టీవీ లేదు: 'కామెంటేటర్లు గట్టిగా కేకలేస్తే గోల్ అయ్యేది'
దోహా: భారతీయ ఫుట్ బాల్ అద్భుతమైన స్థాయిలో ఎదిగేందుకు పుష్కల అవకాశాలు ఉన్నాయని అఖిలభారత ఫుట్ బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) ప్రధాన కార్యదర్శి కుశాల్ దాస్ చెప్పారు. వచ్చే ఏడాది యు-17 సాకర్ కప్ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న భారత్.. అదే జట్టు భవిష్యత్‌లో యు-20 టీంగా విస్తరణకు అవకాశాలు మెండు అని చెప్పారు.
ఫుట్‌బాల్ ఆటను ప్రేమించే భారత్‌లో ప్రత్యేకించి పట్టణ యువత ఆస్వాదిస్తున్నారన్నాడు. కొన్నేళ్లుగా భారత్‌లోని పట్టణాలు, నగరాల యువతలో ఆదరణ పొందిన క్రీడగా ఫుట్ బాల్ డెవలప్ అవుతున్నదన్నారు. 2022 ఖతార్ వరల్డ్ కప్ తర్వాత భారత్ కూడా కొన్ని కీలక టోర్నమెంట్ల నిర్వహణకు సిద్ధమవుతున్నదన్నారు.
ఆ తర్వాత నుంచి భారత్‌లో ఫుట్ బాల్ విశేషంగా డెవలప్ అయ్యేందుకు పుష్కల అవకాశాలు ఉన్నాయని ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. సాకరెక్స్ 2016 ఆసియా ఫోరం 'డెలివరీ అండ్ లెగసీ సుప్రీం కమిటీ (ఎస్సీ)లో పాల్గొనేందుకు కుశాల్ దాస్ ఇక్కడకు వచ్చారు.
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చీఫ్ ఫైనాన్సింగ్ ఆఫీసర్‌గా సేవలందించిన తర్వాత 2010లో అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రపంచంలోకెల్లా జనాభాలో రెండోస్థానంలో ఉన్న భారతదేశంలో ఫుట్‌బాల్ డెవలప్‌మెంట్, మిడిల్ ఈస్ట్‌లో జరుగనున్న తొలి ప్రపంచ వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొననున్నది.

ప్రఫుట్ పటేల్ ఆసక్తి
ఫిఫా యు-20 వరల్డ్ కప్ బిడ్ దాఖలుచేసేందుకు ఎఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు ప్రఫుట్ పటేల్ చాలా ఆసక్తిగా ఉన్నారు. ఖతార్ తర్వాత ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కుశాల్ దాస్ చెప్పారు. అండర్ - 20 వరల్డ్ కప్ టోర్నీ నిర్వహణకు శక్తి సామర్థ్యాలు పెంచుకోవడం ద్వారా భారత్‌లో ఫుట్ బాల్ ఆటకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, క్షేత్రస్థాయిలో విస్త్రుతంగా డెవలప్ చేసేందుకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. నూతన మెట్రో పాలిటన్ సిటీల్లో క్రమంగా ఫుట్ బాల్ కల్చర్ డెవలప్ కావడానికి దారి తీస్తుందన్నారు.

ఫుట్ బాల్ ఆడే వారి సంఖ్య పెరుగుతుంది
ఇప్పటికే పలు పట్టణాలు, నగరాల్లో ఫుట్ బాల్ ఆడే వారి సంఖ్య శరవేగంగా పెరుగుతుందని కుశాల్ దాస్ వివరించారు. ‘ఐ-లీగ్' చాంపియన్లుగా, ఎఎఫ్‌సి కప్ ఫైనలిస్టులుగా బెంగళూరు ఎఫ్‌సి జట్టుకు దేశవ్యాప్తంగా భారీగా అభిమానులు పెరిగారని చెప్పారు. ముంబై నుంచి కార్పొరేట్ లీగ్ ఇండియన్ సూపర్ లీగ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబై సిటీ ఎఫ్ సి జట్టు ఆడుతున్న మ్యాచ్‌లను వీక్షించేందుకు వస్తున్న అభిమానులతో స్టేడియం నిండిపోతున్నదని, ఇక చెన్నై నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఫ్రాంచైసీ చెన్నైయిన్ ఎఫ్‌సి జట్టుకు వరుసగా మూడేళ్లుగా జరుగుతున్న మ్యాచ్‌లకు 20 వేల మందికి పైగా అభిమానులు హాజరవుతున్నారని ఆయన గుర్తుచేశారు.

అభిమానుల రాక పెరిగింది
ఢిల్లీ డైనమోస్ ఎఫ్ సి జట్టు ఆధ్వర్యంలో జరిగే మ్యాచ్‌లకు ఈ ఏడాది గణనీయ స్థాయిలో అభిమానుల రాక పెరిగిందన్నారు. పట్టణ యువతలో ఫుట్ బాల్ ప్రేమికుల సంఖ్య గణనీయ స్థాయిలో పెరుగుతున్నదని, శాంతియుతంగా తమాషాలను ప్రేమించే అభిమానులుగా మహిళల్లోనూ 50 శాతం మంది ఫ్యాన్స్ ఉన్నారని తెలిపారు. 2022లో మిడిల్ ఈస్ట్ లో నిర్వహించే వరల్డ్ కప్ ద్వారా కుటుంబ నేపథ్యంగా ఫుట్ బాల్ ఎదుగుదలకు పట్టణ భారత్‌లో అవకాశాలు మెరుగు పడ్డాయన్నారు. క్రమంగా భారతీయ ఫుట్ బాల్ ఒక్కో అడుగు వేస్తూ ముందుకు సాగుతున్నదన్నారు.

ఎఎఫ్‌సి కప్ ఫైనల్స్‌కు బెంగళూరు ఎఫ్ సి
బెంగళూరు ఎఫ్ సి ఈ ఏడాది ఎఎఫ్‌సి కప్ ఫైనల్స్‌కు దూసుకెళ్లడంతోపాటు గోవాలో గత సెప్టెంబర్‌లో జరిగిన ఎఎఫ్‌సి యు-16 చాంపియన్ షిప్ టోర్నీలో జాతీయ జట్టు గణనీయ ప్రగతి సాధించిందన్న కుశాల్ దాస్.. ఈ పరిణామాలన్నీ తదుపరి భారతీయ ఫుట్‌బాల్ ఎదిగేందుకు దోహదపడతాయని చెప్పారు. 2022 వరల్డ్ కప్ తర్వాత పట్టణ భారత్‌లో ఫుట్‌బాల్ ఆటకు గల అవగాహన ఉన్నతస్థాయికి దూసుకెళుతుందన్నారు. మెక్సికోలో 1970లో తాను 10 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు టివి లేదని, కేవలం స్పానిష్ భాషలో రేడియో వినేవాడినన్నారు.

కామెంటేటర్లు గట్టిగా కేకలేస్తే గోల్ అయ్యేది
అప్పుడు ఇటలీకి వ్యతిరేకంగా పీలే ఆడుతున్నప్పుడు కామెంటేటర్లు గట్టిగా కేకలేస్తే గోల్ అయిందని గుర్తించేవాడినన్నాడు. తర్వాత 1986లో మారడోనా మ్యాజిక్ తో తన స్నేహితులు కొందరు స్టేడియం నుంచి లైవ్ కలర్ టీవీల్లో మ్యాచ్‌లు వీక్షించారని 10 ఏళ్ల గడువులోనే ఎంతో ప్రగతి సాధించారని చెప్పారు. 2012లో పుట్టిన భారతీయులు 2022 నేయ్మార్ ఆటతీరును ఖచ్చితంగా వీక్షిస్తారని తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications