సెమీస్: చోటు కోసం కోల్‌కతా, టాప్ ప్లేస్ కోసం నార్త్ఈస్ట్
కోల్‌కతా: బలహీనంగా ఉన్న నార్త్ ఈస్ట్ యునైటెడ్ జట్టుకు అట్లెటికో డీ కోల్‌కతా గురువారం కోల్ కతా ఆతిథ్యమిస్తోంది. రెండుసార్లు మ్యాచ్‌లో లీడ్ సాధించినా.. 10 మంది ప్లేయర్లతో కూడిన ఢిల్లీ డైనమోస్ జట్టు చేతిలో త్రుటిలో తప్పిపోయింది. సెమీ ఫైనల్స్‌లో బెర్త్ కోసం జరిగే ఈ మ్యాచ్‌లో విజయంపై అట్లెటికో డీ కోల్‌కతా కన్నేసింది.
ఇక తొలి దశలో శుభారంభాన్ని అందుకుని తర్వాతర్వాత విజయాలకు దూరమై క్రమంగా పాయింట్ల పట్టికలో దిగువకు పడిపోయింది జాన్ అబ్రహం సేన. గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌లలో ఓటమితో పూర్తిగా ఆత్మరక్షణలో పడింది. ఇంతకుముందు పది మంది ప్లేయర్లతో బరిలోకి దిగిన ఎఫ్ సి గోవా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చివరి క్షణంలో 2-1 స్కోర్ తేడాతో ఓటమి పాలైంది.
ఈ సీజన్ లో అత్యధిక గోల్స్ సాధించిన ఎమిలియానో అల్ఫారోపై ఎల్లోకార్డు నిషేధంతో ఒక మ్యాచ్ పూర్తయిపోవడంతో గురువారం రంగ ప్రవేశం చేయడంతో నార్త్ఈస్ట్ జట్టులో ఆత్మవిశ్వాసం ఇనుమడించింది. ప్రస్తుత సీజన్‌లో రెండు జట్ల మధ్య జరుగుతున్న రెండో మ్యాచ్. అదేవిధంగా ఇరు జట్లు విజయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
తొలి ఏడాది జరిగిన రెండు మ్యాచ్ లలోనూ నార్త్ఈస్ట్ జట్టుపై కోల్‌కతా విజయం సాధిస్తే.. గత ఏడాది కోల్‌కతాలోనూ విజయం సాధించింది. ఈ ఏడాది ఇంతకుముందు గౌహతిలో జరిగిన మ్యాచ్‌లో అట్లెటికో డీ కోల్ కతా 2 - 1 స్కోర్ తేడాతో విజయం సాధించింది.

అటాకింగ్‌లో బెస్ట్ ఇయాన్ హుమ్
కోల్‌కతా టీంలో అటాకింగ్‌కు మారుపేరుగా నిలిచిన ఇయాన్ హుమ్ జట్టుకు కేంద్ర పాయింట్‌గా నిలిచింది. అట్లెటికో డీ కోల్ కతా జట్టులో కెనడియన్ ఫార్వర్డ్ ప్లేయర్ హుమ్ తన డైనమిజంతో జట్టును మూడో స్థానంలో నిలిపాడు. ఇంతకుముందు ఢిల్లీ డైనమోస్ తో జరిగిన మ్యాచ్ లో నాలుగుసార్లు బంతిని గోల్ పోస్ట్ కు మళ్లించి 2 - 2 స్కోర్ తేడాతో డ్రాగా ముగించడంలో కీలక పాత్ర పోషించాడు. గురువారం నార్త్ఈస్ట్ జట్టుతో జరిగే మ్యాచ్‌లోనూ గోల్స్ సాధించడంలో, సహచర ప్లేయర్లకు అసిస్టెన్స్‌లోనూ కీలక పాత్ర పోషించాడు.

అనుభవంతోనే గేమ్‌లో విజయం
డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్ ప్లేయర్ మెయిల్సన్ అల్వెస్ ప్రస్తుతం నార్త్ఈస్ట్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇయాన్ హుమ్ వంటి అటాకింగ్ ప్లేయర్లను దీటుగా ఎదుర్కోగల సామర్థ్యం మెయిల్సన్ అల్వెస్ వంటి ఆటగాళ్లకే సాధ్యం. అంతేకాదు అట్లెటికో డీ కోల్‌కతా జట్టును హడలెత్తించడంలో కీలక పాత్ర పోషించగలడని అంతా భావిస్తున్నారు. ఈ బ్రెజిలియన్ ప్లేయర్ టన్నుల కొద్దీ అనుభవంతో గేమ్‌లో విజయం సాధించగల సామర్థ్యం కలిగి ఉన్నాడు. డిఫెన్సివ్ ప్లేలో వాస్తవిక ద్రుక్పథం కలిగి ఉన్న మాల్వెస్ వంటి ఆటగాళ్లు నార్త్ఈస్ట్‌కు కలిసొచ్చే అంశం. ఇయాన్ హుమ్‌తోపాటు హెల్డర్ పొస్టిగ, జావీ లారా వంటి ప్రత్యర్థి జట్టును ఎదుర్కోగల సామర్థ్యం మాల్వెస్ సొంతం.

మిడ్‌ఫీల్డ్‌లో లారా, డిడియర్ కీలకమే
అట్లెటికో డీ కోల్‌కతాలో మిడ్ ఫీల్డర్ గా భారీస్థాయిలో ప్రభావితం చేయగల సామర్థ్యం ఉన్న ప్లేయర్ జావీ లారా. ఆయన కేవలం గోల్స్ మాత్రమే చేయగల సామర్థ్యం మాత్రమే కాదు. కీలక సమయాల్లో పాస్, విజయావకాశాలు సెట్ చేసే సామర్థ్యం కలిగి ఉన్నాడు. ఈ ఏడాది ఔట్ బాక్స్‌కు సుదూరం నుంచి మూడు గోల్స్ సాధించి జట్టును పై మెట్టులో నిలబెట్టడంలో కీలకపాత్ర పోషించాడు. పిచ్‌పై ప్రమాదకర పరిస్థితుల్లోనూ ఫ్రీ కిక్ ద్వారా పాయింట్లు సాధించగల నేర్పరి.
ఇక ఐవోరీ కోస్ట్ ప్లేయర్, నార్త్ఈస్ట్ సారధి డిడియర్ జొకోరా పలుసార్లు రికార్డు సాధించి తన దేశ ప్రతిష్టలు నిలపడంలో ముందు ఉన్నాడు. డిఫెన్సివ్ మిడ్ ప్లేయర్‌గా ప్రత్యర్థి జట్టు ముందుకు వెళ్లకుండా, ఫార్వర్డ్ అటాకింగ్‌తో నిలువరించగల సత్తా కలిగి ఉన్నాడు. నార్త్ఈస్ట్ జట్టు మిడ్ ఫీల్డ్ లో కీలక పాత్ర పోషించనున్నాడు. జావీ లారా మాదిరిగానే జట్టుకు కీలకంగా మారనున్నాడు.

డిఫెన్స్ లో మొండాల్, అల్ఫారో బెస్ట్
అట్లెటికో డీ కోల్‌కతా జట్టు డిఫెన్సివ్ ప్లేయర్లలో అర్నాబ్ మొండాల్ ఒకరు. ఐఎస్ఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఎరియల్ స్ట్రయిక్స్‌తో జట్టుకు అండగా నిలిచిన ఆటగాడు. కీలక సమయాల్లో వ్యూహ రచనలోనూ స్మార్ట్‌గా జోక్యం చేసుకోవడంలోనూ ముందుంటాడు. ప్రత్యర్థి జట్టులోని అల్ఫారో వంటి వారిని నిరంతరం గమనిస్తూ ఎదుటి జట్టు వ్యూహాలను తిప్పికొట్టగల సామర్థ్యం మొండాల్ సొంతం.
నార్త్ ఈస్ట్ జట్టులో స్టార్ ప్లేయర్ ఎమిలియానో అల్ఫారో. డిఫెన్సివ్ ఆటలో అల్ఫారోకు సాటి వచ్చే వారు లేరంటే అతిశేయోక్తి కాదు. త్వరితగతిన స్పందిస్తూ డార్టింగ్ రన్‌తో అసంఖ్యాక అవకాశాలు కల్పించడంలోనూ ముందు వరుసలో నిలుస్తాడు. ఐదు గోల్స్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన అల్ఫారో పుష్కల అవకాశాలు కల్పించడంలో ముందుంటాడు. ఆయన తన వద్ద గల శక్తి సామర్థ్యాలతో నార్త్ఈస్ట్ జట్టను తిరిగి పైపైకి తీసుకెళ్లడానికి తన వంతు పాత్ర పోషించగలడనటంలో సందేహం లేదు.

జట్ల వివరాలు:
అట్లెటికో డీ కోల్ కతా: దేబ్జిత్ మజుందార్, డాని మల్లో, షిల్టోన్ పాల్, అర్నాబ్ మొండాల్, హెన్రిక్యూ ఫొనెస్కా సెరెనో, జోస్ ఆర్రోయో, కీగాన్ పెరీరా, కింగ్ షుఖ్ దేవ్ నాథ్, ప్రబీర్ దాస్, ప్రీతం పటేల్, రాబర్ట్ లాల్తామౌనా, అభినాష్ రుయిడాస్, బైద్యనాథ్ సింగ్, బికాశ్ జైరు, బ్రికంజిత్ సింగ్, బోర్జా ఫెర్నాండెజ్, జావీలారా, జువెల్ రాజా, లాల్రిందికా రాల్టే, ఒఫెంస్టీ నాటో, సమీగ్ దౌటీ, స్టీఫెన్ పియర్సన్, హెల్డర్ పొస్టిగ, ఇయాన్ హుం, జువాన్ బెలసెంకోసో.
నార్త్ ఈస్ట్ యునైటెడ్ జట్టు: టిపి రెహెనేశ్, సుబ్రతాపాల్, విల్లింగ్టన్ గోమ్స్, గుస్తావో లాజారెట్టి, మైల్సన్ అల్వేస్, నిర్మల్ ఛెత్రి, రీగాన్ సింగ్, రాబిన్ గురుంగ్, సలాం రంజన్ సింగ్, షౌవిక్ ఘోష్, డిడియర్ జొకొరా, ఫనాయి లాల్రేంపుయా, హోలీచరణ్ నార్జారే, జెర్రీ మావింహ్మింగ్థానా, కస్తుమి యుసా, కోఫి క్రిస్టియాన్ నోర్డీ, లాలియాంజౌలా ఛాంగ్టే, రౌవ్లిన్ బొర్గెస్, సైత్యాసేన్ సింగ్, విల్లింగ్టన్ ప్రియరీ, ఎమిలియానో అల్ఫారో, నికో వెలెజ్, రాబర్ట్ కుల్లెన్, సాషా అనీఫ్, సుమీత్ పస్సీ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications