అబుజా (నైజీరియా): నైజీరియా జట్టు రెండేళ్ల పాటు అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనకుండా జట్టును ఆ దేశాధ్యక్షుడు గుడ్‌లక్ జొనాథన్ నిషేధించారు. 'జట్టు ఓ దారికి వచ్చేదాకా రెండేళ్ల పాటు ఎలాంటి టోర్నీల్లో పాల్గొనకుండా అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నారు' అని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఇమా నిబోరో తెలిపారు.
గ్రూప్ బిలో ఉన్న నైజీరియా మూడు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క పాయింట్‌తో అట్టడుగున నిలిచింది. అర్జెంటీనా, గ్రీస్‌లతో ఓడి దక్షిణ కొరియాతో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఈ నిర్ణయంపై త్వరలోనే ఫిఫా గవర్నింగ్ బాడీకి వివరించనున్నట్టు ప్రపంచ కప్‌లో జట్టు వ్యవహారాలు చూసిన రోటిమి అమేచి తెలిపారు. అలాగే జట్టు కోసం విడుదల చేసిన నిధుల తీరుపై కూడా అధ్యక్షుడు విచారణకు ఆదేశించారు.