న్యూఢిల్లీ: భారత ఫుట్‌బాల్‌ను 2022 నాటికి వరల్డ్ కప్‌లో ఆడేందుకు అర్హత సాధించడమే తమ లక్ష్యమని అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ అన్నారు. స్టీఫెన్ కంస్టాటైన్ శిక్షణలో అంతర్జాతీయంగా ప్రస్తుతం భారతీయ జట్టు 137వ స్థానంలో నిలిచింది.
2022 సాకర్ కప్‌కు తప్పనిసరిగా భారత జట్టు అర్హత సాధించాలన్నది ఎఐఎఫ్ఎఫ్ లక్ష్యం. 2012లో ఎఐఎఫ్ఎఫ్ మాజీ సాంకేతిక డైరెక్ట్ రాబర్డ్ బాన్ ఆవిష్కరించిన మాస్టర్ ప్లాన్ లక్ష్య 2022లో ఈ సంగతిని ప్రకటించారు. 'మేము 2022 వరల్డ్ కప్ అర్హత సాధించాలని ఆకాంక్షిస్తున్నాం. మా జాతీయ జట్టుకు అందుకు అవసరమైన మద్దతును అందిస్తున్నాం. సరైన దిశలో తగు చర్యలు చేపట్టాం. మా ఆకాంక్షలు నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నాం' అని ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు.
భారత్ ఫుట్ బాల్ భవిష్యత్‌లో ప్రగతి సాధించాలని, అది నేరుగా దీర్ఘకాలిక లక్ష్యంగా మారాలన్నాడు. ఖతార్ పుట్ బాల్ నుంచి 2022 సాకర్ కప్ కు ఆతిథ్యమిచ్చే స్థాయికి చేరుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది మార్చిలో 2019 ఆసియా కప్ క్వాలిఫయర్స్ పోటీలకు సిద్ధం కావడమే భారత్ తక్షణ లక్ష్యమని తెలిపాడు.

రామోస్, బెంజెమాకు రియల్ మాడ్రిడ్ పిలుపు
స్పానిష్ ఫుట్ బాల్ లీగ్ 'లా లీగ' జెయింట్స్ క్లబ్ రియల్ మాడ్రిడ్ జట్టు గాయాల భారీన పడింది. చాంపియన్స్ లీగ్‌లో కీలక ఆటగాళ్లు అందుబాటులో లేక సతమతమవుతున్నది. అందులో భాంగా రియల్ మాడ్రిడ్ జట్టు యాజమాన్యం నుంచి కీలక ప్లేయర్లు సెర్గియో రామోస్, కరీం బెంజెమాలకు పిలుపొచ్చింది.
యుఇఎఫ్ఎ చాంపియన్స్ లీగ్ లో మంగళవారం స్పోర్టింగ్ లిస్బన్ పై జరిగే మ్యాచ్ కు కూడా అట్లెటికో మాడ్రిడ్ జట్టునే రంగంలోకి దించాలని రియల్ మాడ్రిడ్ హెడ్ కోచ్ జినెడిన్ జిడానే నిర్ణయించాడు. దీంతో ఆ మ్యాచ్ లో పాల్గొన్న సెర్గియో రామోస్, కరీం బెంజెమాలను అందుబాటులోకి రావాల్సిందిగా జిడానే ఆహ్వానించాడు. గాయాల భారీ నుంచి కోలుకున్న రామోస్, బెంజెమా తిరిగి మ్యాచ్ లో పాల్గొనేందుకు సిద్ధమని తెలిపారు.
దీంతో చాంపియన్స్ లీగ్ ఐదో రౌండ్ లో స్పోర్టింగ్ లిస్బన్ తో తలపడేందుకు వారు రియల్ మాడ్రిడ్ కు అందుబాటులో ఉంటారు. పెప్, కాసిమిరో తదితర రియల్ మాడ్రిడ్ ప్లేయర్లు ఇంకా గాయాల నుంచి కోలుకోలేదు. టూనీ క్రూస్ కూడా 2017 ఏడాదిలోగా కోలుకునే అవకాశాలు కనిపించడం లేదు. మొరాటా వచ్చేనెల మధ్యలో ఫిపా క్లబ్ వరల్డ్ కప్ నుంచి తిరిగి జట్టులోకి వస్తాడు.