సెమీస్ బెర్త్: పుణెకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం
పుణె: స్థానిక బాల్వాడీలోని శ్రీ శివ్ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియంలో ఢిల్లీ డైనమోస్ ఎఫ్ సి జట్టుకు ఎఫ్ సి పుణె జట్టు ఆతిథ్యం ఇవ్వనున్నది. ఇప్పటికే పాయింట్ల టేబుల్‌లో 17 పాయింట్లతో టాప్ స్థానంలో ఉన్న ఢిల్లీ డైనమోస్.. ప్లే ఆఫ్ దశకు వెళ్లేందుకు ఇబ్బందులు లేమీ లేవు. కానీ 12 పాయింట్లతో ఆరోస్థానంలో ఉన్న హబాస్ సేనకు ఈ మ్యాచ్ ఎంతో కీలకమైంది.
సెమీస్ లో అడుగు పెట్టాలంటే ఈ మ్యాచ్ లో పుణె గెలుపొందితేనే సెమీ ఫైనల్స్ లో అడుగు పెట్టగలదు. క్రితం మ్యాచ్ లో చెన్నైయిన్ ఎఫ్ సి జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన పుణె.. తనకంటే శక్తిమంతమైన జట్టు ఢిల్లీ డైనమోస్‌పై తప్పక విజయం సాధించాలి. ఒకవేళ మిగతా మ్యాచ్‌ల్లో ఓటమి పాలైనా ఢిల్లీ డైనమోస్ సెమీస్ బెర్త్‌కు వచ్చిన ఇబ్బందులేమీ లేవు.
ఐఎస్ఎల్ 3 ఎడిషన్ టోర్నీ లీడర్లుగా భావిస్తున్న ఢిల్లీ డైనమోస్ జట్టే ఈ మ్యాచ్‌లో హాట్ ఫేవరెట్‌గా ఉంది. ఢిల్లీ సంచలనం మార్సిలిన్హో వంటి స్ట్రయికర్ సాయంతో ఢిల్లీ డైనమోస్ ముందుకు దూసుకెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ బ్రెజిలియన్ ఐదు గోల్స్, నాలుగు అసిస్టెన్స్‌ల్లో సహకరించాడు. దీనికి తోడు సారధి ఫ్లోరెంట్ మాలౌదా, ఇతర కీలక ప్లేయర్లు కియాన్ లూయిస్, రిచర్డ్ గాడ్జే సంయుక్తంగా తొమ్మిది గోల్స్ చేశారు.
తద్వారా జట్టుకు కీలక ప్లేయర్లుగా మారారు. క్రితం సారి ఎల్లోకార్డు చూపిన కారణంగా మిలాన్ సింగ్ ఈ మ్యాచ్ కు దూరం కానున్నాడు. ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి ఎడిషన్ తొలి మ్యాచ్ గోల్స్ లేకుండా డ్రా గా ముగిస్తే, మలి మ్యాచ్ లో పుణె సొంత గడ్డపై సింగిల్ గోల్ పాయింట్ సాధించింది. గత ఏడాది రెండు మ్యాచ్ లనూ ఢిల్లీ డైనమోస్ గెలుచుకున్నది. ఈ ఏడాది ఢిల్లీలో జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది.

డిఫెన్స్‌లో ఫెరీరా.. ఫార్వర్డ్‌లో మార్సిలిన్హో
ఈ లీగ్‌లో చెప్పుకోదగిన అణిముత్యాల్లో ఎడుయారో ఫెరీరా ఒకరు. డిఫెండర్‌గా, బ్యాక్ లైన్ పుణె జట్టులో కీలక ఆటగాడు. గాలిలోనే దూసుకెళుతూ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాన్ని రచించగల సమర్థుడు. ప్రత్యర్థుల స్పేస్ నుంచి అవకాశాలు కల్పించుకుని బంతిని ముందుకు తీసుకెళ్లగల సామర్థ్యం మెండు. ప్రత్యర్థిపై ఎదురుదాడి చేయడానికి ఆయన ఎత్తు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తున్నది. ఈ ఎడిషన్ లో ఢిల్లీ డైనమోస్ లో ఆవిర్భవించిన కొత్త ప్లేయర్ మార్సిలిన్హో ఒకరు. త్వరితగతిన స్పందించే ఈ బ్రెజిలియన్ ఫార్వర్డ్ ఎప్పటికప్పుడు ఫుట్ బాల్ ఆటను ఎంజాయ్ చేస్తూ పుష్కల అవకాశాలు కల్పించుకోగల నేర్పరి.

లింగ్డో.. మార్సిలిన్హో కీలక పాత్ర
ఎఎఫ్ సి కప్ టోర్నీలో బెంగళూరు ఎఫ్ సి జట్టు తరఫున పాల్గొన్న ఎగెన్సోన్ లింగ్డో తొలి ఎనిమిది మ్యాచ్ లలో అందుబాటులో లేకపోవడం ఎఫ్ సి పుణె జట్టుకు తీరని లోటే. లింగ్డో వచ్చీ రాగానే పుణె మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముంబై సిటీతో జరిగిన మ్యాచ్‌లో పాయింట్ సాధించి పుణెను గెలిపించాడు లింగ్డో. ఇక ఢిల్లీ సారధి ఫ్లోరెంట్ మాలౌదా ఆలస్యంగా పుంజుకున్నాడు. మిడ్ ఫీల్డర్‌గానూ, గత రెండు మ్యాచ్ లలోనూ గోల్స్ సాధించి జట్టును గెలిపించడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అదే విధంగా జట్టుకు మూడుసార్లు అసిస్టెన్స్ అందజేశాడు. జట్టు తరఫున గోల్ చేసే అవకాశాల కల్పనలోనూ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు.

అటాకింగ్‌లో అనిబల్.. సౌవిక్
పుణె తరఫున అత్యధిక గోల్స్ చేసిన అనిబల్ రోడ్రిగ్యుజ్.. తన ప్రత్యర్థి జట్టు ఢిల్లీ డైనమోస్ డిఫెన్స్ ను విజయవంతంగా తిప్పికొట్టగల సమర్థుడంటే అతిశేయోక్తి కాదు. త్వరితగతిన స్పందిస్తూ ప్రత్యర్థి డిఫెండర్లను దీటుగా ఎదుర్కొనే సామర్థ్యంతోపాటు పుణె తరుఫున అటాకింగ్‌కు నాయకత్వం వహిస్తాడంటే అతిశేయోక్తి కాదు. ఒంటి చేత్తో పరిస్థితులను తారుమారు చేయగల సామర్థ్యం కూడా అనిబల్ సొంతం. ఇక సౌవిక్ చక్రవర్తిది పూర్తిగా డిఫెన్స్ మంత్రమే. 900 నిమిషాల సేపు పిచ్ పై ఉన్న సౌవిక్ చక్రవర్తి ప్రత్యర్థి జట్ల వ్యూహాలను చిత్తు చేయడంలో సూపర్బ్‌గా వ్యవహరిస్తాడు. ఓవరాల్ గా 39 సార్లు జట్టును ఆదుకున్న ఈ డిఫెండర్ ప్రత్యర్థి అటాకర్లను తిప్పికొట్టగల సమర్థుడు. ఇన్ సైడ్ బాక్స్ వద్ద ప్రత్యర్థులు ఊపిరి కూడా పీల్చుకోనివ్వకుండా చేస్తూ పరిస్థితుల్లో మార్పులు తీసుకు రాగలడు. అనిబల్ తరహాలోనే అవకాశాల కల్పనలో సౌవిక్ సమకాలీనుడంటే అతిశేయోక్తి కాదు.

జట్ల వివరాలు:
ఎఫ్ సి పుణె సిటీ: ఎడెల్ బెటె, అరిందామ్ భట్టాచార్య, విశాల్ కైత్, జోడింగ్లాయాన రాల్టే, రాహుల్ భెకె, యుమ్నం రాజు, నారాయణ్ దాస్, అగస్టీన్ ఫెర్నాండెజ్, ధర్మరాజ్ రావణన్, ఎడుయారో ఫెరీరా, గౌరామాంగి సింగ్, అరాట ఇజుమి, జొన్నాథన్ లుక్కా, ఫ్రాన్సిస్ ఫెర్నాండెజ్, బ్రూనో ఏరియాస్, జోసెఫ్ మారియా కోమాడెవల్ క్రౌస్, లెన్నీ రోడ్రిగ్స్, మొమ్మార్ డోయే, సంజు ప్రధాన్, అనిబల్ జుర్డో రోడ్రిగ్స్, గుస్టావో ఒబెర్మన్, జీసస్ రోడ్రిగ్స్ టాటూ, ఎగెన్సోన్ లింగ్డో.
ఢిల్లీ డైనమోస్ ఎఫ్ సి: అంటోనియో డొబ్లాస్ సంతానా, సంజీభన్ ఘోష్, సోరం పైరేరీ, రుబెన్ గొంజాలెజ్ రొచా, డేవిడ్ అడ్డీ, ఇబ్రహీమా నైస్సే, అనాస్ ఎడాథోడికా, చింగ్లెంసానా కొంశాం సింగ్, లాల్చావింకిమా, రూపర్ట్ నోంగ్రం, సౌవిక్ చక్రవర్తి, ఫ్లోరెంట్ మాలౌదా, బ్రూనో అగస్టో పెలిస్సారీ డీ లిమా, మార్కోస్ టేబార్, ఎమర్సొన్ గోమ్స్ డీ మౌరా, డెన్సొన్ దేవదాస్, మాల్సావ్వుంజులా, రిచర్డ్ గాడ్జె, బదారా బాద్జి, అర్జున్ తుడు, మార్సెలో లైటీ పెరీరా, కియాస్ లూయిస్, అమోస్ డో, అల్విన్ జార్జి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications