ఐఎస్ఎల్: టాప్4లో పుణె, నార్త్ ఈస్ట్‌ల్లో చోటెవరికి?
ఫాటోర్డా: ఐఎస్ఎల్ 3 ఎడిషన్ పెర్పార్మెన్స్‌లో వెనుకబడినా ఇప్పటికీ సెమీ ఫైనల్స్ పై ఆశలు పెట్టుకున్న ఎఫ్ సి గోవా జట్టు శుక్రవారం నార్త్ఈస్ట్ యునైటెడ్ జట్టుకు ఆతిథ్యం ఇవ్వనున్నది. కోచిలో కేరళ బ్లాక్ బస్టర్స్ పై 2-1 స్కోర్ తేడాతో మాదిరిగా విజయం సాధించినట్లే పాటోర్డాలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో నార్త్ఈస్ట్ యునైటెడ్ జట్టును ఓడించాలని తలపోస్తున్నది.
సస్పెన్షన్‌కు గురైన గ్రెగరీ ఆర్నోలిన్, రిచర్లైసన్ సర్వీసులు అందుబాటులో లేకున్నా కేవలం తొమ్మిది మంది ప్లేయర్లతో కేరళ బ్లాక్ బస్టర్స్ పై సంచలన విజయం సాధించింది. సస్పెన్షన్ కారణంగా టాప్ స్కోరర్ ఎమిలియానో అల్ఫారో పరోక్షంలోనే నార్త్ఈస్ట్ తప్పనిసరిగా గెలువాల్సిన మ్యాచ్ కావడంతో ఇరు జట్లకు పాటోర్డా స్టేడియం కీలకం కానున్నది.
దీనికి తోడు మూడు వరుస పరాజయాలు నార్త్ఈస్ట్ యునైటెడ్ జట్టును వెంటాడుతున్నాయి. తదుపరి దశలో అడుగు పెట్టాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా ముఖ్యమైంది. తొలి ఏడాది జరిగిన మ్యాచ్ ల్లో ఒక మ్యాచ్ 1-1 స్కోర్ తేడాతో డ్రా చేయగా, సొంతగడ్డపై 3-0 స్కోర్ తేడాతో విజయం సాధించింది.
2015లో 3-1 స్కోర్ తేడాతో ఒక మ్యాచ్ గెలుపొందితే.. సొంతగడ్డపై డ్రాగా ముగించింది. ఈ ఏడాది నార్త్ ఈస్ట్ సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో ఎమిలియానో అల్ఫారో రెండు గోల్స్ చేయడంతో నార్త్ఈస్ట్ విజయం సాధించింది.

ప్రతిభకు రాఫెల్, అనుభవానికి రాబర్ట్
ఈ సీజన్ మ్యాచ్ ల్లో రాఫెల్ దుమాస్ నిరంతరం గోవా తరఫున జరుగుతున్న మ్యాచ్ లలో కీలకం. ఈ 21 ఏండ్ల కుర్రాడు అత్యంత పరిణతి ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రత్యర్థిని అడ్డుకోవడంలో గానీ, అవంతరాలు నెలకొల్పడంలో గానీ ఈ బ్రెజిలియన్ కుర్రాడు ఎంతో నేర్పుగా వ్యవహరిస్తాడు. అతడి క్లీన్ పాసింగ్ చాలా బాగుంటుంది. సెమీ ఫైనల్స్‌కు చేరుకోవాలని తలపోస్తున్న గోవాకు ప్రత్యర్థిపై డిఫెన్స్ అస్త్రంగా ప్రయోగించేందుకు రాఫెల్ దుమాస్ ఉపయోగపడతాడు. నార్త్ఈస్ట్ తరఫున నాలుగు మ్యాచ్‌ల్లో పాల్గొన్న రాబర్ట్ కుల్లెన్ పలు సార్లు జట్టును ఆదుకున్నాడు. యూరోపియన్ లీగ్‌ల్లో అనుభవం గడించిన ఈ జపనీస్ స్ట్రయికర్ ఎటువంటి డిఫెన్సునైనా ఎదుర్కోగల సత్తా కలిగి ఉన్నాడు. గోవా బ్యాక్ లైన్ నుంచి కూడా గోల్ చేయగల సత్తా, నైపుణ్యం రాబర్ట్ సొంతం. కనుక గోవా కోచ్ జికో ఈ జపనీస్ స్ట్రయికర్ ను ఎదుర్కొనేందుకు వ్యూహం, మార్గం రూపొందించుకోవాల్సిందే మరి.

మందార్ రావు, యుసా పోటాపోటీ
గౌర్స్ లైనప్ లో మందార్ రావు దేశాయ్ అనుభవం కలిగిన ప్లేయర్లలో ఒకడు. కీలకమైన సమయాల్లో ఒత్తిడి వచ్చినప్పుడు మ్యాచ్‌ను జట్టు నియంత్రణలోకి తీసుకురాగల నేర్పు మందార్ రావు సొంతం. ఈ 24 ఏండ్ల కుర్రాడి పాసింగ్ క్వాలిటీస్ గోవాను గట్టెక్కించేందుకు దోహదపడతాయంటే అతిశేయోక్తి కాదు. ప్రస్తుత సీజన్ లో నార్త్ఈస్ట్ జట్టుకు ప్రతిభావంతుడైన ప్లేయర్ గా కస్తుమి యుసా తన తెలివి తేటలను ఉపయోగించి జట్టును విజయ తీరాలకు చేర్చేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తాడు. అను నిత్యం ఈ జపనీస్ ప్లే మేకర్.. అటాకింగ్, డిఫెన్స్ లో జట్టుకు పెద్ద అండ. కష్టతర సమయాల్లోనూ వేగంగా బంతిని పాస్ చేసి గోల్ పోస్ట్ కు గల ప్రమాదకరమైన ఆటగాడు.

డిఫెన్స్‌లో రాఫెల్, మైల్సన్ కీలకం
జికో కోచ్‌గా ఉన్న గోవా క్లబ్ జట్టులో అతి కొద్ది మంది ప్లేయర్లలో రాఫెల్ కొయెల్హో ఒకడు. అత్యధిక స్థాయిలో గోల్స్ చేసే అవకాశమున్న ప్లేయర్ ఇతగాడు. జట్టుకు ప్రమాదం ముంచుకొచ్చినప్పుడల్లా బంతిని తన నియంత్రణలోకి తీసుకోవడం ఆయన స్పెషాలిటీ. ప్రస్తుత సీజన్‌లో అతి ముఖ్యమైన స్ట్రయికర్లలో రాఫెల్ కొయెల్హో ఒకడు. గాలిలో నుంచే బంతిని సమర్థంగా ముందుకు కిక్ కొట్టగల సామర్థ్యం, నేర్పు, ఓర్పు కలిగి ఉన్నాడు. కొయెల్హో వల్ల విపక్ష జట్టు నార్త్ఈస్ట్ కుర్రాళ్లకు చుక్కలు కనిపించడం ఖాయంగా కనిపిస్తున్నది. గాయం నుంచి కోలుకుని జట్టులోకి తిరిగి వచ్చిన మైల్సన్ అల్వెస్ నార్త్ఈస్ట్ జట్టుకు ప్రధాన డిఫెన్స్ అస్త్రం కానున్నాడు. ఈ బ్రెజిలియన్ ప్లేయర్ అత్యంత విలువైన అసెట్ అంటే అతిశేయోక్తి కాదు. చాలా స్మూత్‌గా మ్యాచ్ డీల్ చేయగల శక్తి, సామర్థ్యాలు కలిగి ఉన్నాడు. ఈ ప్లేయర్ కూడా గాలిలోనే బంతిని ముందుకు దూకించగలడు.

జట్ల వివరాలు:
ఎఫ్‌సి గోవా: లక్ష్మీకాంత్ కట్టిమణి, సుభాషిష్ రాయ్ చౌదరి, సుఖ్‌దేవ్ పాటిల్, లుసియో, దేబబ్రత రాయ్, డెంజిల్ ఫ్రాంకో, ఫుల్గాంకో కార్డోజో, గ్రెగరీ ఆర్నోలిన్, కీనన్ అల్మైదా, లుసానియో సొబ్రోసా, రాఫెల్ దుమాస్, రాజు గైక్వాడ్, సంజయ్ బాల్ముచ్చు, జాఫ్రీ, మందార్‌రావు దేశాయ్, ప్రతీశ్ శిరోద్కర్, రిచర్ల్యెసన్, రోమియో ఫెర్నాండెజ్, సహిల్ తావోరా, త్రినాడే గోంక్లేవ్స్, జులియో సీజర్, రాఫెల్ కొయెల్హో, రైనాల్డో, రాబిన్‌సింగ్.
నార్త్ ఈస్ట్: సుబ్రతాపాల్, టిపి రెహెనేష్, విల్లింగ్టన్ గోమ్స్, సలాం రంజన్ సింగ్, నిర్మల్ ఛెత్రి, షౌవిక్ ఘోష్, రాబిన్ గురుంగ్, రీగాన్ సింగ్, మైల్సన్ అల్వెస్, గుస్టావో లాజరెట్టి, డిడియర్ జొకోరా, ఫనాయి లాల్రెంపుయా, హోలి చరణ్ నార్జారే, జెర్రీ మావ్హింగ్థానా, కస్తుమి యుసా, కోఫ్పి క్రిస్టియన్ ఎన్'డ్రీ, లాల్లియాంజులా ఛాంగ్టే, రౌల్లిన్ బోర్గెస్, సైత్యసేన్ సింగ్, విల్లింగ్టన్ ప్రిరోయి, రోమరిక్, ఎమిలియానో అల్ఫారో, నికోలస్ వెలెజ్, సాషా అనీఫ్, రాబర్ట్ కుల్లెన్, సుమీత్ పస్సీ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications