ఐఎస్ఎల్: చివరి క్షణంలో పుణె థ్రిల్లింగ్ విజయం
ముంబై: పుణె ఆశలు ఆ జట్టు ప్లేయర్ ఎవాంగ్సన్ లింగ్దో సజీవంగా నిలిపాడు. గురువారం రాత్రి ముంబై సిటీపై జరిగిన మ్యాచ్ చివరి నిమిషంలో లింగ్డో చేసిన గోల్ పుణెను 1 - 0 స్కోర్ ఆధిక్యంతో విజయ తీరాలకు చేర్చింది. ఈ సీజన్ లో పుణెకిది రెండో గెలుపు కావడం గమనార్హం.
తద్వారా పుణె సెమీ ఫైనల్స్ పై ఆశలు సజీవంగా ఉన్నాయి. బెంగళూరు ఎఫ్‌సి తరఫున ఎఎఫ్ సి ఫైనల్స్‌లో పాల్గొని వచ్చిన తర్వాత లింగ్డో ఐఎస్ఎల్ మ్యాచ్‌లో పాల్గొనడం ఇదే మొదటిసారి. గురువారం మ్యాచ్ అద్యంతం పరస్పరం అటాకింగ్‌తోనే ముగింపు దశకు చేరుకున్నది.
89వ నిమిషంలో ముంబై గోల్ కీపర్ అల్బినో గోమ్స్ ఎడమ వైపున బంతిని నారాయణ్ దాస్ క్రాస్ చేయకుండా అడ్డుకొనేందుకు తన లైన్ దాటి బయటకు వచ్చిన అవకాశాన్ని లింగ్డో సావకాశంగా మార్చుకున్నాడు. బంతిని గోల్ పోస్ట్ దారి పట్టించి జట్టుకు విజయం చేకూర్చి పెట్టాడు.

నాలుగో స్ధానంలో ముంబై సిటీ
అయితే గురువారం మ్యాచ్ లో ఓటమి పాలైనా ముంబై సిటీ 10 మ్యాచ్‌ల్లో 15 పాయింట్లతో టాప్ 4లో రెండో స్థానంలో కొనసాగుతుండగా, తొమ్మిది మ్యాచ్ ల్లో 12 పాయింట్లు సాధించి నాలుగో స్థానానికి చేరుకున్నది. అన్ని బ్లాక్ ల్లోనూ ముంబై సమర్థవంతంగా వ్యవహరిస్తూ సుదూరం నుంచి తమ స్ట్రయికర్లతో గోల్ పాయింట్ సాధించేందుకు ప్రయత్నిస్తే.. పుణె కుర్రాళ్లు సైతం తామేమీ తీసిపోలేదన్నట్లు దీటుగా ఎదుర్కోవడంతో చివరి క్షణం వరకు గోల్ చేయడం ఎవరికీ సాధ్యం కాలేదు. ముంబై కీలక ప్లేయర్ లియోకోస్తా గాయంతో వైదొలగడంతో థియాగో చున్హాను రీప్లేస్ చేశారు.

ఒత్తిడి పెంచిన ముంబై
దానికి అనుగుణంగా డివిడెండ్ అందుకున్నది. చున్హా, సెహ్నాజ్ సింగ్ కలిసి పంపిన బంతిని పుణె గోల్ కీపర్ ఎడెల్ బెటె అడ్డుకున్నాడు. కానీ చున్హా దూరం నుంచి బార్ మీదుగా బంతిని పంపినా ప్రయోజనం లేకపోయింది. ఆ తర్వాత గుడ్ వర్క్ కొనసాగించిన చున్హా మరోసారి బంతిని డేంజరస్ క్రాస్ ద్వారా మాటియాస్ డెఫెడెరికోకు పంపినా ఆయన సకాలంలో స్పందించలేకపోయాడు. మరోసారి సారధి డియాగో ఫోర్లాన్ కు పంపిన బంతిని కీపర్ బెటె నిలువరించాడు. డెఫెడెరికో ద్వారా గోల్ సాధించేందుకు ముంబై పెంచిన ఒత్తిడిని కీపర్ ఎడెల్ బెటె అడ్డుకోవడంతో ఫస్టాఫ్ గోల్ చేయకుండానే ముగిసింది.

స్ట్రాంగ్‌గా ముంబై బ్యాక్ లైన్ సెటప్
మరోవైపు పుణె సారధి మహ్మద్ సిస్సోకో.. రాహుల్ భెకెతో కలిసి కొన్ని నిమిషాల పాటు తెలివిగా దూసుకెళ్లినా ముంబై బ్యాక్ లైన్ సెటప్ వారిని నిలువరించింది. బెంగళూరు ఎఫ్ సి సారధి సునీల్ ఛెత్రి రాకతో మ్యాచ్ నెమ్మదిగా ముందుకు సాగింది. బెంగళూరు ఎఫ్ సి జట్టు ఈనెల ఐదో తేదీన దోహాలో జరిగిన ఎఎఫ్ సి ఫైనల్స్‌లో ఓటమితో వెనుదిరిగిన సంగతి తెలిసిందే. డియాగో ఫోర్లాన్ కొంత మ్యాజిక్ చేసినా రెండు జట్లకు గోల్ సాధ్యపడలేదు. సెకండాఫ్ లోనూ సునీల్ ఛెత్రి, ఐబోర్లాంగ్ ఖోంగ్జీ, డెఫెడెరికోలతో కూడిన ముంబై సిటీ జట్టు మ్యాచ్ పై ఆధిపత్యం కొనసాగించింది.

విజయవంతంగా పుణె డిఫెన్స్
ముంబై కుర్రాళ్ల ప్రతి షాట్ ను కూడా పుణె డిఫెన్స్ విజయవంతంగా తిప్పికొట్టింది. మరోసారి డియాగో ఫోర్లాన్ బంతిని క్రిస్జిషాన్ వాడోక్ కు బంతిని పాస్ చేసినా.. అతడు టార్గెట్‌ను చేరుకోవడంలో విఫలం అయ్యాడు. ఇక చివరి దశలో ఫోర్లాన్ దూరం నుంచి పంపిన ఫ్రీ కిక్ బంతిని ఎడెల్ బెటె గోల్‌పోస్ట్ వద్ద క్రాస్ బార్‌పై అడ్డుకోవడంతో పక్కకు తప్పుకుని వెళ్లిపోయింది.

చివరి నిమిషంలో మ్యాచ్‌ను మలుపు తిప్పిన లింగ్డో గోల్
ఇక పుణె జట్టు ద్రామనె ట్రార్ స్థానంలో లింగ్డోనూ రంగంలోకి దించింది. మరో ప్లేయర్ జీసస్ టాటూ పుణెకు పలు అవకాశాలు కల్పించాడు. జొన్నాథన్ లుక్కాకు కొన్నిమంచి బంతులు పంపాడు. కానీ లుక్కా కొట్టిన బంతులన్నీ నేరుగా అల్బినో గోమ్స్ అడ్డుకోవడంతో గోల్స్ రాలేదు. బెటె పదేపదే బయటకు వచ్చి బంతిని సేవ్ చేస్తున్న దశలో ఫోర్లాన్ కొట్టిన కిక్ వల్ల కూడా ప్రయోజనం లేకపోగా డ్రా దిశగా వెళుతున్న మ్యాచ్ ను చివరి నిమిషంలో లింగ్డో తన గోల్‌తో మలుపు తిప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications