న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

సినిమా హీరోకు తన జెర్సీని బహుమతిగా ఇచ్చిన లియోనల్ మెస్సీ

Ranbir Kapoor had his very own fan moment when he received an exciting birthday gift signed by Lionel Messi

న్యూ ఢిల్లీ: ప్రముఖ బార్సిలోనా ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు లియోనెల్‌ మెస్సీ బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఈ నెల 28న 36వ పుట్టినరోజు జరుపుకుంటోన్న రణ్‌బీర్‌కు అనుకోని బహుమతినిచ్చి ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ హిందీ హీరోకు సినిమాలే కాదు ఫుట్‌బాల్‌ అన్నా, మెస్సీ అన్నా ఎంతో అభిమానం. ఒకానొక సందర్భంలో రణ్‌బీర్‌ మెస్సీని కలిసి ఫొటో కూడా దిగారు.

ఫుట్‌బాల్‌పై ఉన్న అభిమానంతో ‌ముంబై సిటీ ఫుట్‌బాల్‌ క్లబ్‌‌కు రణ్‌బీర్‌ యజమానిగా వ్యవహరిస్తున్నారు. రణ్‌బీర్‌ పుట్టినరోజు సందర్భంగా మెస్సీ తన వద్ద ఉన్న జెర్సీను కానుకగా ఇచ్చారు. ఆ జెర్సీపై తన సంతకం కూడా చేశారు. రణ్‌బీర్‌ ఈ జెర్సీ వేసుకుని వెళుతున్నప్పుడు ముంబై ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీశారు. ప్రస్తుతం రణ్‌బీర్‌ 'బ్రహ్మాస్త్రా' చిత్రంతో బిజీగా ఉన్నారు.

అయాన్‌ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆలియా భట్‌ కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, టాలీవుడ్‌ కింగ్‌ అక్కినేని నాగార్జున కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్ర పరిశ్రమను మరోస్థాయికి తీసుకు వెళ్లేలా ఈ సినిమా ఉండబోతోందని చిత్రబృందం వెల్లడించింది.

ప్రస్తుతం మెస్సీ అంత దూకుడుగా ఆడుతున్నట్లు కనిపించడం లేదు. ఈ మధ్యనే విడుదలైన ఫిఫా ర్యాంకింగ్స్ జాబితాలో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. ఫిఫా ద బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌కు నామినేషన్‌కు ఎంపికైనప్పటికీ.. అవార్డు మాత్రం లూకా మోడ్రిచ్‌కే దక్కింది. బార్సిలోనా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మెస్సీ తమ జట్టు గెలిచేందుకు ఎంత కృషి చేస్తున్నా పునర్వైభవాన్ని సంతరించుకోలేకపోతోంది.

Story first published: Sunday, September 30, 2018, 13:56 [IST]
Other articles published on Sep 30, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X