Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

14వ సారి యూరోపియన్ ఛాంపియన్స్ లీగ్ గెలిచిన రియల్ మాడ్రిడ్

Real Madrid win Champions League title for the 14th time

పారిస్‌లోని స్టేడ్ డి ఫ్రాన్స్‌లో జరిగిన ఛాంపియన్స్ లీగ్ ఫైనల్‌లో రియల్ మాడ్రిడ్ క్లబ్ జట్టు 1-0తేడాతో లివర్‌పూల్‌ను ఓడించింది. తద్వారా రికార్డు స్థాయిలో 14వ సారి యూరోపియన్ ఛాంపియన్‌గా అవతరించింది. బ్రెజిలియన్ ప్లేయర్ వినిసియస్ జూనియర్ 59వ నిమిషంలో ఫెడెరికో వాల్వెర్డే ఇచ్చిన డ్రైవ్‌ను సమర్థంగా వినియోగించుకుని గోల్ కొట్టాడు. దీంతో ఆధిక్యంలో వచ్చిన మాడ్రిడ్.. గేమ్ చివరి వరకు తమ 1-0 ఆధిక్యాన్ని కాపాడుకుని గెలిచింది.

ఇకపోతే ఇంగ్లాండులో జరిగిన రెండు దేశవాళీ కప్‌లతో సీజన్‌ను ముగించిన లివర్‌పూల్ మాడ్రిడ్ గోల్‌కీపర్ థిబౌట్ కోర్టోయిస్‌ను బురిడీ కొట్టించలేకపోయింది. అధిగమించలేకపోయింది. లైవర్ పూల్ స్ట్రైకర్ సాడియా మానే తొలి హాఫ్ లో కొట్టి గోల్‌ను మాడ్రిడ్ గోల్ కీపర్ అద్భుతంగా అడ్డుకున్నాడు. ఇక చివర్లో 81వ నిమిషంలో మహ్మద్ సలా కొట్టిన షాట్‌ను గోల్ పోస్టులోకి వెళ్లకుండా సేవ్ చేశాడు. దీంతో మాడ్రిడ్ గెలుపొందింది.

ఈ విజయంతో మాడ్రిడ్ ఇప్పుడు 14 యూరోపియన్ కప్‌లను పొందగా.. 2వ స్థానంలో ఉన్న ఏసీ మిలన్ 7కప్‌లు కలిగి ఉంది. ఇకపోతే ఈ విజయం ద్వారా కార్లో అన్సెలోట్టి ఇప్పుడు నాలుగు ఛాంపియన్స్ లీగ్ టైటిళ్లను గెలుచుకున్న ఏకైక మేనేజర్‌గా నిలిచాడు. లివర్‌పూల్‌ మేనేజర్ బాబ్ పైస్లీ (మూడు), మాడ్రిడ్ గత మేనేజర్ జినెడిన్ జిదానే (మూడు)లను ఈ మేనేజర్ అధిగమించాడు.

ఇకపోతే ఈ మ్యాచ్‌కు ముందు స్టేడియంలోకి బలవంతంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆట 36 నిమిషాల ఆలస్యమైంది. ఇక రెండు జట్లూ జాగ్రత్తగా ఆరంభించగా.. 21వ నిమిషంలో మాడ్రిడ్ గోల్‌కీపర్ కోర్టోయిస్ పోస్ట్‌పైకి లైవర్‌పుల్ స్ట్రైకర్ సాడియో మానే వచ్చినప్పటికీ ఫలితం సాధించలేకపోయాడు.

Story first published: Sunday, May 29, 2022, 9:11 [IST]
Other articles published on May 29, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+