Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

2021 వరకు రియల్ మాడ్రిడ్‌తోనే: రొనాల్డో

మాడ్రిడ్: లా లీగా లీగ్ జెయింట్స్‌లో ఒక్కటైన రియల్ మాడ్రిడ్ తన స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోతో 2021 వరకు కాంట్రాక్ట్‌ను కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని రియల్ మాడ్రిడ్ యాజమాన్యం ప్రకటించింది. త్వరలో రొనాల్డోతో కాంట్రాక్ట్‌పై ఒప్పందం కుదుర్చుకుంటామని తెలిపింది.

కాగా, ఇప్పటివరకు రియల్ మాడ్రిడ్ యాజమాన్యంతో రొనాల్డో కాంట్రాక్ట్ 2018 వరకు మాత్రమే ఉంది. తొలుత రొనాల్డో తన జట్టు యాజమాన్యంతో 2009లో రికార్డు స్థాయిలో 104 మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. తాజా ఒప్పందం ప్రకారం రొనాల్డో తనకు 36 ఏళ్ల వయస్సు వచ్చే వరకూ రియల్ మాడ్రిడ్ తోనే కొనసాగనున్నారు.

రియల్ మాడ్రిడ్ ఫ్రాంచైసీతో కాంట్రాక్ట్ కొనసాగింపుపై రొనాల్డో ఏజెంట్ జోర్జ్ మెండిస్.. సంస్థ యాజమాన్యం బ్లాంకోస్ చీఫ్ ఫ్లోరెంటినో పెరేజ్ తో వారం క్రితమే సంప్రదింపులు జరిపారు. సోమవారం బెర్నాబైలో ఆయనతో నూతన కాంట్రాక్ట్ ఒప్పందంపై టీం యాజమాన్యం సంతకాలు చేసింది. దీని ప్రకారం 2021 జూన్ నెలాఖరు వరకు రియల్ మాడ్రిడ్ తోనే రొనాల్డో బంధం కొనసాగనున్నది.

ఈ కాంట్రాక్ట్ ఒప్పందం కార్యక్రమంలో ఫ్రాంచైసీ క్లబ్ అధ్యక్షుడు ఫ్లోరెంటినో పెరెజ్, రొనాల్డో సంయుక్తంగా పాల్గొన్నారు. దీంతో రియల్ మాడ్రిడ్‌ ఫ్రాంచైసీతో ఒప్పందం కుదుర్చుకున్న ప్లేయర్లలో రొనాల్డో ఐదో వ్యక్తి. అమెరికా మ్యాగజైన్ ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం రొనాల్డో వార్షికాదాయం 88 మిలియన్ డాలర్లు. అందులో వేతనం, వివిధ కార్పొరేట్ సంస్థల ప్రచారకర్తగా కుదుర్చుకున్న కాంట్రాక్టుల మొత్తం ఉన్నాయి.

Real Madrid announce new Cristiano Ronaldo contract until 2021

ఎనిమిది సీజన్లలో 360 మ్యాచ్ లు ఆడిన రొనాల్డో 371 గోల్స్ సాధించాడు. కాగా ఇప్పటివరకు లుకా మొడ్రిక్, టోనీ క్రూస్, లుకాస్ వాజ్ క్వెజ్, గారెథ్ బాలె తదితరులు కొన్ని వారాలుగా రియల్ మాడ్రిడ్ జట్టుతో కాంట్రాక్టులు పునరుద్ధరించుకున్నారు. రొనాల్డోతో పోలిస్తే గారెథ్ బాలెకు రియల్ మాడ్రిడ్ అత్యధిక పారితోషికం చెల్లిస్తోందని ఇంగ్లండ్ పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి.

బాలెతో ఆరేళ్ళ కాంట్రాక్ట్ కోసం రియల్ మాడ్రిడ్ యాజమాన్యం 7.5 లక్షల డాలర్లు చెల్లించేందుకు అంగీకారం కుదిరిందని బ్రిటన్ మీడియా వార్తల కథనం. ఇతర రియల్ మాడ్రిడ్ ప్లేయర్లు కూడా తమ కాంట్రాక్టుల పునరుద్ధరణపై ద్రుష్టిని కేంద్రీకరించారు. వచ్చే ఏడాది వేసవితో కాంట్రాక్ ముగిసే డిఫెండర్ పెప్, 2018తో ముగిసే ప్లే మేకర్ ఇస్కో కూడా తమ కాంట్రాక్ట్ పునరుద్ధరించుకోనున్నారు.

గోల్స్‌లో మెస్సీ రికార్డు

లియానెల్ మెస్సీ తన కెరీర్‌లో 500 గోల్స్ మైలురాయిని దాటాడు. రెండు రోజుల క్రితం సెవిల్లాపై జరిగిన మ్యాచ్‌లో బార్సిలోనా తరఫున తన 500 గోల్‌తో విజయం సాధించాడు. ఫుట్ బాల్ కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి అధికారిక లీగ్ పోటీలు, ఫ్రెండ్లీ మ్యాచ్ లతో కలిపి మెస్సీ 500 గోల్స్ మైలురాయిని దాటాడు. వాటిలో469 వివిధ అధికారిక లీగ్ మ్యాచ్ లలో సాదించినవి, మిగతా గోల్స్ అనధికారికమైనవి. మెస్సీ మొత్తం 500 గోల్స్ సాధించాడని బార్సిలోనా యాజమాన్యం ప్రకటించింది.

స్పానిష్ లీగ్ 'లా లీగా' టోర్నీలోనే టాప్ స్కోరర్ గా ఆయన నిలిచాడు. రెండేళ్ల క్రితం అండాలుసియాన్‌పై జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్‌తో జట్టు 5 - 1 స్కోర్ తేడాతో విజయం సాధిస్తే.. మెస్సీ వ్యక్తిగత గోల్స్ సంఖ్య 253కు చేరుకున్నది. అంతకుముందు 251 గోల్స్ చేసిన టెల్మో జర్రా రికార్డును మెస్సీ బద్దలుకొట్టాడు. కాగా, సెవిల్లాపై బార్సిలోనా ఆదివారం 2 - 1 స్కోర్ తేడాతో విజయం సాధించింది.

అండ్రెస్ ఇనెస్టా గైర్హాజరీలో రంగంలోకి దిగిన మెస్సీ.. మ్యాచ్ లో రెండో గోల్ చేయడంతో బార్సిలోనా విజయం ఖరారైంది. బార్సిలోనా తరఫున మెస్సీ చేసిన 320 గోల్స్‌లో అత్యధికంగా లా లీగా టోర్నీలో 16 ఎడిషన్లలో సాధించినవే. అయితే గాయం కారణంగా మధ్యమధ్యలో పలు వారాల పాటు విశ్రాంతి కూడా తీసుకున్నాడు. కాగా, లియానెల్ మెస్సీ 2009 నుంచి వరుసగా ప్రతియేటా బాల్లోన్ డీ'ఓర్ అవార్డును గెలుచుకుంటున్నాడు. ప్రతియేటా మెస్సీకి వరల్డ్ ఫుట్ బాలర్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ ను అందజేయాలని బార్సిలోనా డిఫెండర్ గెర్రాడ్ పీఖ్యూ వ్యాఖ్యానించాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:06 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+