
ఢిల్లీ కియాన్ లూయిస్ గోల్ తో శుభారంభం
ప్రత్యేకించి పుణె సారధి మహ్మద్ సిస్సోకో పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ మిస్సయినా అలరించాడు. తర్వాత ఫస్టాఫ్‌కు ఒక నిమిషం ముందు ఢిల్లీ కియాన్ లూయిస్ గోల్ తో శుభారంభాన్ని అందించాడు. సెకండాఫ్.. తర్వాత ఇంజ్యూరీ సమయంలో పుణె కుర్రాళ్లు దూకుడుగా ఆడి నాలుగు గోల్స్ సాధించారు.పుణె జట్టులో అనిబల్ రోడ్రిగెజ్ (55వ, 63వ) రెండు గోల్స్ సాధించగా, మహమ్మద్ సిసాకో (62వ), లెన్నీ రోడ్రిగెజ్ (90వ) చెరో గోల్ చేశారు. ఢిల్లీ తరఫున కీన్ లూయిస్ (44వ), ఎడ్వర్డో ఫెరీరా (79వ), ఇంజ్యూరీ టైమ్‌లో మల్సాముజులా గోల్స్ సాధించారు.

4-3 స్కోర్ తేడాతో విజయం
ఫలితంగా ఢిల్లీ డైనమోస్ జట్టుపై అంటోనియో హబాస్ కుర్రాళ్లు 4 - 3 స్కోర్ తేడాతో విజయం సాధించారు. మ్యాచ్ ప్రారంభంలోనే పుణెకు లీడ్ సాధించేందుకు చాలా మంచి అవకాశమొచ్చింది. మూడో నిమిషంలోనే ఇన్ సైడ్ బాక్స్ల్‌లో మహ్మద్ సిస్సోకో తెలివిగా పాస్ చేసిన బంతిని ఫెరీరా, సోరం పౌరెరీతో కలిసి నేరుగా గోల్ పోస్ట్ దారి మళ్లించినా ఢిల్లీ గోల్ కీపర్ డొబ్లాస్ కార్నర్‌లో అడ్డుకున్నాడు. మాలౌదా పంపిన బంతిని ఎడెల్ బెటె తిరగొట్టిన మరుక్షణమే పుణె కుర్రాళ్లు అటాకింగ్ కు దిగారు.

14వ నిమిషంలో గోల్ చేసే అవకాశం
విజిటర్స్ జట్టు ఢిల్లీకి 14వ నిమిషంలో గోల్ చేసే అవకాశం వచ్చింది. సౌవిక్ చక్రవర్తి పంపిన బంతిని ఫ్లోరెంట్ మాలౌదా.. పుణె డిఫెన్స్‌ను అధిగమించి గోల్ పోస్ట్‌కు పంపినా ఎడెల్ బెట్ స్పీడ్‌గా స్పందించి దానికి అడ్డుకట్ట వేశాడు. మరో ఐదు నిమిషాలకు మలౌదాకు పెనాల్టీ ఏరియాలో ఔట్ సైడ్ నుంచి మరో అవకాశం చిక్కింది. కానీ పుణె కస్టోడియన్ ఎడెల్ బెటె తిరగొట్టడంతో మాలౌదా ప్రయత్నం వ్రుథా ప్రయాసైంది. ఢిల్లీ సంచలనం మార్సిలిన్హో తన డీప్ ఇన్ సైడ్ ఆఫ్ లో గోల్ చేసేందుకు అద్భుతమైన అవకాశం లభించినా పుణె డిఫెన్స్ అడ్డుకున్నది.

అటాకింగ్‌కు దిగిన ఢిల్లీ
మెమో ద్వారా తెలివిగా ఢిల్లీ అటాకింగ్ కు దిగింది. ఫస్టాఫ్‌కు ఒక నిమిషం ముందు మెమో పంపిన బంతిని కియాన్ లూయిస్ ఎటువంటి పొరపాటు లేకుండా గోల్ పోస్ట్‌కు చేర్చడంతో ఢిల్లీ ఒక పాయింట్ లీడ్ సాధించింది.
పుణె సెకండాఫ్ పది నిమిషాల్లో ఢిల్లీ స్కోర్ ను సమంచేసింది. 55వ నిమిషంలో జొన్నాథన్ లుక్కా ఫర్ ఫెక్ట్‌గా పంపిన బంతిని అనిబల్ రోడ్రిగెజ్ కుడివైపు నుంచి ఫ్రీ కిక్ కొట్టడంతో నేరుగా గోల్‌పోస్ట్‌కు చేరిపోవడంతో స్కోర్ 1 - 1గా సమమైంది. 62వ నిమిషంలో పుణె సారధి మహ్మద్ సిస్సోకోకు మరోసారి జొన్నాథన్ లుక్కా మరో అవకాశం కల్పించాడు.

ఏమాత్రం పొరపాట్లకు తావులేకుండా
ఈ బ్రెజిలియన్ పంపిన ఫ్రీ కిక్ షాట్‌తో అది నేరుగా సిస్సోకో దరికి చేరుకున్నది. ఆయన ఏమాత్రం పొరపాట్లకు తావులేకుండా బంతిని సరిగ్గా గోల్ పోస్ట్ దారి పట్టించాడు. ఆ వెంటనే అనిబల్ రోడ్రిగెజ్ మరో గోల్ సాధించాడు. రుబెన్ రూచా పేలవ నియంత్రణ కారణంగా పౌరేరీ వద్ద నుంచి వచ్చిన బంతిని బాటం కార్నర్‌లో ఒడిసిపట్టిన అనిబల్ రోడ్రిగేజ్ గోల్ పోస్ట్ కు చేర్చడంతో అతడు రెండు గోల్స్ కొట్టిన ఘనత సాధించడంతోపాటు జట్టుకు మూడు పాయింట్ల లీడ్ సాధించి పెట్టాడు.

ఢిల్లీ ఖాతాలో రెండో గోల్
ఆ తర్వాత ఢిల్లీ సంచనం మార్సిలిన్హోతో కలిసి పుణె కుర్రాళ్లపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. 89వ నిమిషంలో ఎడుయారో ఫెరీరా గోల్ సాధించడంతో ఢిల్లీ ఖాతాలో రెండో గోల్ చేరింది. మ్యాచ్ రియల్ టైం ముగిసే సమాయానికి స్కోర్ 4 - 2గా నమోదైంది. ఇంజ్యూరీ సమయంలో 93వ నిమిషంలో పుణె కుర్రాడు లెన్నీ రోడ్రిగ్స్, ఢిల్లీ మాల్సాంజులా గోల్ చేయడంతో స్కోర్ 4 - 3గా మారింది.


Click it and Unblock the Notifications













