
డియాగో ఫోర్లాన్ వర్సెస్ సెడ్రిక్ హెంగ్‌బార్ట్
ఆలస్యంగానైనా ముంబై సిటీ సారధి డియాగో ఫోర్లాన్ పుంజుకున్నాడు. కొంచెం నిశ్శబ్ధంగా కనిపిస్తున్నా తన క్లాస్ ఆటేమిటో రుజువు చేసుకునే సమయం ఆసన్నమైంది. రెండు గోల్స్ కొట్టడంతోపాటు అసిస్టెన్స్ ఇవ్వడంలో ముంబై సిటీ క్యాంపెయిన్‌లో కీలక భూమిక పోషిస్తున్నాడు. లీగ్ టోర్నీ దాదాపు ముగింపు దశకు చేరుకుంటున్న ప్రస్తుత తరుణంలో జట్టు మేనేజర్ గుమారెస్ మాత్రం డియాగో ఫోర్లాన్ నుంచి మరింత మెరుగైన ఆట ప్రదర్శనను కోరుకుంటున్నాడు. సెమీస్ బెర్త్ లో చోటు దక్కించుకోవడం ముఖ్యమైనందున ఈ ఉరుగ్వేయన్ ప్లేయర్ శనివారం మ్యాచ్‌లో చెలరేగిపోతాడనడంలో సందేహమే లేదు.

సెంట్రల్ డిఫెండర్‌గా సెడ్రిక్ హెంగ్బార్ట్
ఇక కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టులో సెంట్రల్ డిఫెండర్‌గా వ్యవహరిస్తున్న సెడ్రిక్ హెంగ్బార్ట్ రైట్ బ్యాక్ లోనూ కీలకంగా వ్యవహరించగల నేర్పు సొంతం చేసుకున్నాడు. ప్రధానంగా కేరళ బ్లాక్ బస్టర్స్ డిఫెన్స్ కు సెడ్రిక్ హెంగ్బార్ట్ గుండెకాయ వంటి వాడంటే అతిశేయోక్తి కాదు. ఎత్తులోనూ పొడగరి అయిన హెంగ్బార్ట్ గాలిలోనూ ప్రత్యర్థి జట్టుకు డిఫెన్స్ ఆటతో చుక్కలు చూపగల సామర్థ్యం కలిగి ఉన్నాడు. పలు కీలక దశల్లో ప్రత్యర్థి జట్టు వ్యూహంలో జోక్యంచేసుకుని ఆట తీరునే మలుపు తిప్పే సామర్థ్యం సొంతంచేసుకున్నాడు. ఫోర్లాన్ వంటి సీనియర్, అనుభవంగల ప్లేయర్లను పెనాల్టీ కార్నర్లలో అడ్డుకోవాలంటే నిశితంగా మ్యాచ్‌ను గమనిస్తూ డిఫెన్స్ పాత్ర పోషించేందుకు సెడ్రిక్ హెంగ్బార్ట్ వంటి వారు అవసరమే మరి.

నోర్డే, జోసు విభిన్నం
హైతీ జాతీయ జట్టు ప్లేయర్‌గా ఆడిన తర్వాత ముంబై సిటీ ఎఫ్ సి జట్టులోకి వచ్చిన తర్వాత సోనీ నోర్డే పాత్ర ఒకింత విభిన్నంగా ఉంటుంది. ఆయన కేవలం కళ్లన్నీ కేవలం గోల్ పాయింట్ సాధన మీదే కాదు. ఎటువంటి లోపం లేకుండా బంతిని సహచర ప్లేయర్లకు పాస్ చేయడంలో దిట్ట. బ్రీత్ టేకింగ్ డ్రిబ్లింగ్ స్కిల్స్ లో ఆయన పేరు ప్రస్తావనకు రాకపోయినా ఒక గోల్ సాధించడంతోపాటు నాలుగు సార్లు అసిస్టెన్స్ అందించిన ప్లేయర్‌గా నోర్డే పేరు రికార్డయింది. అదే విధంగా శనివారం కేరళకు వ్యతిరేకంగా జరిగే మ్యాచ్‌లో నోర్డే తన శక్తి సామర్థ్యాలన్నీ ప్రదర్శిస్తాడని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇక కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టుకు గల మంచి ప్లేయర్లలో జోసు కుర్రాస్ ఒకడు. మిడ్ ఫీల్డ్ నుంచే గోల్స్ స్కోరింగ్ చేయగల అవకాశాలను కల్పించగల శక్తి సామర్థ్యం కుర్రాస్‌కు సొంతం. కేరళ బ్లాక్ బస్టర్స్ తరపున వరుసగా రెండో ఏడాది ఆడుతున్న కుర్రాస్ ఫార్వర్డ్ ప్లేయర్ గా స్పీడ్ గా దూసుకెళ్లడంతోపాటు అన్ని వేళ్లలోనూ ప్రత్యర్థి డిఫెన్స్ ను ఎదుర్కొనే గార్డుగానూ ఉన్నాడు.

డిఫెన్స్‌లో లూసియాన్.. గోల్స్ సాధనలో జెర్మన్ కీలకం
ముంబై సిటీ ఎఫ్ సి జట్టు మంచి ఆత్మరక్షణ రికార్డు గల జట్టుగా నిలిచిందంటే లుసియాన్ గోవాన్ సేవలే కారణం. సెంటర్ బ్యాక్ ప్లేయర్ పూర్తిగా బ్యాక్ వైపున నిలిచాడంటే ప్రత్యర్థులకు నిలువెత్తు అడ్డుగోడే మరి. ప్రత్యర్థి అటాకర్లకు స్పేస్ కల్పించేందుకే ఇష్టపడడు ఈ లుసియాన్. అయినా శనివారం మరో అగ్ని పరీక్ష ఎదుర్కోనున్నాడు. సొంత గడ్డపై జరిగే ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి ఫార్వర్డ్ లైన్‌కు భిన్నంగా ఎటువంటి వ్యూహం అనుసరిస్తాడో వేచి చూడాల్సిందే మరి. పుష్కల అవకాశాల కల్పనకు ఎలా పూనుకుంటాడో వేచి చూద్దాం.
ఇక కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టులో నెమ్మదిగా పుంజుకున్న ప్లేయర్లలో అంటోనియో జెర్మన్ ఒకరు. ఇంతకుముందు జరిగిన మ్యాచ్‌లో హిట్ కొట్టిన అంటోనియో జర్మన్.. డిఫెండింగ్ చాంపియన్స్ చెన్నైయిన్ జట్టుకు వ్యతిరేకంగా రెండు అసిస్టెన్స్ లు అందించి టీం విక్టరీలో కీలక పాత్ర పోషించిన ప్లేయర్. ఫేసీ ఫార్వర్డ్ ప్లేయర్ శనివారం జరిగే మ్యాచ్‌లో తొలి గోల్ సాధిస్తాడని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. డిఫెన్స్ లో ఆయన అనుసరించే వ్యూహం, అంటోనియో స్ట్రాంగ్ ఫేంకు తగిన ఆటతీరు ప్రదర్శించగలిగితేనే కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టు విజయం సాధించి సెమీస్ లో బెర్త్ అవకాశాలను మెరుగు పరుచుకోగలుగుతుంది.

జట్ల వివరాలు:
ముంబై సిటీ ఎఫ్ సి: రాబర్టో వొల్పాటో నెటో, అమరీందర్ సింగ్, అల్బినో గోమ్స్, గెర్సన్ వెయిరా, లుసియాన్ గోయాన్, ఫకుండో కార్డోజో, అన్వర్ అలీ, అయిబొర్లాంగ్ ఖోంగ్జీ, లాల్హామాంగ్నైహసంగరాల్టే, లాల్చౌన్మావైయాఫనాయి, అశుతోష్ మెహతా, క్రిష్టియాన్ వాడోక్జ్, లియో కోస్తా, జాకిచంద్ సింగ్, శరణ్ సింగ్, షెహ్ నాజ్ సింగ్, భాయిథాంగ్ హావోకిప్, డేవిడ్ లాల్రిమ్నువా, మాటియాస్ డెఫెడెరికో, ఒటాసిలియో బ్రిటో అల్వేస్, సోనీ నోర్డే, డియాగో ఫోర్లాన్, థియాగో చున్హా, సునిల్ ఛెత్రి, ఉదాంతా సింగ్.
కేరళ బ్లాక్ బస్టర్స్ ఎఫ్ సి: గ్రహం స్టాక్, సందీప్ నాందీ, కునాల్ సావంత్, అరోన్ హుగెస్, సెడ్రిక్ హెంగ్ బార్ట్, సందేశ్ జిగ్నాన్, గుర్విందర్ సింగ్, ప్రతీక్ చౌదరి, యీల్హాదీ డోయే, జోస్ కురియస్, డిడియర్ బోరిస్ కాడియో, అజ్రక్ మహమత్, మెహతాబ్ హుస్సేన్, మహ్మద్ రఫీఖ్, ఇస్ఫాఖ్ అహ్మద్, వినిత్ రాయ్, మిచైల్ చోప్రా, ఆంటోనియో జర్మన్, కెర్వెన్స్ బెల్ఫోర్ట్, డకెన్స్ నాజోన్, మహ్మద్ రఫీ, థోంగ్ ఖోసీయం హావోకిప్, ఫరూఖ్ చౌదరి, సికె వినిత్, రినో అంటో.


Click it and Unblock the Notifications













