Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జట్టులో రొనాల్డొ కనిపిస్తున్న లోటు.. సూపర్ లీగ్ టైటిల్ ఫైనల్ పోరులో ఓటమి

Real Madrid vs Atletico Madrid Highlights, UEFA Super Cup: Atletico Madrid beat Real Madrid 4-2 in extra time

హైదరాబాద్: రియల్ మాడ్రిడ్ జట్టులో పోర్చుగల్ స్టార్ స్ట్రైకర్ క్రిస్టియానొ రొనాల్డో లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రొనాల్డో లేని రియల్ మ్యాడ్రిడ్‌కు అథ్లెటికో మ్యాడ్రిడ్‌ జట్టు దిమ్మతిరిగే షాకిచ్చింది.క్రిస్టియానొ రొనాల్డో యువెంటస్ క్లబ్‌కు ట్రాన్స్‌ఫర్ మీద వెళ్ళడంతో అతని స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోయారు. రొనాల్డొ లేమితో బలహీనపడిన రియల్ మ్యాడ్రిడ్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లుగా పేరున్నా ప్రయోజనం లేకుండాపోయింది.

రియల్ మ్యాడ్రిడ్ క్లబ్ యూరోపియన్ సూపర్ కప్ ఫైనల్‌లో పోరాడి ఓడింది. ప్రతీయేటా చాంపియన్స్ లీగ్ విన్నర్, యూరోపా లీగ్ విన్నర్‌గా నిలిచిన జట్ల మధ్య జరిగే యూరోపియన్ సూపర్ కప్ ఫైనల్‌లో అథ్లెటికో మ్యాడ్రిడ్ జోరు ముందు రియల్ మ్యాడ్రిడ్ పరాజయం పాలైంది. 2017-18 చాంపియన్స్ లీగ్ విజేతగా నిలిచిన రియల్ మ్యాడ్రిడ్, 2017-18 యూరోపా లీగ్ విన్నర్‌గా నిలిచిన అథ్లెటికో మ్యాడ్రిడ్ జట్ల జరిగిన టైటిల్ ఫైట్‌ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది.

డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన అథ్లెటికో క్లబ్ 4-2 గోల్స్‌తో రియల్ క్లబ్‌కు షాకిచ్చింది. ఆట నిర్ణీత సమయం ముగిసే సరికి ఇరు జట్లు చెరో గోల్ చేయగా.. అదనపు సమయంలో అథ్లెటికో క్లబ్ ఆధిపత్యం ప్రదర్శించింది. 98వ నిమిషంలో సౌల్,104వ నిమిషంలో కోకె కళ్లు చెదిరే గోల్స్ కొట్టి రియల్ మ్యాడ్రిడ్‌పై తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. 2 గోల్స్‌,ఒక అసిస్ట్‌తో డీగో కోస్టా అథ్లెటికో మ్యాడ్రిడ్ జట్టు ఒంటిచేత్తో విజయాన్నందించాడు.

డిగో కోస్టాకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది. 2017-18 సీజన్‌లోనే డీగో కోస్టాను చెల్సీ క్లబ్ నుంచి అథ్లెటికో మ్యాడ్రిడ్ జట్టు తిరిగి దక్కించుకుంది. ఇప్పటివరకూ ఆడిన మూడు యూరోపియన్ సూపర్ కప్ ఫైనల్స్‌లోనూ అథ్లెటికో జట్టు ఓటమంటూ లేకుండా టైటిల్స్ నెగ్గడం విశేషం. 2010, 2012, 2018 యూరోపియన్ సూపర్ కప్ టైటిల్స్‌ అథ్లెటికో క్లబ్‌కే దక్కాయి. సాకర్‌లో టాప్‌లో దూసుకెళ్తున్న స్పానిష్ సాకర్ లీగ్.. లా లీగాలో బార్సిలోనా, రియల్ మ్యాడ్రిడ్ జట్ల తర్వాతి స్థానంలో అథ్లెటికో మ్యాడ్రిడ్ క్లబ్ చేరింది.

Story first published: Friday, August 17, 2018, 17:44 [IST]
Other articles published on Aug 17, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+