ఫిఫా: సౌదీపై రష్యా తొలి గోల్.. పుతిన్ రియాక్షన్ చూశారా? (వీడియో)


హైదరాబాద్: గెలుపు కోసం ఎనిమిది నెలల తరబడి సాగుతున్న రష్యా నిరీక్షణ ఫిఫా వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌తో తీరింది. గురువారం ప్రారంభమైన ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలో అతి తక్కువ ర్యాంకు(70)తో బరిలోకి దిగిన ఆతిథ్య రష్యా తొలి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది.
మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో గురువారం సౌదీ అరేబియాతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య రష్యా జట్టు 5-0 తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. సొంతగడ్డపై అభిమానుల మద్దతుతో మైదానంలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.

రష్యా తిరుగులేని ఆధిపత్యం
ఎటాకింగ్ గేమ్‌తో ప్రత్యర్థిని ధీటుగా ఎదుర్కొన్న రష్యా జట్టు మ్యాచ్ ఆద్యంతం అదే జోరుతో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బంతిని ఎక్కువ సమయం ఆధీనంలో ఉంచుకున్నప్పటికీ సౌదీ జట్టు ఒక్క గోల్ కూడా చేయలేక పోయింది. రష్యా తరఫున చెరిషెవ్ రెండు గోల్స్ కొట్టగా, గజిన్‌స్కి, జుబా, గోలోవిన్ తలో గోల్ సాధించారు.
12వ నిమిషంలోనే వరల్డ్ కప్‌లో తొలి గోల్
దీంతో ఆరంభ మ్యాచ్‌లో 5-0 తేడాతో రష్యా టోర్నీలో శుభారంభం చేసింది. ఆట మొదలైన 12వ నిమిషంలోనే వరల్డ్ కప్‌లో తొలి గోల్ నమోదైంది. మిడ్‌ఫీల్డర్ గజిన్‌స్కి హెడర్ గోల్‌తో గోల్ కొట్టి.. రష్యాకు తొలి గోల్ అందించాడు. దీంతో రష్యా శిబిరంలో ఆనందం ఒక్కసారిగా రెట్టింపు అయింది.
పుతిన్ రియాక్షన్ ఇలా
అయితే ఈ ఆరంభ మ్యాచ్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, సౌదీ అరేబియా రాజు మహ్మమద్ బిన్ సల్మాన్‌తో పాటు ఫిఫా అధ్యక్షుడు ఇన్‌ఫాన్‌టియో కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో రష్యా తరఫున తొలి గోల్ నమోదైన వెంటనే కెమెరాలన్నీ ఒక్కసారిగా వీఐపీ గ్యాలరీ వైపు మళ్లాయి. తమ జట్టు తరఫున తొలి గోల్ నమోదు కావడంతో ఆశ్చర్యానికి గురైన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆనందంతో సౌదీ రాజుకు కరచాలనం అందించాడు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

రెండో అర్ధభాగంలో మరింత దూకుడుగా ఆడిన రష్యా
ఆటలో భాగంగా తొలి అర్ధ భాగం ముగిసేసరికి రష్యా జట్టు 2-0తో నిలిచింది. ఇక రెండో అర్ధభాగంలో రష్యా మరింతగా రెచ్చిపోయింది. ప్రత్యర్ధి జట్టు గోల్ పోస్ట్‌పైకి 13 సార్లు దాడి చేసింది. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన డియుబా 71వ నిమిషంలో గోల్‌తో ఆధిక్యాన్ని పెంచాడు. 91వ నిమిషంలో చెరిషేవ్ మరో గోల్ చేశాడు. 94వ నిమిషంలో గొలోవిన్ ఫ్రీ కిక్‌ను గోల్‌పోస్ట్‌లోకి పంపడం, ఫైనల్ విజిల్ మోగడం వెంటవెంటనే జరిగిపోయాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications