Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేను ‘గే’ను.. ప్రముఖ మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్ ట్వీట్..! ఆ తర్వాత అదిరిపోయే ట్విస్ట్

Real Madrid Captain Iker Casillas Shocking statement After that He Deleted and Did a Prank

రియల్ మాడ్రిడ్ మాజీ కెప్టెన్ ఇకర్ కాసిల్లాస్ తాను గే (స్వలింగ సంపర్కుడు)నని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు. ఈ ప్రకటనతో 41ఏళ్ల అతను తానో గే అనే విషయాన్ని ధ్రువీకరించిన ఉన్నత స్థాయి ఆటగాళ్లలో ఒకడిగా పేరొందాడు. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ అయిన రియల్ మాడ్రిడ్‌కు ఏళ్లుగా గోల్ కీపర్‌గా కాసిల్లాస్ ఆడాడు. ఇక తానో గే అనే విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. 'మీరు నన్ను గౌరవిస్తారని ఆశిస్తున్నాను, నేను గేను' అని కాసిల్లాస్ పేర్కొన్నాడు. ఇన్నాళ్లుగా ఈ విషయాన్ని గోప్యంగా దాచినందుకు నా పట్ల ద్వేషభావాన్ని ప్రదర్శించబోరని అనుకుంటున్నా అంటూ అతను పేర్కొన్నాడు. అతని ప్రకటనతో సోషల్ మీడియాలో అతనికి పలువురు ప్రముఖుల నుంచి మద్దతు లభించింది. అతని మద్దతుదారుల్లో బార్సిలోనా మాజీ కెప్టెన్ కార్లెస్ పుయోల్ ఒకరు.

41ఏళ్ల కాసిల్లాస్ స్పెయిన్ జాతీయ జట్టు తరఫున అలాగే.. రియల్ మాడ్రిడ్ క్లబ్ జట్టు తరఫున అద్భుతమైన కెరీర్‌ను కలిగి ఉన్నాడు. ఓ ప్రపంచ‌కప్, రెండు యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లు, ఐదు లా లిగా ఛాంపియన్‌షిప్‌లు, మూడు ఛాంపియన్స్ లీగ్ టైటిళ్లను గెలుపొందిన జట్టులో కీలక సభ్యుడిగా కాసిల్లాస్ ఉన్నాడు. రియల్ మాడ్రిడ్‌ తరఫున ఏకంగా 25సంవత్సరాల అనుబంధాన్ని కలిగి ఉన్నాడు. తొమ్మిదేళ్ల నుంచి ఆ క్లబ్ తరఫున యంగ్ ప్లేయర్‌గా చేరాడు. ఇక అతను స్పోర్ట్స్ జర్నలిస్ట్ సారా కార్బోనెరోను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరు 2021 మార్చిలో విడిపోయారు. అయిదేళ్ల వీరి దాంపత్య జీవితంలో ఈ జంటకు ఇద్దరు కుమారులు పుట్టారు. విడిపోయినప్పటికీ.. తాము తమ కుమారులకు తల్లీదండ్రులుగా కొనసాగుతామని పేర్కొన్నాడు. 'సారాతో నా దాంపత్య జీవితంలో నేను ఎంతో ఆనందాన్ని, ప్రేమను అనుభవించాను. ఆమెతో ఈ అయిదేళ్లు గడపడం పట్ల చాలా గర్వంగా ఉంది. విడిపోయినప్పటికీ.. మా ప్రేమ మాత్రం మా పిల్లల రూపంలో మాతో ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది.' అని కాసిల్లాస్ పేర్కొన్నాడు.

అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఇకర్ కాసిల్లాస్ సోషల్ మీడియాలో తాను గేనంటూ పేర్కొన్న ట్వీట్ తర్వాత డిలీట్ చేశాడు. తన మీద ఇటీవల వస్తున్న పుకార్లను తిప్పికొట్టడానికి అతను ఈ ట్వీట్ చేశాడు. గతేడాది తన భార్యతో విడిపోయాక.. అతను చాలా మంది మహిళలతో వివాహేతర సంబంధాలు నెలకొల్పాడంటూ వార్తలు గుప్పుమన్నాయి. అందులో ప్రముఖమైన పేరు నటి అలెజాండ్రా ఒనీవా. ఆమెతో కాసిల్లాస్ సంబంధం నెరుపుతున్నారనే వార్తలు ఊపందుకోవడంతో టాపిక్ డైవర్ట్ చేయాలనే ఉద్దేశంలో అతను ఈ ట్వీట్ చేశాడు. నిజానికి తాను గేను కానని పేర్కొన్నాడు. అయితే ఇలా ప్రాంక్ చేసినందుకు తన ఫాలోవర్లకు కాసిల్లాస్ క్షమాపణలు చెప్పాడు.

Story first published: Sunday, October 9, 2022, 20:43 [IST]
Other articles published on Oct 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+