Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్లేఆఫ్ ఆశలు: చెన్నై, నార్త్ఈస్ట్ జట్లకు చావోరేవో!

చెన్నై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) మూడో ఎడిషన్ ప్లే ఆఫ్ దశ పూర్తిదశకు చేరుకుంటున్నది. ఈ తరుణంలో శనివారం చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్ ఎఫ్ సి జట్టుతోపాటు జాన్ అబ్రహం సారధ్యంలో నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్ సి జట్టుకూ ఎంతో కీలకం కానున్నది.

ఈ మ్యాచ్ లో గెలుపొందిన జట్టుకు మాత్రమే సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. ప్రారంభంలో చెలరేగిపోయిన నార్త్ఈస్ట్.. తర్వాత క్రమంగా పుంజుకున్న డిఫెండింగ్ చాంపియన్ జట్లు పాయింట్ల పట్టికలో ఆరవ, ఏడవ స్థానాల్లో నిలిచాయి. ప్రత్యేకించి డిఫెండింగ్ చాంపియన్ మళ్లీ టైటిల్ ను కైవసం చేసుకోవాలంటే నార్త్ఈస్ట్ జట్టుపై తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.

ఏడో స్థానంలో 12 పాయింట్లతో కొనసాగుతున్న చెన్నైయిన్ మరో ఆరు పాయింట్లు పొందాలంటే తప్పనిసరిగా రెండు గ్రూప్ మ్యాచ్ ల్లో విజయం సాధిస్తేనే సెమీ ఫైనల్స్ కు అర్హత సాధించగలుగుతుంది. డిఫెండింగ్ చాంపియన్లుగా చెన్నైయిన్ జట్టు.. శనివారం నార్త్ఈస్ట్ జట్టుతో జరిగే మ్యాచ్‌తోపాటు మరో విజయం సాధించగలిగితేనే సెమీస్ కు వెళ్లగలుగుతుంది.

గతేడాది కూడా చివరి దశ వరకు ప్రత్యేకించి గ్రూప్ దశ వరకు పాయింట్ల పట్టికలో దిగువనే కొనసాగింది. తర్వాత క్రమంగా పుంజుకుని తన శక్తి సామర్థ్యాలను పూర్తిగా ప్రదర్శిస్తూ.. ఫైనల్స్‌లో ఎఫ్ సి గోవా జట్టును థ్లిల్లింగ్ ఫైనల్స్ లో ఓడించి టైటిల్ ను కైవసం చేసుకున్నది. కానీ ఈ దఫా చెన్నైయిన్ జట్టు రూపొందించుకునే ప్రతి వ్యూహం అమలయ్యే సంకేతాలేమీ కనిపించడం లేదు.

టైటిల్ నిలబెట్టుకుంటామని విశ్వాసం

టైటిల్ నిలబెట్టుకుంటామని విశ్వాసం

సూపర్ మాచన్స్ హెడ్ కోచ్ మార్కో మాటరాజ్జీ ఇప్పటికీ తాము టైటిల్ నిలబెట్టుకుంటామని విశ్వాసం వ్యక్తంచేస్తుండటం గమనార్హం. ‘మేం తప్పనిసరిగా ఈరోజు జరిగే మ్యాచ్ గెలువాల్సిన అవసరం ఉందని మాకు తెలుసు. ప్రస్తుత గ్రూప్ దశలో రెండు గేమ్స్ లో విజయం సాధించి ఆరు పాయింట్లు పొందితేనే ముందడగు వేయగలం. గతంలోనూ ప్రతి జట్టుతో పోరాడి ముందుకు వెళ్లాం' అని మాటరాజ్జీ గుర్తుచేశాడు. గత ఐదు మ్యాచ్ లలో చెన్నైయిన్ మూడు మ్యాచ్ లలో ఓటమి పాలైంది. ముంబై సిటీతోనూ ఓటమి పాలైన సూపర్ మాచన్స్.. శనివారం నార్త్ఈస్ట్ జట్టుతోపాటు వచ్చేవారం ఎఫ్ సి గోవా జట్టుతో తలపడనున్నది.

సెమీ ఫైనల్స్ ఆశలు సజీవంగా

సెమీ ఫైనల్స్ ఆశలు సజీవంగా

ఇంతకుముందు ఎఫ్ సి పుణె జట్టుతో 1-0 స్కోర్ తేడాతో విజయం సాధించిన నార్త్ఈస్ట్ యునైటెడ్ జట్టు.. తన సెమీ ఫైనల్స్ ఆశలు సజీవంగా నిలుపుకోగా, తొలుత సెమీ ఫైనల్స్ లోకి దూసుకెళ్లిన ముంబై సిటీ చేతిలో సూపర్ మాచన్లు ఓటమి పాలయ్యారు. ప్రస్తుత లీగ్ లో తమ ఆశలు సజీవంగా కాపాడుకోవాలంటే మరిన్ని పాయింట్లు సాదిస్తేనే సాధ్యమన్నాడు. బలాబలాల్లో ఇటు డిఫెండింగ్ చాంపియన్.. అటు నార్త్ఈస్ట్ జట్లు సమ ఉజ్జీలుగా నిలిచి ఉన్నాయి. చెన్నైయిన్ సారధి జాన్ ఆర్నె రైస్ జట్టుకు ప్రధాన ఆధారం.

డిఫెన్స్ పైనా పట్టు

డిఫెన్స్ పైనా పట్టు

లెఫ్ట్, సెంటర్ బ్యాక్ లలో సమర్థవంతంగా ఆడగల నేర్పు గల ప్లేయర్. అంతేకాదు డిఫెన్స్ పైనా పట్టు కలిగి ఉన్నాడు. ఇక నార్త్ఈస్ట్ ఆటగాడు నికోలస్ వెలెజ్ ఇన్ సైడ్ బాక్స్‌లో డిఫెండర్ గా ప్రత్యర్థులకు సమస్యలుగా కల్పించగలడు. అర్జెంటీనా ప్లేయర్ గోల్ సాధనతోపాటు టీంను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లగలడు. చెన్నైయిన్ ప్లేయర్ హన్స్ ముల్లర్ పాసింగ్ లో ఎక్స్ పర్ట్. మరోవైపు నార్త్ఈస్ట్ యునైటెడ్ సారధి డిడియర్ జొకొరా సెంటర్ లోనూ, ఫీల్డ్ లోనూ జట్టుకు చాలా కీలకం.

విజయాన్ని నిర్దేశించే ప్లేయర్

విజయాన్ని నిర్దేశించే ప్లేయర్

తన కుర్రాళ్లకు కీలక పాస్ లు అందిస్తూ ముఖ్యమైన సందర్భంగా ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కోవడంతోపాటు వారి వ్యూహాలను చొచ్చుకు వెళ్లగలడు. ముంబై సిటీతో జరిగిన మ్యాచ్ లో దూకుడు ప్రదర్శించని డేవిడ్ సుక్కీ.. ఎటువంటి మ్యాచ్ లోనైనా విజయాన్ని నిర్దేశించే ప్లేయర్ అనడంలో సందేహం లేదు. డిఫెండర్ గా ప్రత్యర్థి జట్లకు హడల్. చెన్నైయిన్ స్కోర్లలో ఆయన భాగస్వామ్యం కూడా ఉంది. నార్త్ఈస్ట్ యునైటెడ్ జట్టుకు మయిల్సన్ అల్వెస్ పూర్తిగా దన్నుగా నిలుస్తున్న ఆటగాడని చెప్పొచ్చు. కీలక సందర్భంగాల్లో తెలివిగా ప్రత్యర్థి జట్లను ఢీ కొట్టే నేర్పు గల వాడే..

జట్ల వివరాలు:

జట్ల వివరాలు:

చెన్నైయిన్ ఎఫ్ సి: కరంజిత్ సింగ్, పవన్ కుమార్, దువాయ్నే కెర్ర్, బెర్నాండ్ మెండీ, మెహ్రాజుద్దీన్ వాడో, ఎలీ సాబియా, ఎడర్ మొంటెరియో, జెర్రీ లాల్రింజౌలా, అభిషేక్ దాస్, జాన్ ఆర్నె రైస్, బల్జిత్ సాహ్ని, హన్స్ ముల్డర్, మాన్యుల్లె బ్లాసీ, థాయిసింగ్, రాఫెల్ అగస్టో, హర్మాంజోత్ సింగ్ ఖాబ్రా, డేవిడ్ సుక్కీ, మౌరిజియో పెలుసో, బెదాశ్వోర్ సింగ్, ఉత్తం రాయి, జెజె లాల్పెఖ్లౌ, జకీర్ ముందంపరా, జయేశ్ రాణె, డానియన్ లాల్మింపుయా.

నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్ సి: టిపి రెహెనెష్, సుబ్రతాపాల్, విల్లింగ్టన్ గోమ్స్, గుస్టావో లాజారెట్టి, మైల్సన్ అల్వెస్, నిర్మల్ ఛెత్రి, రీగన్ సింగ్, రాబిన్ గురుంగ్, సలాం రంజన్ సింగ్, షౌవిక్ ఘోష్; డిడియర్ జొకొరా, ఫనాయి లాల్రేంపుయా, హోలిచరణ్ నార్జారీ, జెర్రీ మావిహ్మింగ్తాంగా, కస్తుమి యుసా, కొఫి క్రిష్టియన్ ఎన్'డ్రీ, లాల్లియాంజౌలా ఛాంగ్టే, సైత్యాసేన్ సింగ్, విల్లింగ్టన్ ప్రియోరీ, ఎమిలియానో అల్ఫారో, నికో వెలెజ్, రాబర్ట్ కుల్లెన్, సాషా అనీఫ్, సుమీత్ పస్సీ.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+