
డియాగో ఫోర్లాన్ వర్సెస్ బెర్నార్డ్ మెండీ
ముంబై సిటీ ఎఫ్ సి సారధి డియాగో ఫోర్లాన్ స్పార్క్లింగ్ ఫామ్ తో దూసుకెళ్లుతున్నాడు. కేరళ బ్లాక్ బస్టర్స్ తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్ సాధించి జోరు మీదున్నాడు. నెమ్మది నెమ్మదిగా చురుగ్గా స్పందిస్తున్నాడు. అనుక్షణం జట్టుకు పెద్ద ఆస్తిగా మారుతున్నాడు. ఇన్ సైడ్ బాక్స్ లో ప్రత్యర్థులకు పెను ముప్పుగా పరిణమించాడు. చెన్నైయిన్ జట్టుకు వ్యతిరేకంగా బుధవారం జరిగే మ్యాచ్ లో మంచి స్పానర్‌గా నిలిచాడు. చెన్నైయిన్ ఎఫ్ సి సెంటర్ బ్యాక్ ప్లేయర్ బెర్నార్డ్ మెండీ ఈ ఏడాది తొలి నుంచి వాస్తవిక ద్రుక్పథంతో వ్యవహరిస్తూ ముందుకొచ్చాడు. బుధవారం జరిగే మ్యాచ్ లో డియాగో ఫోర్లాన్, బెంగళూరు ఎఫ్ సి దిగ్గజం సునీల్ ఛెత్రి వంటి సీనియర్లను ఎదుర్కోవడం కష్ట సాధ్యమైన పని. ఈ ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆడిన మెండీ ఏరియల్ స్ట్రయిక్స్‌లోనూ, నేలపై అటాకింగ్‌లో దూకుడుగా వ్యవహరిస్తున్నాడు. ప్రత్యర్థులు అతడ్ని ఎదుర్కోవడం అరుదైన ఘటనే. వివిధ సందర్భాల్లో ప్రత్యర్థులకు ప్రమాదకర టార్గెట్లు నెలకొల్పగల నేర్పరి అతడు.

మిడ్ ఫీల్డ్‌లో మాటియాస్, రాఫెల్ సమఉజ్జీలు
మాటియాస్ డెఫెడెరికో నిస్సందేహంగా ముంబై సిటీ జట్టులో ఫామ్‌లో ఉన్న ప్రతిభావంతుడైన మిడ్‌ఫీల్డర్. 10 మ్యాచ్ లలోనూ రెండు గోల్స్ సాదించిన మాటియాస్ డెఫెడెరికో మూడు అసిస్టెన్స్‌లు అందించిన ఘనత సాధించాడు. ఫార్వర్డ్ ప్లేయర్‌గా నిరంతరం ప్రత్యర్థులకు ముప్పుగా పరిణమించాడంటే అతిశేయోక్తి. ఎల్లవేళలా లెఫ్ట్ ఫుట్‌తో మ్యాచ్‌లో ఆడే మాటియస్ ప్రత్యర్థి జట్ల డిఫెండర్లకు సమస్యలు నెలకొల్పగలడు. మిడ్ ఫీల్డర్‌గా బుధవారం ముంబై విజయం సాధించడంలో నిర్ణాయత్మక పాత్ర పోషించాల్సిన బాధ్యత ఆయనదే. చెన్నైయిన్ ఎఫ్ సి జట్టులో శక్తి సామర్థ్యాలు గల మరో మిడ్ ఫీల్డర్ రాఫెల్ అగస్టో. మిడ్ ఫీల్డ్ లో ప్రత్యర్థులను ధాటిగా ఎదుర్కోగల సామర్థం కలిగి ఉన్నాడు. కొన్ని గేమ్స్‌లోనే ఎక్కువ సమయం (880 నిమిషాలు) ఆడిన ప్లేయర్లలో రెండో వ్యక్తి. 990 నిమిషాలు అత్యధికంగా మెహ్రాజుద్దీన్ వాడో మొదటి స్థానంలో నిలిచాడు. నాలుగు అసిస్టెన్స్ అందజేయడం మరీ ముఖ్యమైన అంశాల్లో ఒకటి. మిడ్ ఫీల్డ్‌లో పూర్తి ఫామ్ లో ఉన్న ముంబై ఎదుర్కోవడానికి సూపర్ మాచన్స్ చేతిలో ఉన్న అస్త్రం రాఫెల్ అగస్టో ఒకరు. ఆయన మాత్రమే ముంబైని ముందుకు వెళ్లకుండా నిలువరించగలడు.

లుసియాన్ గోయాన్, డేవిడ్ సుక్కీ జట్లకు ప్రధాన స్తంభాలు
ముంబై సిటీ ఎఫ్ సి ప్లేయర్ లుసియాన్ గోయాన్ జట్టు ప్రధాన స్తంభాల్లో ఒకడు. 33 ఏళ్ల ఈ రోమేనియన్ ప్లేయర్ జట్టు విజయం కోసం తనకు గల అనుభవాన్ని ఉపయోగించి కష్టపడే తత్వం గలవాడు. నేలపైనా, గాలిలోనూ దూకుడుగా దూసుకెళ్లగల సామర్థ్యం గలవాడు. కీలకమైన సందర్భాల్లో బంతిని నియంత్రించగల శక్తి కలిగిన ఆటగాడు. ముంబై డిఫెన్స్ లో లూసియాన్ పెట్టింది పేరు. అందుకు ఆయనకు జట్టు యావత్ ధన్యవాదాలు తెలుపుకోవాల్సిందే. చెన్నైయిన్ జట్టుకు వ్యతిరేకంగా జరిగే మ్యాచ్‌లో తన శక్తి సామర్థ్యాలను విరివిగా ఉపయోగిస్తానడంలో సందేహం లేదు. చెన్నైయిన్ ఎఫ్ సి జట్టులో మంచి స్కోరింగ్ టచ్ గల ప్లేయర్ డేవిడ్ సుక్కీ. రెండుసార్లు ఔటింగ్ అయినా ఈ ఇటాలియన్ ఫార్వర్డ్ ప్లేయర్ రెండుసార్లు స్కోర్ పాయింట్లు సాధించాడు. కోల్ కతాకు వ్యతిరేకంగా చివరి దశలో స్కోర్ సమంచేసి మ్యాచ్ డ్రాగా ముగించాడు. సుక్కీ తన టీంలో కీలక ఆటగాడు. విపక్షాల గోల్ పోస్ట్ ముందు ప్రత్యర్థులకు సుక్కీ హడల్. పొడవైన ఈ ఫార్వర్డ్ ప్లేయర్ గాలిలోనూ ముంబైకి పెనుముప్పే అంటే ఆశ్చర్యం కాదు.

జట్ల వివరాలు:
ముంబై సిటీ ఎఫ్ సి: రాబర్టో వొల్పాటో నెటో, అమరిందర్ సింగ్, అల్బినోగోమ్స్, గెర్సోన్ వైరీరా, లుసియాన్ గోవాన్, ఫకుండో కార్డోజో, అన్వర్ అలీ, అయిబొర్లాంగ్ ఖోంగ్జీ, లాల్హ్మాంగైహ్సాగ రాల్టే, లాల్చౌన్మావాయియా ఫనాయి, అశుతోష్ మెహతా, క్రిష్టియాన్ వాడోక్జ్, లియో కోస్తా, జాకీచంద్ సింగ్, శరణ్ సింగ్, సేహ్నాజ్ సింగ్, భాయిథాంగ్ హావోకిప్, డేవిడ్ లాల్రింమౌనా, మాటియాస్ డెఫెడెరికో, ఒటాలిసియో బ్రిటో అల్వెస్, సోని నోర్డే, డియాగో ఫోర్లాన్, థియాగో చున్హా, సునీల్ చెత్రి, ఉదాంతా సింగ్.


Click it and Unblock the Notifications













