కోచి: డిఫెండింగ్ చాంపియన్స్ చెన్నైయిన్ ఎఫ్ సి జట్టుకు మరో దక్షిణాది భారత జట్టు కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టు ఫ్రాంచైసీ శనివారం ఆతిథ్యం ఇవ్వనున్నది. కోచిలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం అందుకు వేదికగా మారనున్నది. తొమ్మిది మ్యాచ్‌ల్లో 12 పాయింట్లు సాధించిన కేరళ బ్లాక్ బస్టర్స్ సొంతింటి అభిమానుల మద్దతుతో శనివారం మ్యాచ్‌లో గెలుపొంది టాప్ 4లో చోటు దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు.
ఎఫ్ సి గోవాతో జరిగిన మ్యాచ్ లో 2 - 1 స్కోర్ తేడాతో గెలుపొందినందున అదే ఊపుతో ముందుకు సాగాలని తన శిష్యులకు కోచ్ స్టీవ్ కొప్పెల్ హితబోధ చేశాడు.మరోవైపు ఢిల్లీ డైనమోస్‌తో జరిగిన మ్యాచ్ లో 4 - 1 స్కోర్ తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసిన చెన్నైయిన్ జట్టులో ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది. అయినా ఎనిమిది మ్యాచ్ ల్లో 10 పాయింట్లు పొందిన చెన్నైయిన్ ఈ మ్యాచ్ లో గెలుపొందితే మళ్లీ టాప్ 4 జాబితాలో చోటు దక్కించుకోగలుగుతుంది.
తదుపరి ప్లేఆఫ్ దశకు చేరుకోనున్న తరుణంలో ఏ ఒక్క జట్టు దూకుడుగా ఆడకుండా ఆత్మ సంత్రుప్తి పొందేందుకు సిద్ధంగా లేదు. తొలి దశలో మ్యాచ్ డ్రాలకు ప్రాధాన్యం ఇచ్చిన ఈ రెండు జట్లు పాయింట్లు సాదించేందుకు అదనపు ఒత్తిడికి గురవుతున్నాయి. తొలి ఏడాది జరిగిన రెండు మ్యాచ్‌ల్లో చెన్నైయిన్ గెలుపొందితే, కానీ సెమీస్ తొలి మ్యాచ్ లో కేరళ గెలుపొందితే, తిరిగి చెన్నై మరో సెమీస్ లో విజయం సాధించాయి. అయితే ఈ రెండు జట్లు తొలి ఏడాది ఫైనల్స్ కు చేరుకోలేదు. గత ఏడాది సూపర్ మాచన్స్ పై సొంతగడ్డపై 4 - 1 స్కోర్ తేడాతో గెలుపొందితే, మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ ఏడాది జరిగిన మ్యాచ్ గోల్స్ లేకుండానే డ్రాగా ముగిసింది.

కేరళకు సందేశ్.. చెన్నైయిన్‌కు జెజె కీలకం
ప్రస్తుత సీజన్‌లో కేరళ బ్లాక్‌బస్టర్స్‌కు సందేశ్ జిజ్నాస్ అత్యంత కీలక ప్లేయర్. కేరళ పయనంలో ప్రతి నిమిషం జిజ్నాస్ పాత్ర ఉందంటే అతిశేయోక్తి కాదు. 23 ఏళ్ల ఈ కుర్రాడు డిఫెండర్‌గా, బ్యాక్ వైపు చురుగ్గా స్పందిస్తూ జట్టు అవకాశాలను మెరుగుపర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. గాలిలోనే స్ట్రయిక్స్ చేయడంలో కొట్టిన పిండి.
ఇప్పటికే ఒకసారి హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్న సందేశ్ జిజ్నాస్.. మరో దఫా ఆ అవార్డు గెలుచుకోవడానికి ఆసక్తిగా ఉన్నాడు. మరోవైపు చెన్నై సంచలనం జెజె లాల్పౌఖులా కూడా అదే దూకుడు ప్రదర్శిస్తాడు. అయితే కొన్ని మ్యాచ్‌ల్లో బెంచ్‌కు పరిమితమైన జెజె.. పిచ్‌పై రమణీయమైన షాట్లు కొట్టడంలో నేర్పుగా వ్యవహరిస్తాడు. మొత్తం టీం సభ్యులకు కీలక పాస్‌లు అందజేస్తూ జట్టు విజయానికి దారులు సుగమం చేస్తాడు.
వినీత్ టాలెంట్‌పై ఆశలు
సికె వినీత్ తక్షణం కేరళ బ్లాక్ బస్టర్స్ పై ప్రభావం చూపే ప్రధాన ప్లేయర్. ఎఎఫ్ సి ఫైనల్స్ లో బెంగళూరు ఎఫ్ సి తరఫున ఆడి వెనుకకు వచ్చిన వినీత్.. లోకల్ టాలెంట్ ఉన్న కుర్రాడు. ఇంతకుముందు గోవాతో జరిగిన మ్యాచ్ లో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన వినీత్ మరోసారి విజయం సాధించేందుకు సిద్దమవుతున్నాడు. స్థానికుడు కావడంతో మలయాళీలకు వినీత్‌పై భారీగానే ఆశలు ఉన్నాయి.
ఇక హన్స్ ముల్డర్ సూపర్ మచన్స్ మిడ్ ఫీల్డ్‌లో జనరల్ ఆటగాళ్లలో ఒకడు. ప్రతిసారీ బంతిని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని తలంచే హన్స్ ముల్లర్ ప్రత్యర్థి జట్లకు హడల్. ఆయన ఆడిన మ్యాచ్ ల్లో కొన్ని అణి ముత్యాల వంటివి ఉన్నా.. బంతిని తస్కరించడంలోనూ, జట్టు విజయం పట్ల ఆసక్తితోపాటు ప్రస్తుతం దూకుడుతో కూడుకున్న ఆయన ఆటతీరు కారణంగా సూపర్ మచన్స్ జట్టుకు ఆయన సేవలు తప్పనిసరి.
బెల్ఫోర్ట్.. రైస్ ఎవరికి వారే
ఈ ఏడాది తొలిసారి ఐఎస్ఎల్ టోర్నీలో అడుగు పెట్టిన కెర్విన్ బెల్ఫోర్ట్ పై కేరళ బ్లాక్ బస్టర్స్ భారీగానే ఆశలు పెట్టుకున్నది. బాక్స్ వద్ద చెలరేగిపోయిన ఈ హైతేయన్ ఇంటర్నేషనల్ గాలిలోకి దూకుతూ అనునిత్యం ప్రత్యర్థి జట్టుకు ప్రమాదకర సంకేతాలిస్తాడు. మ్యాచ్ ను పూర్తిగా జట్టుకు అనుకూలంగా మార్చగల శక్తి సామర్థ్యాలు ఉన్న ప్లేయర్ కెర్విన్స్ బెల్ఫోర్ట్ అంటే అతిశేయోక్తి కాదు.
కానీ జాన్ ఆర్నె రైస్ సజావుగా జట్టు ముందుకు సాగాలని కోరుకునే ప్లేయర్. సీరియల్ పేసర్‌గా ఉన్న రైస్ పరిస్థితులకు, డిమాండ్లకు అనుగుణంగా స్పందించే గుణం, వ్యవహరించే నేర్పు గల ప్లేయర్ రైస్. నార్వేయర్ ప్లేయర్ ఫార్వర్డ్‌లో పవర్ పుల్ షాట్స్ తో గోల్స్ సాధించడంలో పరిణతి సాధించాడు. శనివారం జరిగే మ్యాచ్‌లో ఒకింత మార్పు చూపుతాడనే అంతా విశ్వసిస్తున్నారు.
జట్ల వివరాలు:
కేరళ బ్లాక్ బస్టర్స్: గ్రహంస్టాక్, సందీప్ నాండీ, కునాల్ సావంత్, అరోన్ హుగెస్, సెడ్రిక్ హెంగ్బార్ట్, సందేశ్ జిగ్నాన్, గుర్విందర్ సింగ్, ప్రతీక్ చౌదరి, ఎల్హాద్జీ నోడ్యే, జోస్ కుర్రాయిస్, డిడియర్ బోరిస్ కాడియో, అజ్రక్ మహమత్, మెహ్తాబ్ హుస్సేన్, మహ్మద్ రఫీ, ఇస్పాక్ అహ్మద్, వినిత్ రాజ్, మిఖైల్ చోప్రా, ఆంటోనియో జెర్మన్, కెర్వెన్స్ బెల్ఫోర్ట్, డకెన్స్ నాజోన్, మహ్మద్ రఫీఖ్, థాంగ్కోసియం హావ్ కిప్, ఫరూఖ్ చౌదరి, సికె వినీత్, రినో ఆంటో.
చెన్నైయిన్ ఎఫ్ సి: కరంజిత్ సింగ్, పవన్ కుమార్, దువాయ్యే కెర్ర్, బెర్నాండ్ మెండీ, మెహ్రాజుద్దీన్ వాడో, ఎలీ సాబియా, ఎడర్ మొంటెరియో, జెర్రీ లాల్రిజులా, అభిషేక్ దాస్, జాన్ ఆర్న్ రైస్, బాల్జిత్ సాహ్ని, హన్స్ ముల్లర్, మానైలే బ్లాసి, థాయిసింగ్, రాఫెల్ అగస్టో, హర్మన్ జోత్ సింగ్ ఖబ్రా, డేవిడే సక్కీ, మౌరిజియో పెలుసో, బెదాశ్వోర్ సింగ్, ఉత్తం రాజ్, జెజె లాల్పెఖౌలా, జాకిర్ ముందంపరా, అనిరుధ్ థాపా.