Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫిఫా వరల్డ్‌కప్: సౌదీతో ప్రారంభ మ్యాచ్‌కు పుతిన్

Putin to attend 2018 FIFA World Cup opening match between Russia, Saudi Arabia

హైదరాబాద్: మరో 35 రోజుల్లో రష్యా రాజధాని మాస్కో వేదికగా 2018 ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ సంరంభం ప్రారంభం కానున్నది. జూన్ 14న మాస్కోలో సౌదీ అరేబియా జట్టుతో జరుగనున్న ప్రారంభ మ్యాచ్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరు కానున్నారని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిట్రీ పెస్కోవ్ తెలిపారు.

19న ఈజిప్టు జట్టుతో రష్యా ఢీ ఇలా

19న ఈజిప్టు జట్టుతో రష్యా ఢీ ఇలా

‘ఇప్పటివరకు దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్ వీక్షించడానికి హాజరు కానున్నారు. రష్యా, సౌదీ అరేబియా మధ్య జరుగనున్న మ్యాచ్‌ను వీక్షించనున్నారు' అని డిమిట్రీ పెస్కోవ్ చెప్పారు. ఇతర సాకర్ కప్ మ్యాచ్‌లకు హాజరవుతారా? లేదా? అన్న విషయం పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఇక జూన్ 19వ తేదీన ఈజిప్టుతో, 25వ తేదీన ఉరుగ్వే జట్టుతో రష్యా తలపడనున్నది.

గ్రూప్ ‘ఎ’లో రష్యా జట్టు

గ్రూప్ ‘ఎ’లో రష్యా జట్టు

తొలిసారి రష్యా వచ్చేనెల 14 నుంచి సాకర్ కప్‌కు ఆతిథ్యం ఇస్తోంది. ఆతిథ్య రష్యా జట్టు సౌదీ అరేబియా, ఈజిప్టు, ఉరుగ్వే జట్లతో కలిసి గ్రూప్ ‘ఎ'లో ఉంటుంది. గ్రూప్ బీలో పోర్చుగల్, స్పెయిన్, ఇరాన్, మొరాకో ఆడతాయి. గ్రూప్ సీలో ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, పెరు, డెన్మార్క్ ఉంటాయి. గ్రూప్ ‘ఇ' లో ఐస్ లాండ్, క్రొయేషియా, నైజీరియా, అర్జెంటీనా, గ్రూప్ ఎఫ్‌లో బ్రెజిల్, స్విట్జర్లాండ్, కోస్టారికా, సెర్బియా జట్లు సభ్య దేశాలుగా ఉంటాయి. గ్రూప్ జీలో బెల్జియం, పనామా, ట్యునిషియా, ఇంగ్లండ్.. గ్రూప్ హెచ్‌లో పోలండ్, కొలంబియా, సెనెగల్, జపాన్ ఆడతాయి.

రష్యా జట్టు మెరుగైన ప్రదర్శనపై పుతిన్ ఆశాభావం

రష్యా జట్టు మెరుగైన ప్రదర్శనపై పుతిన్ ఆశాభావం

తాము ఆతిథ్యం ఇస్తున్న సాకర్ కప్‌లో తమ జట్టు మెరుగైన ఆట తీరు ప్రదర్శిస్తుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యర్థి జట్లకు రష్యా టీం సభ్యులంతా చివరి క్షణం వరకు ధ్రుడ నిశ్చయంతో గట్టి పోటీ ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన ఫిఫా వరల్డ్ కప్ నిర్వాహక కమిటీ సమావేశంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అభిమానుల కళ్లన్నీ మా ఆటతీరుపైనే

అభిమానుల కళ్లన్నీ మా ఆటతీరుపైనే

సాకర్ కప్‌కు వివిధ దేశాల ప్రతిభావంతులైన ఫుట్‌బాల్ ఆటగాళ్లు హాజరవుతున్నారని గుర్తు చేశారు. కానీ రష్యన్ అభిమానుల కళ్లన్నీ తమ జట్టు సభ్యుల ఆటతీరుపైనే ఉన్నాయని చెప్పారు. జట్టు సభ్యులు, కోచ్‌లకు అభినందనలు తెలిపారు.

Story first published: Wednesday, May 23, 2018, 13:54 [IST]
Other articles published on May 23, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+