Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫిఫా వరల్డ్ కప్ సన్నాహాలపై గురువారం పుతిన్ సమీక్ష!

Putin to discuss preparations for 2018 FIFA World Cup in Sochi

హైదరాబాద్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చేనెల 14వ తేదీ నుంచి నెల రోజుల పాటు జరుగనున్న ఫిఫా వరల్డ్ కప్ నిర్వహణా ఏర్పాట్లపై గురువారం సమీక్షించనున్నారు. సోచిలోని బ్లాక్ సీ రిసార్ట్‌లో ఫిఫా వరల్డ్ కప్ లోకల్ ఆర్గనైజింగ్ కమిటీ పర్యవేక్షణ బోర్డు సమావేశం జరుగనుంది.

ఈ సమీక్షా సమావేశంలో ఆయా స్టేడియంల సన్నద్ధత, ఇతర మౌలిక వసతులు తదితర అంశాలను సమీక్షించనున్నారు. అదే విధంగా టోర్నమెంట్ సందర్భంగా అవసరమైన రవాణా, మెడికల్, సమాచార శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన ఏర్పాట్లపై రాష్ట్ర అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమీక్షించనున్నారు.

వరల్డ్ కప్ ఫ్యాన్ పాస్ పోర్టు సెంటర్‌ను సందర్శించనున్న పుతిన్

వరల్డ్ కప్ ఫ్యాన్ పాస్ పోర్టు సెంటర్‌ను సందర్శించనున్న పుతిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ‘వరల్డ్ కప్' ఫ్యాన్ పాస్ పోర్టు సెంటర్‌ను సందర్శిస్తారు. పునర్నిర్మాణంలో ఉన్న ఫిష్ట్ స్టేడియంలో పనుల పురోగతిని తనిఖీ చేస్తారు. జూన్ 14వ తేదీ నుంచి జరిగే ఫిఫా వరల్డ్ కప్‌లో పలు మ్యాచ్‌లు ఈ స్టేడియంలో జరుగనున్నాయి. ఫిఫా టోర్నీ నిర్వహణలో తాజా పరిస్థితులపై ఫిఫా అధ్యక్షుడు జియాన్నీ ఇన్ ఫాంటినోతో సమావేశం కానున్నారు.

ఫిఫా వరల్డ్ కప్ నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షలు ఇలా

ఫిఫా వరల్డ్ కప్ నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షలు ఇలా

రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ నిరంతరం ‘ఫిఫా' వరల్డ్ కప్ నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు. అవసరమైన ఏర్పాట్లపై అధికారులకు సూచనలిస్తున్నారు. మరోవైపు ఫిఫా అధ్యక్షుడు ఇన్ ఫాంటినోనూ అనునిత్యం సంప్రదిస్తున్నారు. దేశం మొత్తం మీద ఏర్పాట్ల పురోగతిపై గత ఏడాది ఫిబ్రవరిలో తొలిసారి వ్లాదిమిర్ పుతిన్.. మే, సెప్టెంబర్, డిసెంబర్ నెలల్లో సమీక్షించారు. ఇటు గత జూన్‌లో సెయింట్ పీటర్స్ బర్గ్‌లో ఫిఫా కాన్ఫిడరేషన్ కప్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో ఫిఫా అధ్యక్షుడు గియాన్నో ఇన్‌పాంటినోతో కలిసి పాల్గొన్నారు.

రష్యాలోని 11 నగరాల్లోని 12 స్టేడియాల్లో మ్యాచ్‌లు

రష్యాలోని 11 నగరాల్లోని 12 స్టేడియాల్లో మ్యాచ్‌లు

2018 ఫిఫా వరల్డ్ కప్ నిర్వహణకు మాస్కోలోని రెండు స్టేడియంలతోపాటు దేశంలోని మరో 11 నగరాల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. గత ఏప్రిల్ నెలలో 2018 వరల్డ్ కప్ లోకల్ ఆర్గనైజింగ్ కమిటీ డైరెక్టర్ అలెక్సీ సొరోకిన్ ఈ సంగతి చెప్పారు. గత శుక్రవారం ఫిఫా నుంచి సమరలోని అరీనా స్టేడియంలో ఫిఫా మ్యాచ్‌ల నిర్వహించడానికి అనుమతి లభించింది. మాస్కో నగరంలోని రెండు స్టేడియంలతోపాటు సెయింట్ పీటర్స్ బర్గ్, సోచి, కజన్, సరాన్ష్క్, కలినింగ్రాడ్, వొలొగ్రాడ్, రొస్టోవ్ ఆన్ డాన్, నిఝ్ని నొవొగొరోడ్, యాకతరింగ్ బర్గ్, సమరల్లోని స్టేడియంలలో సాకర్ కప్ టోర్నీ జరుగనుంది.

మెక్సికో నుంచి భారీగా రష్యాకు అభిమానులు

మెక్సికో నుంచి భారీగా రష్యాకు అభిమానులు

రష్యాలో ప్రపంచ కప్ టోర్నమెంట్‌ను వీక్షించేందుకు మెక్సికో నుంచి భారీగా అభిమానులు తరలి రానున్నారు. పిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్ వల్ల ఇరు దేశాలకు పెట్టుబడి లభించనున్నదని మెక్సికో నగర అధికారులు తెలిపారు. ఫిఫా కథనం ప్రకారం మెక్సికో నుంచి సుమారు 52 వేల మంది అభిమానులు రష్యాకు వచ్చేందుకు టిక్కెట్లు కొనుగోలు చేశారని మాస్కో స్పోర్ట్స్ అండ్ టూరిజం శాఖలో ఆతిథ్య బోర్డు అధిపతి అలెక్సై టిఖ్నెంకో చెప్పారు. గతేడాది పలు దఫాలుగా మెక్సికో నుంచి పర్యాటకుల సంఖ్య పెరిగింది. మాస్కోలోని లుఝినికి స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ జట్టుతో మెక్సికో జట్టు జూన్ 17వ తేదీన తల పడనుంది.

Story first published: Wednesday, May 23, 2018, 13:50 [IST]
Other articles published on May 23, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+