
నూతన ఫార్ములాకే అభిమానులు మద్దతిస్తారని రియల్ మాడ్రిడ్
రియల్ మాడ్రిడ్ క్లబ్ డైరెక్టర్ ఎమిలియో బుట్రాగైనో మాట్లాడుతూ ప్రస్తుతం కొనసాగుతున్న ఏడు క్లబ్‌ల ‘క్లబ్ వరల్డ్ కప్' స్థానే నూతన కప్ టోర్నమెంట్‌నే అభిమానులు ఆదరిస్తారని చెప్పాడు. ఇది చాలా ఆకర్షణీయమైన పోటీ అని తాము నిజాయితీగా నమ్ముతున్నట్లు తెలిపారు. యూరోపియన్ యూనియన్ ఫుట్‌బాల్ క్లబ్‌ల్లో కీలక క్లబ్ రియల్ మాడ్రిడ్ యాజమాన్యం ఫిఫా ప్రణాళికలకు ఆమోద ముద్ర వేసింది.

వరల్డ్‌కప్‌లో మూడు బిలియన్ డాలర్ల ఆదాయం
ప్రతి క్లబ్ వరల్డ్ కప్ టోర్నమెంట్ నుంచి 75 శాతం సుమారు మూడు బిలియన్ల డాలర్ల ఆదాయం సంపాదించాలని ఫిఫా లక్ష్యంగా పెట్టుకున్నది. దీంతోపాటు ఇన్వెస్టర్ల కన్సార్టియం నుంచి మరికొంత ఆదాయం సంపాదించాలని ఫిఫా ప్రణాళిక. గతేడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో జరిగిన టోర్నమెంట్‌లో ఫిఫాకు 37 మిలియన్ల డాలర్ల ఆదాయం లభించింది.

రోజుకు నొవొన్‌గొరోడ్ స్టేడియానికి 12 వేల మంది సందర్శకులు
రష్యాలో వచ్చే నెలలో జరుగనున్న ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్ నిర్వహణ కోసం సిద్ధం చేసిన నిజ్నీ నొవ్‌గొరోడ్ స్టేడియాన్ని సందర్శకుల కోసం తెరిచారు. ఒక్క శనివారం నాడే 11,900 మంది సందర్శకులు స్టేడియాన్ని సందర్శించారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి క్రొయేషియా నేషనల్ టీమ్ మాజీ గోల్ కీపర్ స్టైప్ ప్లెటికోసా, నిజ్ని నొవ్‌గొరోడ్ రీజియన్ తాత్కాలిక గవర్నర్ డిమిట్రీ స్వాట్కోవ్‌స్కీ తదిరులు హాజరయ్యారు.

ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కోసం స్టేడియాలు సిద్ధం
మార్చి నెలాఖరు నుంచి రష్యాలో ఫుట్ బాల్ మ్యాచ్ లు నిర్వహించనున్న పార్కులను సందర్శకుల కోసం తెరిచి ఉంచారు. మార్చి 24న సోచీలోని బ్లాక్ సీ రిసార్ట్ పక్కన గల స్టేడియం తెరిచారు. ఈ సందర్భంగా ప్రజలను ప్రోత్సహించేందుకు ఓపెన్ ఎయిర్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, మల్టీ మీడియా క్విజ్‌లు నిర్వహించారు. ప్రముఖ ఫుట్ బాల్ ప్లేయర్లతో స్థానికుల ఇష్టాగోష్టి చర్చలను ఏర్పాటు చేశారు.

రష్యాకు ఇలా ఆతిథ్య హక్కులు
తాజాగా సెయింట్ పీటర్స్ బర్గ్‌లో ఈ నెల 19 - 20 తేదీల మధ్య సెయింట్ పీటర్స్ బర్గ్‌లో, జూన్ 2 - 3 తేదీల్లో కలినింగ్రాడ్ స్టేడియంను సందర్శకుల కోసం తెరుస్తారు. చివరిగా జూన్ 17వ తేదీన రెడ్ స్క్వేర్‌ను ఫుట్‌బాల్ పార్క్ మార్చే కార్యక్రమం నిర్వహిస్తారు. ఇది చాంపియన్ షిప్ ముగిసే వరకు కొనసాగుతుంది. 2010లో గ్వాటెమాలలో ఇంగ్లండ్ - పోర్చుగల్ - స్పెయిన్, బెల్జియం - నెదర్లాండ్స్ బిడ్లపై పై చేయి సాధించి రష్యా ఆతిథ్య హక్కులను గెలుచుకున్నది.


Click it and Unblock the Notifications














