For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐఎస్ఎల్: హోరాహోరీ మధ్య కేరళ, పుణె మ్యాచ్ డ్రా

By Nageshwara Rao

పుణె: ఎఫ్ సి పుణె సిటీతో కేరళ బ్లాక్ బస్టర్స్ తలపడిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్ ప్రారంభమైన ఇరు జట్లు ఆధిక్యం కోసం హోరాహోరీగా తలపడ్డాయి. మూడో నిమిషంలోనే కేరళ బ్లాక్ బస్టర్స్ ఆటగాడు సెడ్రిక్ హెంగ్ బార్ట్ శరవేగంగా గోల్ చేసి, జట్టుకు ఆధిక్యం కల్పించాడు.

సెకండాఫ్‌లో 69వ నిమిషంలో పుణె కుర్రాడు మహ్మద్ సిస్సోకో గోల్ చేయడంతో స్కోర్ సమానమైంది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసి ఇరు జట్లు చెరో పాయింట్ పొందాయి. సచిన్ టెండూల్కర్ సహ - యజమానిగా ఉన్న కేరళ బ్లాక్ బస్టర్స్ పాయింట్ల పట్టికలో ఢిల్లీ డైనమోస్ తో కలిసి ఐదో స్థానంలో నిలువగా, పుణె నాలుగు పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది.

హ్రుతిక్ రోషన్ సహ - యజమానిగా ఉన్న పుణె జట్టు 4 - 2 - 3 - 1 వ్యూహంతో డ్రామానే ఠాగోర్ ను మాత్రమే స్ట్రయికర్ గా బరిలోకి దిగింది. ఎడుయారో ఫెరీరా గైర్హాజరీలో నలుగురు భారతీయ డిఫెండర్లతో పుణె మ్యాచ్ ఆడటం ఐఎస్ఎల్ సీజన్ లోనే ఇది తొలిసారి.

అటు కేరళ కోచ్ స్టీవ్ కొప్పెల్ సైతం 4 - 2 - 3 - 1 వ్యూహంతో జట్టును ముందుకు నడిపాడు. మహ్మద్ రఫీని మాత్రమే స్ట్రయికర్ గా పెట్టి, సీనియర్ ప్లేయర్ మిఖైల్ చోప్రా, డంకెన్స్ నాజోన్ లను అటాకింగ్ కు వినియోగించింది. అరోన్ హుగెస్ తో కలిసి కెడ్రిక్ హెంగ్ బార్ట్ డిఫెన్స్ కు నేత్రుత్వం వహించాడు.

ఇండియన్ సూపర్ లీగ్ చరిత్రలోనే కేరళ కుర్రాడు కెడ్రిక్ హెంగ్ బార్ట్ శరవేగంగా 2 నిమిషాల 12 సెకన్లకే గోల్ సాధించాడు. బాక్స్ చివరన ఉన్న అజ్రక్ మహమత్ కొట్టిన షాట్ విఫలమైంది. ఆ బంతి నేరుగా హెంగ్ బార్ట్ చేతుల్లోకి వెళ్లింది. దీన్ని సదవకాశంగా మలిచిన హెంగ్ బార్ట్ లెఫ్ట్ ఫుట్ తో అతి దగ్గర నుంచి బంతిని గోల్ పోస్ట్ దారి మళ్లించాడు.

Pune City - Kerala Blasters

మళ్లీ 36వ నిమిషంలోనూ కేరళకు రెండో గోల్ చేసేందుకు వచ్చిన బెస్ట్ చాన్స్ మిస్సయింది. రఫీఖ్, చోప్రాలు కలిసి మెహతాబ్ ద్వారా గోల్ పోస్ట్ కు పంపిన బంతి వైడ్ గా మారి వెళ్లిపోయింది. సెకండాఫ్ లో 53వ నిమిషంలోనూ మిఖైల్ చోప్రా నుంచి వచ్చిన బంతిని బాక్స్ చివర నుంచి మహ్మద్ రఫీ గోల్ పోస్ట్ కు పంపినా పుణె డిఫెన్స్ విజయవంతంగా అడ్డుకున్నది.

పుణె కుర్రాడు టాటో గోల్స్ చేసే అవకాశాలను కేరళ దీటుగా ఎదుర్కొన్నది. టాటో 14వ నిమిషంలో పెనాల్టీ బాక్స్ అంచు నుంచి గోల్ పోస్ట్ కు పంపిన బాల్ వైడ్ గా మారింది. ఆ తర్వాత మూడు నిమిషాలకే కార్నర్ వద్ద ఠాగోర్ హెడ్డర్ ద్వారా పంపిన బంతి లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.

23వ నిమిషంలోనూ కేరళ బాక్స్ లో స్పేస్ గమనించి కిక్ కొట్టిన ట్రారో గోల్ చేయడంలో విఫలమయ్యాడు. కేరళ ద్వయం అరోన్ హుగెస్, కెడ్రిక్ హెంగ్ బార్ట్ దాన్ని అడ్డుకుని పక్కకు పంపారు. పుణె జట్టులో టాటూ మాత్రమే బ్లాక్ బస్టర్స్ కు సమస్యగా మారాడు.

ఫస్టాఫ్ లో పుణె సారధి సిస్సోకో పెనాల్టీని గోల్ గా మార్చబోగా, హెంగ్ బార్ట్ అడ్డుకోవడంతో అదీ విఫలమైంది. 56వ నిమిషంలో జోసు కుర్రాయిస్ నుంచి వచ్చిన బ్యాక్ పాస్ ను అందుకున్న ట్రారేను బ్లాస్టర్స్ గోల్ కీపర్ సందీప్ నాందే ముందుకొచ్చి అడ్డుకున్నాడు.

69వ నిమిషంలో పుణె సారధి మహ్మద్ సిస్సోకో, హుగెస్ నుంచి వచ్చిన బంతిని బాక్స్ చివర నుంచి షాట్ కొట్టడంతో నేరుగా నాందేను దాటుకుని గోల్ పోస్ట్ కు చేరిపోవడంతో స్కోర్ సమానమైంది. ఆ తర్వాత ఆధిక్యం సాధించేందుకు కేరళ బ్లాక్ బస్టర్స్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.

కేరళ తరఫున ప్రత్యామ్నాయ ఆటగాడిగా రీ ప్లేస్ అయిన ఫరూఖ్ చౌదరి 72వ నిమిషంలో పంపిన బంతిని పుణె కీపర్ ఎడెల్ బెటె అద్భుతంగా అడ్డుకుని జట్టును కాపాడుకోగలిగాడు. ఆ వెంటనే మరో సబ్ స్ట్యూట్ ప్లేయర్ ఆంటోనియో జర్మన్ పంపిన బంతిని కార్నర్ వద్ద పుణె కుర్రాళ్లు అడ్డుకోవడంతో బ్లాక్ బస్టర్స్ కు వచ్చిన తుది అవకాశం మిస్సయింది. తద్వారా ఐఎస్ఎల్ 3 ఎడిషన్ లో సొంత గడ్డపై విజయం కోసం పుణె ప్రయాణం కొనసాగుతూనే ఉన్నది.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+