న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

లీగ్ టైటిల్ సొంతం గెలుచుకున్న రియల్ మాడ్రిడ్

Real Madrids historic Champions League title obscured by online outrage

హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక చాంపియన్స్‌ లీగ్‌ సాకర్‌ టైటిల్‌ను గెలిచి రియల్‌ మాడ్రిడ్‌ జట్టు నిలబెట్టుకుంది. ఛాంపియన్స్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో రొనాల్డో జట్టు రియల్‌మాడ్రిడ్‌కు తిరుగులేకుండా పోయింది. ఆదివారం జరిగిన ఫైనల్లో సెర్జియో రామస్ కెప్టెన్సీలోని రియల్‌ మాడ్రిడ్‌ 3-1 గోల్స్‌ తేడాతో లివర్‌పూల్‌ను ఓడించి వరుసగా మూడోసారి విజేతగా నిలిచి హ్యాట్రిక్‌ కొట్టింది.

మాడ్రిడ్‌ ఆటగాడు సబ్‌స్టిట్యూట్‌ బాలె రెండు గోల్స్‌తో సత్తాచాటడంతో ఫైనల్లో రియల్‌మాడ్రిడ్‌ 3-1తో లివర్‌పూల్‌పై గెలిచి వరుసగా మూడో ఏడాది టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. లివర్‌పూల్‌ ఆటగాడు బెంజిమా (51వ నిమిషంలో) గోల్‌ కొట్టి తన జట్టు ఖాతా తెరిచాడు. వెంటనే రియల్‌ మాడ్రిడ్‌ ఆటగాడు సడియో (55వ నిమిషంలో) గోల్‌ చేసి స్కోరు సమం చేశాడు.

ఆ తర్వాత సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చిన బాలె జోరు కనబరచాడు. వెనక్కి ఎగురుతూ కళ్లుచెదిరే రీతిలో గోల్‌ (64వ నిమిషంలో) చేసి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. మ్యాచ్‌ మరికొద్ది సేపట్లో ముగుస్తుందనగా మరో గోల్‌ చేసి జట్టును విజేతగా నిలిపాడు.

జూన్ 14వ తేదీ నుంచి జరగనున్న ఫిఫా క్రీడోత్సవానికి ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే ఈ మ్యాచ్‌ తరహా విజయాలను అందుకోవచ్చని రియల్ మాడ్రిడ్ జట్టు కెప్టెన్ సెర్జియో రామస్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.

Story first published: Monday, May 28, 2018, 10:01 [IST]
Other articles published on May 28, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X