Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐలీగ్: రియల్ కాశ్మీర్‌ క్లబ్‌కు కోచ్‌గా స్కాటిష్ మేనేజర్

శ్రీనగర్: మాజీ స్కాట్లాండ్, గ్లాస్గో రేంజర్స్ ప్లేయర్ డేవిడ్ రాబర్ట్‌సన్‌ను రియల్ కాశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్ (ఆర్‌కెఎఫ్‌సి) కోచ్‌గా నియమించుకున్నది. ఐ-లీగ్ సెకండ్ డివిజన్‌లో ఆడేందుకు కాశ్మీర్ నుంచి సిద్ధమైన రెండో జట్టు రియల్ కాశ్మీర్ ఎఫ్ సి కావడం గమనార్హం.

'రాబర్ట్‌సన్‌ను హెడ్ కోచ్‌ కం మేనేజర్‌గా నియమించుకున్నామని మేం సంతోషిస్తున్నాం. యూరప్ ఖండ దేశాల నుంచి కాశ్మీర్‌లో కోచ్‌ను నియమించుకున్నతొలి జట్టుగా మేం రికార్డు నెలకొల్పాం' అని క్లబ్ అధికారి ఒకరు తెలిపారు. 1990వ దశకంలో ఫుట్ బాల్ క్రీడాకారుడిగా రాబర్ట్‌సన్ వరుసగా తొమ్మిదేళ్లాపటు స్కాటిష్ లీగ్ టైటిళ్లను తాను ప్రాతినిధ్యం వహించిన గ్లాస్గో రేంజర్స్ జట్టుకు సాధించి పెట్టారు.

ఐ-లీగ్ సెకండ్ డివిజన్‌లో రియల్ కాశ్మీర్ ఎఫ్ సితోపాటు లోన్ స్టార్ కాశ్మీర్ ఎఫ్ సి కూడా పాల్గొంటున్నది. ఇరు జట్లు ఈ నెల 21న తలపడనున్నాయి. తిరిగి వచ్చేనెలలో మళ్లీ పోటీ పడతాయని ఆ అధికారి వివరించారు. అయితే స్కాటిష్ కోచ్ కోసం ఎంత మొత్తం ఖర్చుచేస్తున్నారన్న విషయం మాత్రం బహిర్గతంచేయలేదు.

Real Kashmir FC signs Scottish coach for I-League 2nd division

రాబర్ట్ సన్ యుఇఎఫ్ఎ ప్రొ లైసెన్స్‌డ్ కోచ్. గ్లాస్గో రేంజర్స్‌తోపాటు స్కాటిష్ లీగ్ టోర్నీలో అబెర్డీన్ జట్టుకు, ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో లీడ్స్ యునైటెడ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. రాబర్ట్‌సన్ చాలా నిఫుణుడైన ఫుట్‌బాల్ ప్లేయర్. ఆయన నేరుగా వచ్చీ రావడంతోనే జట్టు ప్లేయర్లతో సమావేశమయ్యాడని, కోచింగ్ స్టాఫ్ తోనూ సంప్రదించాడని ఆ అధికారి తెలిపాడు.

జట్టు బలాబలాలు, బలహీనతలు, శక్తి సామర్థ్యాలు అడిగి తెలుసుకున్నాడన్నాడు. ప్రారంభ సీజన్ లోనే రికార్డు నెలకొల్పాలని రియల్ కాశ్మీర్ ఎఫ్ సి జట్టు తలపోస్తున్నది. రాబర్ట్ సన్ అనుభవం తమ జట్టు పురోగతి సాధించేందుకు దోహద పడుతుందని రియల్ కాశ్మీర్ ఎఫ్ సి యాజమాన్యం తలపోస్తోంది.

'వచ్చే ఐ - లీగ్ సెకండ్ డివిజన్‌లో కీలకమైన స్థాయికి చేరుకోవాలన్న లక్ష్యంతోనే డేవిడ్ రాబర్ట్ సన్‌ను కోచ్‌గా నియమించుకున్నాం. లోన్ స్టార్ ఎఫ్ సి జట్టు పూర్తి ప్రమాణాలతో చెలరేగిపోతున్నది. మేం కూడా ఆ స్థాయికి చేరుకోవాలి. మా అంచనాలకు చేరుకునే దిశగానే ఆయన అనుభవాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తున్నాం' అని ఆ అదికారి చెప్పాడు.

సుదీర్ఘ కాలం ఫుట్‌బాల్ ఆటలో నిలబడాలన్న సీరియస్ నెస్‌తోనే యూరోపియన్ యూనియన్ కోచ్ ను నియమించుకున్నామని క్లబ్ అధికారి వివరించారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనన్నాడు. ఈస్ట్ బెంగాల్, మొహున్ బగన్ జట్లతో రియల్ కాశ్మీర్ ఎఫ్ సి తన ప్రయాణం ప్రారంభించిందని, నార్త్ జోన్ లో ఈస్ట్ బెంగాల్ స్థాయిలో బలపడాలన్నదే తమ ఆకాంక్ష అని ఆ క్లబ్ అధికారి చెప్పాడు.

చైనీస్ సూపర్ లీగ్ లోకి మరో బ్రెజిలియన్
మరో బ్రెజిలియన్ ఫుట్ బాలర్ కొరింథియాన్స్ జట్టు మిడ్ ఫీల్డర్ రోడ్రిగౌన్హో కూడా చైనా సూపర్ లీగ్ (సిఎస్ఎల్) లో చేరేందుకు రంగం సిద్ధమైంది. సమీప భవిష్యత్‌లో చైనా వెళ్లేందుకు వసతులు కల్పించాలని రోడ్రిగౌన్హో తన ఏజంట్‌కు సూచించాడు. కొరింథియాన్స్ 2016లో 10 గోల్స్ సాధించాడు.

ఈ ఏడాది కొరింథియాన్స్ యాజమాన్యంతో డిసెంబర్‌తో రోడ్రిగౌన్హో కాంట్రాక్ట్ ముగిసిపోతుంది. చైనీస్ సూపర్ లీగ్ క్లబ్‌ల్లో చేరిపోయిన కొరింథియాన్స్ ప్లేయర్లలో రోడ్రిగౌన్హో మూడో వ్యక్తి. ఇంతకుముందు బీజింగ్ గౌవాన్ జట్టులో రెనాటో అగస్టో, రాల్ఫ్, షాండోంగ్ లునెంగ్ జట్టులో గిల్ చేరారు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+