ముంబై Vs నార్త్ఈస్ట్: సెమీస్ బెర్తు ఎవరికి దక్కుతుందో?
గౌహతి: టాప్ ఫోర్ జాబితాలో చేరిపోయిన ముంబై సిటీ ఎఫ్ సి జట్టు మరోసారి నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్ సి క్లబ్ జట్టుపై గెలుపొంది సెమీస్‌కు తన స్థానాన్ని భర్తీచేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నది. శనివారం రాత్రి ఏడు గంటలకు గౌహతిలోని ఇందిరాగాంధీ అథ్లెటిక్ స్టేడియంలో జరుగనున్న మ్యాచ్‌లో పాల్గొనే ముంబై సిటీ జట్టుకు స్వాగతం పలుకనున్న నార్త్ఈస్ట్ జట్టు సైతం తొలి నుంచి వెళుతున్నట్లే దూకుడుగా వ్యవహరించి విజయం సాధించాలని తలపోస్తున్నది.
కానీ డిఫెండింగ్ చాంపియన్స్ చెన్నైయిన్ జట్టుతో 0 - 1 స్కోర్, అట్లెటికో డీ కోల్ కతాతో 1 - 2 స్కోర్ తేడాతో పరాజయం పాలైన నార్త్ఈస్ట్ ఆత్మ రక్షణలో పడింది. అయినా టైట్‌గా సాగుతున్న టోర్నీలో ఈ మ్యాచ్‌లో గెలుపొందితే టాప్ ఫోర్ జాబితాలో తొలిస్థానానికి దూసుకెళుతుంది. దీనికి తోడు సొంతగడ్డపై ఆడటం నార్త్ఈస్ట్ జట్టుకు కలిసి వచ్చే అంశం. ఇంతకుముందు జరిగిన మ్యాచ్‌లలో ముంబైకర్లు ఐఎస్ఎల్ చాంపియన్లు అట్లెటికో డీ కోల్ కతాపై 0 - 1 స్కోర్ తేడాతో విజయం సాధించగా, చెన్నైయిన్‌తో 1- 1 స్కోర్ తేడాతో మ్యాచ్ డ్రాగా ముగించి జోరు మీదున్నారు.
ముంబైకర్లు కూడా పాయింట్ల టేబుల్‌లో 12 పాయింట్లతో రెండోస్థానంలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ముంబై జట్టు గెలిస్తే 15 పాయింట్లతో ప్రస్తుతం టాప్‌లో ఉన్న ఢిల్లీ డైనమోస్‌ను అధిగమించడం, నార్త్ఈస్ట్ విజయం సాధిస్తే కోల్‌కతా, ముంబైలను అధిగమించి ఢిల్లీ డైనమోస్ సరసన చేరడం ఖాయంగా కనిపిస్తున్నది.
తొలి ఏడాది (2014)లో సొంతగడ్డపై జరిగిన మ్యాచ్ ల్లో నార్త్ఈస్ట్ జట్టు ఒక మ్యాచ్ 2 - 0 స్కోర్ తేడాతో విజయం సాధిస్తే మరో మ్యాచ్ 1 - 1 స్కోర్ తేడాతో డ్రాగా ముగించింది. గతేడాది సొంతగడ్డపైనే నార్త్ఈస్ట్ జట్టును ముంబై 5 - 1 స్కోర్ తేడాతో గెలుపొందితే ఇటీవల 0 - 2 స్కోర్ తేడాతో మరో మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ లో అలెగ్జాండ్రీ గుమారెస్ జట్టు పుణెపై 1 - 0 స్కోర్ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతానికి ఎనిమిది మ్యాచ్‌లు ఆడి 13 పాయింట్లతో ఢిల్లీ డైనమోస్ టేబుల్ టాప్ ప్లేస్‌లో నిలబడితే.. 12 పాయింట్లతో ముంబై సిటీ (ఎనిమిది మ్యాచ్‌లు), అట్లెటికో డీ కోల్‌కతా (ఏడు మ్యాచ్‌లు) రెండో స్థానంలో ఉన్నాయి. ఏడేసి మ్యాచ్‌లు ఆడి 10 పాయింట్లతో డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్, నార్త్ఈస్ట్ నాలుగవ, ఐదవ స్థానాల్లో నిలిచాయి. అయితే ఆయా జట్ల గోల్స్ ఆధారంగా సెమీ ఫైనల్స్ బెర్త్‌లు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక వారం తర్వాత తిరిగి మ్యాచ్ ఆడుతున్నా గాయంతో బాధపడుతున్న నార్త్ఈస్ట్ గోల్ కీపర్ సుబ్రతాపాల్ ఈ మ్యాచ్‌లో పాల్గొనడం అనుమానమే. రెండో కీపర్ టీఆర్ రెహెనేష్ కూడా గాయపడిన నేపథ్యంలో అల్ఫారో, విల్లింగ్టన్ గోమ్స్‌ల్లో ఒకరు కస్టోడియన్ పాత్ర పోషించే అవకాశాల్లేకపోలేదు. అల్ఫారో దూకుడుకు ముంబై డిఫెన్స్ ఏ మేరకు ముకుతాడు వేస్తుందో చూడాల్సిందే మరి.
ప్రస్తుత ఐఎస్ఎల్ సీజన్‌లోనే ఎమిలియానో అల్ఫారో నార్త్ఈస్ట్ తరఫున చెలరేగిపోతున్న ఆటగాడు. దూకుడుగా ఫినిషింగ్ టచ్ ఇస్తున్న ఈ ఉరుగ్వే ప్లేయర్ నార్త్ ఈస్ట్ అటాకింగ్ ఆయుధంగా నిలిచాడు. ప్రస్తుత సీజన్‌లో ఐదు గోల్స్‌తో టాప్‌స్కోరర్‌గా నిలిచిన అల్ఫారో.. బాక్స్ చుట్టూ ప్రత్యర్థికి ప్రమాదకరమైన రీతిలో చుక్కలు చూపగల సామర్థ్యం కలిగి ఉన్నాడు. ముంబై బ్యాక్ లైన్‌లో బిజీగా బంతిని తస్కరించగల నేర్పు ఆయన సొంతం.

ముంబై డిఫెన్స్ విభాగం
ఇక ముంబై డిఫెన్స్ విభాగంలో అయిబోర్లాంగ్ ఖోంగ్జీ నిరంతరం ప్రత్యర్థులకు ఎదురునిలుస్తున్న ప్లేయర్. అంతేకాదు. నిరంతరం డిఫెండర్‌గా వ్యవహరిస్తూనే బ్యాక్ లైన్ మీదుగా బంతిని సహచర ప్లేయర్లకు పాస్ చేయగలడు. నిరంతరం గెలుపు వ్యూహాల అమలులో ముందుంటున్న ఖోంగ్జీ.. ప్రత్యర్థి గోల్స్ ఫెయిల్ చేయడంలోనూ దిట్ట. కస్తుమి యుసా లేకుండా నార్త్ఈస్ట్ జట్టు లేదంటే అతిశేయోక్తే మరి. తనకు అప్పగించిన పనిని సిల్కీ టచ్‌తో ముగించడం ద్వారా తన శక్తి సామర్థ్యాలను రుజువుచేసుకున్నాడీ జపానీ కుర్రాడు.

ప్రత్యర్థులకు హడల్
తన పేస్, గైల్ పద్ధతుల్లో ప్రత్యర్థులకు హడలెత్తించడంలో సూపర్బ్. ఈ టోర్నీలో కేరళ బ్లాక్ బస్టర్స్‌తో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో యుసా గోల్ తోనే నార్త్ఈస్ట్ విజయం సాధించిందంటే ఆయన శక్తి సామర్థ్యాలు అవగతం అవుతాయి. 28 ఏళ్ల ఈ మిడ్ ఫీల్డర్ అత్యధిక విజయ వ్యూహాల ఖరారులోనూ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుత సీజన్‌లో ముంబై జట్టు ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ అనుక్షణం వీక్షకులను, రిఫరీలను ఆకర్షిస్తున్న ప్లేయర్ క్రిస్టియాన్ వాడోక్జ్ అంటే అతిశేయోక్తి కాబోదు.

ఆయనకు ఆయనే సాటి
బంతిని పాస్ చేయడంలోనూ, ప్రత్యర్థి నుంచి బంతిని ఒడుపుగా బంతిని తస్కరించడంలోనూ ఆయనకు ఆయనే సాటి. మిడ్ ఫీల్డ్‌లో నిరంతరం దూసుకెళ్లే ఈ హంగేరియన్‌కు గాలిలోకి దూసుకెళ్లడంతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించగలడు. నార్త్ఈస్ట్ డిఫెన్స్ వ్యూహంలో గుండెకాయ వంటి వాడు గుస్టావో లాజారెట్టి. వ్యూహాలు రూపొందిస్తూ నిరంతరం బంతిని స్వాధీనంచేసుకుని బాక్స్ లోకి పంపడమే లాజారెట్టి ప్రత్యేకత. బ్యాక్ లో ఉంటూ సరైన రీతిలో బంతిని సహచర ప్లేయర్లకు పాస్ చేయడంలో దిట్ట.

అటాకింగ్ ఆడే అవకాశం
ముంబైకర్లతో జరిగే మ్యాచ్‌లో ఫ్రంట్ లైన్ అటాకింగ్‌కు దిగుతాడని అంతా భావిస్తున్నారు. ఇక ముంబై సారధి డియాగో ఫోర్లాన్ తన జట్టుకు గొప్ప గురువు కూడా. టీంకు ముందుండి నాయకత్వం వహించడం ఫోర్లాన్ ప్రత్యేకత. గోల్ పోస్ట్ కు నేరుగా బంతిని పంపడంతోపాటు సహచర ప్లేయర్లు గోల్ చేసేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తాడు. డ్రెసింగ్ రూంలోనూ ముంబై కుర్రాళ్లకు గైడ్ లైన్స్ ఇవ్వడంలో ఈ మాంఛెస్టర్ యునైటెడ్ స్ట్రయికర్ అవకాశాలు కల్పించడంలోనూ సూపర్బ్. నార్త్ఈస్ట్ జట్టుతో శనివారం జరిగే మ్యాచ్‌లో చెలరేగిపోయే అవకాశాలే ఎక్కువ.

జట్ల వివరాలు:
నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్ సి: సుబ్రతాపాల్, టిపి రెహెనేశ్, విల్లింగ్టన్ గోమ్స్, సలాం రంజన్ సింగ్, నిర్మల్ ఛెత్రి, షౌవిక్ ఘోష్, రోబిన్ గురుంగ్, రీగన్ సింగ్, మైల్సొన్ అల్వేస్, గుస్తావో లాటరాజీ, డిడియర్ జొకోరా, ఫనాజీ లాల్రెంపుయా, హోలీచరణ్ నార్జారే, జెర్రీ మవిహ్మింగ్తాంగా, కస్తుమి యుసా, కొఫ్పీ క్రిస్టియన్ ఎన్'డ్రీ, లాల్లియాంజువాల ఛంగ్టే, రోవ్లిన్ బోర్గెస్, సైత్యాసేన్ సింగ్, విల్లింగ్టన్ ప్రియోరీ, రోమరిక్, ఎమిలియానో అల్ఫారో, నికోలస్ వెలెజ్, సాషా అనీఫ్, రాబర్ట్ కుల్లెన్, సుమీత్ పస్సీ.
ముంబై సిటీ ఎఫ్ సి: రాబర్టో వొల్పారో నెటో, అల్బినో గోమ్స్, గెర్సన్ వైరా, లుసియాన్ గోయాన్, ఫకుండో కార్డోజో, అన్వర్ అలీ, అయిబోర్లాంగ్ ఖోంగ్జీ, లాల్చుమ్నావియా ఫనాయి, మున్మున్ తిమోథీ లుగున్, అశుతోష్ మెహ్తా, క్రిస్జిస్టాన్ వాడోక్జ్, లియో కోస్తా, జాకిచంద్ సింగ్, సరణ్ సింగ్, బైథాంగ్ హావోకిప్, డేవిడ్ లాల్రన్మౌనా, రాకేశ్ ఓరం, మాతియాస్ డెఫెడెరికో, ఒటాసిలియో బ్రిటో అల్వెస్, సోనీ నోర్డె, డియాగో ఫోర్లాన్, అర్నాబ్ దాస్ శర్మ, థియాంగో కున్హా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications