Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జపాన్ టెస్ట్‌కు రియల్ మాడ్రిడ్ రెడీ: జిడానె

యొకోహమా: తమ జట్టు క్లబ్ వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనేందుకు సిద్ధమని స్పానిష్ ఫుట్ బాల్ లీగ్ జెయింట్స్ 'రియల్ మాడ్రిడ్' హెడ్ కోచ్ జినెడిన్ జిడానె తెలిపాడు. యూరోపియన్ చాంపియన్లుగా రియల్ మాడ్రిడ్ మరోసారి క్లబ్ వరల్డ్ కప్ టైటిల్ గెలుచుకునే వ్యూహంతో ముందుకు వెళుతున్నదన్నాడు. యొకోహమాలో ఇంద్రజాలికుడు క్రిస్టియానో రొనాల్డో సారథ్యంలో మూడేళ్లలో రెండోసారి క్లబ్ కప్ టైటిల్ గెలుచుకునేందుకు అవసరమైన కసరత్తు చేస్తున్నదన్నాడు.

సుదీర్ఘ విమాన ప్రయాణంతో అలసిపోయినా ఇది చాలా సాధారణమని, తమకు తిరిగి పుంజుకోగల సామర్థ్యం ఉన్నదని జిడానె అన్నాడు. మంగళ వారం నుంచి సీరియస్‌గా ప్రాక్టీస్ ప్రారంభిస్తామని చెప్పాడు. అమెరికాలో మెక్సికో క్లబ్ జట్టుపై రియల్ మాడ్రిడ్ గురువారం తలపడనున్నది. 'మేం క్లబ్ వరల్డ్‌కప్ గెలుచుకునేందుకు ఇక్కడికి వచ్చాం. రియల్ మాడ్రిడ్ చాలా ముఖ్యమైన లక్ష్యం కూడా అదే' అని అన్నాడు. తాను వ్యక్తిగతంగా చాలా అలసిపోయానని జిడానె వ్యాఖ్యానించాడు.

'కానీ మా కుర్రాళ్లు మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. గొప్ప క్వాలిటీ గల ప్లేయర్ల కూటమి మాది. తెలివైన ఆటగాళ్లు మా వద్దనున్నారు. ప్రతిరోజూ శిక్షణ పొందుతున్నారు' అని అన్నాడు. మూడు వారాల్లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడామని అయినా ముందుకు వెళ్లడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నాడు. అయితే గారెథ్ బాలె లేకుండా రియల్ మాడ్రిడ్ క్లబ్ వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొంటున్నది. వరుసగా ఐదోసారి టైటిల్ గెలుచుకునేందుకు తహతహలాడుతున్నది.

Real hot shots ready for Japan test, says Zidane

చీల మండల గాయానికి శస్త్ర చికిత్స చేయించుకోవడంతో గారెథ్ బాలె జట్టుకు దూరంగా ఉండగా, టోనీ క్రూస్ కోలుకుని అందుబాటులోకి రావడం జట్టుకు పరిపుష్టినిచ్చేదేనన్నాడు. జట్టు సారథి క్రిస్టియానో రొనాల్డో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. రొనాల్డో వరుసగా మూడోసారి బాల్లోన్ డీ'ఓర్ అవార్డును గెలుచుకుంటారని భావిస్తున్నారు. బ్రెజిలియన్ డిఫెండర్ మార్సెలో మాట్లాడుతూ ఒకవేళ రొనాల్డో గెలుస్తాడా? లేదా? అని చూడాల్సిందేనన్నాడు. క్రిస్టియానో గెలుచుకుంటాడా? లేదా? అని ఒకింత ఆందోళనగా ఉందన్నారు.

ఈ అవార్డుకు ఆయనే సరైన వ్యక్తి కనుక ఆయన్ను గౌరవించాలన్నాడు. రియల్ మాడ్రిడ్ క్లబ్ అధ్యక్షుడు ఫ్లొరెంటినొ పెరెజ్ మాట్లాడుతూ చాంపియన్స్ లీగ్, యెఫా సూపర్ కప్, క్లబ్ వరల్డ్ కప్ గెలుచుకోవాలన్నాడు. కానీ మార్సెల్లో స్పందిస్తూ 'ఇది రియల్ మాడ్రిడ్ జట్టు. మేమే గెలుస్తాం. ఆసక్తిగా ఉన్న షెడ్యూల్ లో దూసుకెళ్లాలంటే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే టైటిల్ గెలుచుకోవాలన్న మా ప్లేయర్ల కల నెరవేరదు'అని చెప్పాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+