న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

సమన్వయం లోపంతో సతమతమవుతోన్న నెయ్‌మర్

Real Madrids door open for Neymar but players want Cristiano Ronaldo stay, says Marcelo

హైదరాబాద్: బ్రెజిల్ జట్టు దిగ్గజం.. మూడు ప్రపంచకప్‌లలో నెగ్గిన ఒకే ఒక్కడు పీలే బ్రెజిల్‌ జట్టుపై ఆందోళన వ్యక్తం చేశాడు. కానీ, ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌లో బ్రెజిల్‌ ప్రధాన ఫేవరెట్‌ సాంబా జట్టు ఆరో ప్రపంచకప్‌ ఖాతాలో వేసుకోనుందని విశ్లేషకుల భావిస్తున్నారు. జట్టులో నిపుణులుంటే సరిపోదని, జట్టుగా ఆడినప్పుడే విజయం దక్కుతుందని, బ్రెజిల్‌కు సరైన మేళవింపు లేదని విచారం వ్యక్తం చేశాడు. టైట్‌ కోచ్‌ బాధ్యతలు చేపట్టాక గత 20 మ్యాచ్‌ల్లో బ్రెజిల్‌ ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడింది.

కొంతకాలంగా ఆటగాళ్ల గాయాల కారణంగా తరుచూ జట్టులో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. 'టైట్‌ సత్తాపై నాకెలాంటి సంశయం లేదు. ఆందోళనంతా జట్టు కూర్పు గురించే. ప్రపంచకప్‌ ఆరంభానికి ఇంకెంతో సమయం లేదు. అయినా ఇప్పటికీ బ్రెజిల్‌కు సరైన మేళవింపు లేదు. జట్టులో సత్తాఉన్న ఆటగాళ్లే ఉన్నారు. ఐతే వారు జట్టుగా ఇంకా కలిసిపోలేదు' అని పీలె చెప్పాడు.

స్టార్‌ ఆటగాడు నెయ్‌మార్‌ గురించి మాట్లాడుతూ.. 'ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాళ్లలో నెయ్‌మార్‌ ఒకడు. ఇప్పుడు అతడు ఎంతో అనుభవం సంపాదించాడు. పరిణతి సాధించాడు. అయినా అతడొక్కడే బ్రెజిల్‌కు కప్పు అందించలేడన్నది వాస్తవం. సమష్టిగా ఆడినప్పుడే ప్రపంచకప్‌ సాధ్యం. ప్రపంచకప్‌లో తలపడిన బ్రెజిల్‌ జట్లలో 1970 ప్రపంచకప్‌ ఆడిన జట్టు అత్యుత్తమమైంది. మేటి ఆటగాళ్లు జట్టులో ఉన్నా.. అప్పుడు ఆరు నెలలు కలిసి సాధన చేశాం. అది మంచి ఫలితాన్నిచ్చింది' అని పీలె వివరించాడు.

ప్రపంచకప్‌ ఆరంభానికి ముందు ఆదివారం ఆస్ట్రియాతో బ్రెజిల్‌ తన చివరి వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. గ్రూప్‌-ఈలో ఉన్న బ్రెజిల్‌ జూన్‌ 17న స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌తో పోరాటాన్ని ఆరంభించనుంది.

Story first published: Friday, June 8, 2018, 9:13 [IST]
Other articles published on Jun 8, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X