For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఐఎస్ఎల్: సెమీస్‌లో పుణెకు గట్టి సవాల్

ఐఎస్ఎల్ 3వ ఎడిషన్‌లో పుణె జట్టు తప్పనిసరిగా శుక్రవారం కోచిలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో గెలుపొందాల్సిన పరిస్థితి నెలకొంది.

By Nageshwara Rao

కోచి: ప్రస్తుత ఐఎస్ఎల్ 3 ఎడిషన్‌లో ఎఫ్‌సి పుణె జట్టు తప్పనిసరిగా శుక్రవారం కోచిలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో గెలుపొందాల్సిన పరిస్థితి నెలకొంది. ఇరు జట్లు కూడా పాయింట్ల పట్టికలో చెరో 15 పాయింట్లు సాధించినా పుణె ఒక అడుగు ముందు వరుసలో నిలిచింది.

ముంబై సిటీ ఎఫ్ సితో జరిగిన మ్యాచ్ లో 5 - 0 స్కోర్ తేడాతో కేరళ బ్లాక్ బస్టర్స్ ఓటమి పాలవ్వగా, నార్త్ఈస్ట్ యునైటెడ్ జట్టుపై పుణె 1 - 0 స్కోర్ తేడాతో విజయం సాధించింది. అయితే కేరళ జట్టు కంటే ఒక మ్యాచ్ ఎక్కువగా ఆడటంతో పుణె కుర్రాళ్లపై ఒత్తిడి ఎక్కువగా ఉంది.

సెమీ ఫైనల్స్‌లో ప్రవేశించాలంటే పుణె కుర్రాళ్లు ఈ మ్యాచ్ లో తప్పనసరిగా గెలుపొందాల్సిన అవసరముంది. అయినప్పటికీ కేరళ జట్టును తేలిగ్గా కొట్టి పారేయడం లేదు. మానసికంగా రెండు జట్లు బలహీనమైనవైనా గత మ్యాచ్‌లో హోరాహోరీ తలపడ్డాయి.

అయితే కేరళ జట్టు సొంత గడ్డపై అభిమానుల మధ్య ఆడటం ఖచ్చితంగా హబాస్ సేనకు సవాలే. తొలి ఏడాది పుణెపై రెండు విజయాలు సాధిస్తే, గతేడాది చెరో మ్యాచ్ గెలుపొందాయి. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన మ్యాచ్ ఫలితం కూడా డ్రాగా ముగించాయి.

సందేశ్ జిగ్నాస్ వర్సెస్ అనిబల్ రోడ్రిగెజ్

సందేశ్ జిగ్నాస్ వర్సెస్ అనిబల్ రోడ్రిగెజ్

ఐఎస్ఎల్ ప్రస్తుత సీజన్‌లో అందరి ద్రుష్టిని ఆకర్షించిన దేశీయ ఆటగాడు సందేశ్ జిగ్నాస్ అంటే అతిశేయోక్తి కాదు. ప్రత్యర్థి జట్టులోకి దూసుకెళ్లడంతోపాటు ఎల్లవేళలా శరవేగంగా స్పందిస్తూ సమర్థవంతంగా వ్యూహాలు అమలుచేస్తూ జట్టు విజయానికి అహర్నిశలు పాటుపడే ప్లేయర్. గ్రౌండ్‌పైనా, ఎయిర్‌లోనూ దూసుకెళ్లే నేర్పు గల కొద్ది మంది డిఫెండర్లలో జిగ్నాస్ ఒకడు. పలు అత్యున్నత ప్రమాణాలు కొనసాగిస్తున్నా జిగ్నాస్ ఈ సీజన్‌లో ఒకింత భిన్నమైన ఆట తీరు ప్రదర్శించాడు. జిగ్నాస్ గైర్హాజరీలో జట్టుకు ప్రతికూల ఫ్రతిపలం ఉంటుందంటే కాదనలేం. హై వర్క్ రేట్ గల జిగ్నాస్ ప్రతిభా పాటవాలను శుక్రవారం సాయంత్రం కేరళ జట్టుకు మేలు చేకూర్చడంలో కీలక పాత్ర పోషిస్తాడని భావిస్తున్నారు. ప్రత్యేకించి కేరళ డిఫెన్స్‌లో ఆయన పాత్ర కాదనలేనిది.

కీలకమైన ప్లేయర్‌గా

కీలకమైన ప్లేయర్‌గా

ఎఫ్ సి పుణె జట్టుకు అనిబల్ రోడ్రిగెజ్ కూడా కీలకమైన ప్లేయరే. కీలక టై దశలో స్కోర్ పాయింట్లు సాధించడానికి ప్రయత్నించే రోడ్రిగెజ్ వంటి ఆటగాడు పుణెకు కావాల్సిన ఆటగాడే. ఈ దఫా నాలుగు గోల్స్ సాధించిన ఈ మెక్సికన్ ప్లేయర్ తన క్లాస్ ఆటలో పుష్కలమైన అవకాశాలు కల్పించగల నేర్పరి. త్వరితగతిన ఫీట్ కదిలిస్తూ కామ్‌గా ఫినిష్ చేయగల సామర్థ్యం అనిబల్‌కు సొంతం. డిఫెన్స్‌లోనూ బ్రేకులేయగల శక్తిగల ఆటగాడు అనిబల్ ప్రతిభ కేరళతో తలపడేందుకు దోహదపడే అవకాశాలు లేకపోలేదు.

మిడ్‌ఫీల్డ్‌లో డిడియర్.. సెంటర్‌లో సిస్సోకో

మిడ్‌ఫీల్డ్‌లో డిడియర్.. సెంటర్‌లో సిస్సోకో

కేరళ బ్లాక్ బస్టర్స్ మిడ్ ఫీల్డర్లలో డిడియర్ బోరిస్ కాడియో ఒకరు. కేవలం పాయింట్లు సాధించడంతోపాటు తన జట్టును 25 దఫాలు సేవ్ చేయడంలో కీలకం. దూకుడుగా ప్రమాదకరస్థాయిలో దూసుకెళ్లే డిఫెన్సివ్ ప్లేయర్ కూడా. పలు రూపాల్లో పరిశీలించినా పూర్తిగా మిడ్ ఫీల్డర్‌గా వ్యవహరిస్తాడు. పుణెతో జరిగే మ్యాచ్‌లో ప్రతిసారి ముందు వరుసలోనిలుస్తాడు. విజిటర్స్ జట్టు పుణె సారధి మహ్మద్ సిస్సోకో జట్టుకు అత్యంత కీలకంగానూ, సెంటర్ పాయింట్‌గానూ మారాడు. అనిబల్ రోడ్రిగెజ్ తర్వాత పుణె జట్టులో నాలుగు గోల్స్ తో రెండోస్థానంలో నిలిచాడు. ఎయిర్‌లోనే 25 సార్లు ప్రత్యర్థి జట్టును అడ్డుకుని మొత్తం 47 సార్లు సొంత జట్టును కాపాడాడు. కేరళ బ్లాక్‌బస్టర్స్ జట్టులో కాడియా మాదిరిగా సిస్సోకో శక్తి సామర్థ్యాలతో మ్యాచ్ ఆసక్తికరంగా తీర్చిదిద్దగల సామర్థ్యం కలవాడు.

కెర్వెన్స్ బెల్‌ఫోర్ట్ వర్సెస్ రాహుల్ భెకె

కెర్వెన్స్ బెల్‌ఫోర్ట్ వర్సెస్ రాహుల్ భెకె

కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టు అఫెన్సివ్ దాడిలో కీలక పరికరంగా కెర్వెన్స్ బెల్ ఫోర్ట్ ఒకరు. రెండు గోల్స్ సాధించి ఒక అసిస్టెన్స్ అందించాడు. జట్టు తరఫున అత్యధికంగా 19 షాట్లు కొట్టిన కెర్వెన్స్.. ప్రత్యర్థులకు హడలంటే అతిశేయోక్తి కాదు. ఫేసీగా ప్రత్యర్థులకు సమర్థవంతంగా డిఫెన్స్ ఇవ్వగల సమర్థత ఆయన సొంతం. సొంత గడ్డపై ఆడుతుండటం కెర్వెన్స్‌కు ప్లస్ పాయింట్. ఎల్లవేళలా ప్రత్యర్థి జట్లకు ఆయనతో ముప్పే. పుణె సిటీ జట్టులో వాస్తవిక రియలబుల్ డిఫెండర్లలో రాహుల్ భెకె ఒకరు. తన మాజీ జట్టుకు వ్యతిరేకంగా ఆడనున్న రాహుల్.. శుక్రవారం పాయింట్ సాధించాలని తహతహలాడుతున్నాడు. ఎనిమిది మ్యాచ్‌ల్లో పాల్గొన్న 29 టాకిల్స్‌ను ఎదుర్కొన్నాడు. శరవేగంగా స్పందిస్తూ కీలక సమయంలో వ్యూహం అమలుచేయగల నేర్పు గల వాడు. శుక్రవారం కేరళతో జరిగే మ్యాచ్‌లోనూ కీలక భూమిక పోషించగలడు.

జట్ల వివరాలు:

జట్ల వివరాలు:

కేరళ బ్లాక్ బస్టర్స్: గ్రాహం స్టాక్, సందీప్ నాండే, కునాల్ సావంత్, అరోన్ హుగెస్, సెడ్రిక్ హెంగ్బార్ట్, సందేశ్ జిగ్నాస్, గుర్విందర్ సింగ్, ప్రతీక్ చౌదరి, ఎల్హాదీ న్డోయే, జోస్ కురియస్, డిడియర్ బోరిస్ కాడియో, అజ్రక్ మహమత్, మెహతాబ్ హుస్సేన్, మహ్మద్ రఫీఖ్, ఇస్పాఖ్ అహ్మద్, వినిత్ రాయ్, మిఖైల్ చోప్రా, అంటోనియో జెర్మన్, కెర్వెన్స్ బెల్ఫోర్ట్, డంకెన్స్ నాజోన్, మహ్మద్ రఫీ, థోంగ్ఖోసియం హావోకిప్, ఫరూఖ్ చౌదరి, సికె వినీత్, రినో ఆంటో.

ఎఫ్‌సి పుణె సిటీ: ఎడెల్ బెటె, అరిందం భట్టాచార్య, విశాల్ కైథ్, జొడింగ్లియానా రాల్టే, రాహుల్ భెకె, యుమ్నం రాజు, నారాయణ్ దాస్, అగస్టీన్ పెర్నాండెస్, ధర్మరాజ్ రావణన్, ఎడుయారో ఫెరీరా, గౌరమాంగీ సింగ్, అరాట ఇజుమి, జొన్నాథన్ లుక్కా, ఫ్రాన్సిస్ ఫెర్నాండెజ్, బ్రూనో ఏరియస్, జోసెప్ మారియా కొమాడేవల్ల్ క్రౌస్ (పిటు), లెన్ని రోడ్రిగెజ్, మొమ్మార్ నోడోయే, సంజూ ప్రధాన్, అనిబల్ జుర్డో రోడ్రిగెజ్, గుస్తావో ఒబెర్మన్, జీసస్ రోడ్రిగెజ్ టాటూ, ఎగెన్సోన్ లింగ్డో.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+