వం వహిస్తున్నాడు. గ్రూప్‌-ఎలో ఉన్న భారత్‌.. టోర్నీ తొలి రోజు యూఎస్‌ఏతో తొలి మ్యాచ్‌ ఆడనుంది. తనకన్నా ఎన్నో రెట్లు మెరుగైన యూఎస్‌ఏతో డ్రా చేసుకుంటే భారత్ గొప్ప మెరుగైన ప్రదర్శన చేసినట్లే.

దేశం గర్వపడేలా ఆడండి: విరాట్‌ కోహ్లీ

ఫిఫా అండర్‌-17 వరల్డ్ కప్‌లో పాల్గొనబోతున్న భారత ఆటగాళ్లు దేశం గర్వపడేలా ఆడాలని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు. 'అక్టోబర్‌ 6న భారత జట్టు ఫిఫా అండర్‌-17 ప్రపంచకప్‌లో పాల్గొనబోతోంది. యూఎస్‌ఏతో తొలి మ్యాచ్‌లో తలపడబోతోంది. గర్వపడేలా ఆడండి' అని ట్విట్టర్‌లో వీడియో పోస్టు పెట్టాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+