
న్యూ ఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఆ పదవి చేపట్టినప్పటి నుంచి పర్యటనల్లోనే కాలం గడుపుతున్నారని ప్రతిపక్షాలు, గిట్టనివారు ఆరోపిస్తూనే ఉన్నా.. ఆయన మాత్రం అవేమీ ఖాతరు చేయలేదు. ఈ సారి మాత్రం కార్యార్థి అయి అర్జెంటీనాకు వెళ్లిన నరేంద్ర మోడీ.. అర్జెంటీనాలోని బ్యూనస్ ఏర్స్ జీ-20 దేశాల శిఖరాగ్ర సదస్సును పురస్కరించుకొని మోడీతో గియానీ భేటీ అయ్యారు.
అయితే ఇప్పటివరకూ మోడీకి ఆతిథ్య దేశం నుంచి అక్కడి సాంప్రదాయ దుస్తులను బహుకరించేవారు. కానీ, ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫాంటినో ఫుట్‌బాల్ జెర్సీని బహూకరించారు. జెర్సీ వెనకాల మోడీ పేరుతో పాటు జీ20 అని ముద్రించిన టీషర్ట్ గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీకి మోడీకి ఇన్‌ఫాంటినో జీ20 ఫుట్‌బాల్ జెర్సీ అందజేశారు. వీరిద్దరూ దిగిన ఫొటోను మోడీ ట్విటర్ పోస్ట్ చేస్తూ ధన్యవాదాలు తెలిపారు.
అర్జెంటీనాకు వచ్చి ఫుట్‌బాల్ గురించి ఆలోచించకుండా ఉండటం అసాధ్యం. అర్జెంటీనా ఆటగాళ్లకు భారత్‌లో మంచి ఆదరణ ఉంది. ఫిఫా ప్రెసిడెంట్ గియానీ నుంచి జెర్సీ అందుకున్నానని. అయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు అని మోడీ ట్విటర్ ద్వారా ఆనందాన్ని వ్యక్తం చేశారు. మోడీ గౌరవార్థం అర్జెంటీనా అధ్యక్షుడు మార్సియో శనివారం ఉదయం అల్పాహార విందునిచ్చి మర్యాదను చూపించారు.
అర్జెంటీనా ప్లేయర్లు అయినా డిగో మారడోనా, లియోనల్ మెస్సీలను భారత్‌లో ఎంతగా ఆదరిస్తారంటే.. మెస్సీ జెర్సీ రంగును కోల్‌కతాలోని ఓ అభిమాని ఇంటి నిండా రంగులు వేయించుకుని ప్రత్యేకత చూపించుకున్నాడు. మెస్సీ కూడా తనకు భారత్‌పై ఉన్న ప్రేమను కొన్ని సందర్భాలలో ప్రత్యేకంగా వ్యక్తపరిచాడు. తన నెంబర్ ఉన్న జెర్సీని ఆటోగ్రాఫ్‌తో సహా ప్రముఖులకు బహుమతిగా పంపిన సందర్భాలు ఉన్నాయి.