Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐఎస్ఎల్: నిర్లక్ష్యం తగదని పొస్టిగ హెచ్చరిక

కోల్‌కతా: రెండోదఫా ఐఎస్ఎల్ టైటిల్ పోరుకు మరో అడుగు దూరంలో ఉన్న అట్లెటికో డీ కోల్‌కతా సారధి హెల్డర్ పొస్టిగ నిర్లక్ష్యం తగదని జట్లు ప్లేయర్లను హెచ్చరిస్తున్నాడు. మంగళవారం ముంబైతో జరిగే మ్యాచ్ కోసం అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నాడు. మంగళవారం జరిగే మ్యాచ్ కూడా కీలకమేనన్న సంగతి గుర్తుంచుకోవాలని పేర్కొన్నాడు.

'మనం కోలుకోవడానికి ఇంకా రెండు రోజుల సమయం మిగిలి ఉంది. మన ముందు మరొక మ్యాచ్, మరొక రోజు ఉన్నదని గుర్తుంచుకోవాలి. ఇప్పటివరకు సాధించిన ఫలితాలను మర్చిపోవాలి. కష్టపడి ప్రాక్టీస్ చేయడంపైనే ద్రుష్టి సారించాలి. సంతోషాన్ని నియంత్రించుకోవాలి' అని హితోక్తులు చెప్పాడు.

ముంబై సిటీతో జరిగిన తొలి సెమీస్‌లో కోల్ కోతా విజయం

ముంబై సిటీతో జరిగిన తొలి సెమీస్‌లో కోల్ కోతా విజయం

శనివారం ముంబై సిటీతో జరిగిన తొలి సెమీ ఫైనల్స్‌ మ్యాచ్‌లో 3-2 స్కోర్ తేడాతో విజయం తర్వాత మరో మ్యాచ్ లోనూ గెలుపొందితే అట్లెటికో డీ కోల్‌కతా ఫైనల్స్‌లో అడుగుపెడుతుంది. ముంబై సిటీతో జరిగిన తొలి సెమీస్ లో మిజోరం కుర్రాడు లాల్రిండిక్డా రాల్టే మూడో నిమిషంలో గోల్ చేసి శుభారంభాన్ని అందించాడు. కానీ ముంబై సిటీ వెంటవెంటనే రెండు గోల్స్‌తో లీడ్ సాధించిన సంతోషం కొద్దిసేపు మాత్రమే మిగిలింది. ఎటికె అటాకర్ ఇయాన్ హుమ్ చెలరేగి ఆడడంతోపాటు రెండు గోల్స్ సాధించడంతో మాజీ చాంపియన్లు లీడ్ లోకి వచ్చారు. తర్వాత ఆధిక్యం సాధించేందుకు ముంబై చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.

ఇయాన్ హుమ్‌పై పొస్టిగ ప్రశంసల వర్షం

ఇయాన్ హుమ్‌పై పొస్టిగ ప్రశంసల వర్షం

‘శనివారం మ్యాచ్‌లో మేం చాలా అద్భుతంగా ఆడాం. ప్రస్తుతం మన పని రెండో సెమీ ఫైనల్స్ పైనే ఫోకస్ పెట్టడం' అని ఈ నెల 13న జరుగనున్నమ్యాచ్ నుద్దేశించి అన్నాడు. సగటు గోల్స్ మాత్రమే ఫైనల్స్‌లో అడుగు పెట్టేందుకు కీలకమవుతాయన్న సంగతి గుర్తుచేశాడు. ఇయాన్ హుమ్‌పై పొస్టిగ ప్రశంసల వర్షం కురిపించాడు. ‘ ఆయన ప్రతిభావంతుడైన ప్లేయర్ అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన శనివారం మ్యాచ్ లో మరోసారి తాను విభిన్నం అని మరోసారి రుజువు చేసుకున్నాడు. ఆయన ఆటతీరుతో నేను సంతోషంగా ఉన్నా' అని అన్నాడు.

రిటైర్మెంట్‌పై ఐఎస్ఎల్ టోర్నీ టైటిల్ తర్వాత

రిటైర్మెంట్‌పై ఐఎస్ఎల్ టోర్నీ టైటిల్ తర్వాత

తన రిటైర్మెంట్‌పై ఐఎస్ఎల్ టోర్నీ టైటిల్ గెలుచుకున్న తర్వాత స్పందిస్తానని చెప్పాడు. తాను తన కుటుంబ సభ్యులతో సమావేశమై చర్చించుకున్న తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేనన్నాడు. ప్రస్తుతం తన కెరీర్ పట్ల ఆనందంగా ఉన్నానన్నాడు. 15 ఏళ్లకు పైగా టాప్ యూరోపియన్ క్లబ్‌ల్లో ప్రొఫెషనల్ ఫుట్ బాల్ ఆడానన్నాడు.

ఐ-లీగ్: చెన్నై సిటీ, మినర్వా పంజాబ్ జట్లకు ఎఐఎఫ్ఎఫ్ గ్రీన్ సిగ్నల్

ఐ-లీగ్: చెన్నై సిటీ, మినర్వా పంజాబ్ జట్లకు ఎఐఎఫ్ఎఫ్ గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే ఐ - లీగ్ టోర్నీలో పాల్గొనేందుకు చెన్నై సిటీ ఎఫ్‌సి, మినర్వా పంజాబ్ ఎఫ్ సి క్లబ్ జట్లకు ఎఐఎఫ్ఎఫ్ బిడ్ ఎవాల్యూషన్ కమిటీ అనుమతినిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఐ - లీగ్‌లో పాల్గొనేందుకు ఐదు జట్లు దాఖలుచేసిన బిడ్లను ఆమోదించింది. గత నెల 25న ఐ - లీగ్ లో ప్రవేశానికి రీ టెండర్ల విధానాన్ని ఎఐఎఫ్ఎఫ్ పున:ప్రారంభించింది. నెరోకా ఎఫ్‌సి, మినర్వా పంజాబ్ ఎఫ్‌సి, సుదేవా ఎఫ్‌సి, ఎఫ్‌సి బార్డెజ్ గోవా, చెన్నై సిటీ ఎఫ్‌సి జట్లు బిడ్లు దాఖలచేశాయి. జనవరి ఏడో తేదీ నుంచి ఐ - లీగ్ ప్రారంభమవుతుంది.

చెన్నై సిటీ ఎఫ్‌సి, మినర్వా పంజాబ్ ఎఫ్‌సి జట్లను ఆహ్వానిస్తున్నా

చెన్నై సిటీ ఎఫ్‌సి, మినర్వా పంజాబ్ ఎఫ్‌సి జట్లను ఆహ్వానిస్తున్నా

‘ఐ-లీగ్ టోర్నీలో భాగస్వాములు కావాల్సిందిగా ఎఐఎఫ్ఎఫ్ తరఫున చెన్నై సిటీ ఎఫ్‌సి, మినర్వా పంజాబ్ ఎఫ్‌సి జట్లను ఆహ్వానిస్తున్నా. ఐ-లీగ్ ఒక కాంపిటీటివ్ టోర్నీగా మారుతుందని ఆశాభావంతో ఉన్నాం' ఎఐఎఫ్ఎఫ్ కార్యదర్శి కుశాల్ దాస్ వ్యాఖ్యానించాడు. మినర్వా పంజాబ్ ఎఫ్‌సి జట్టు 2015 - 16లో సెకండ్ డివిజన్ లీగ్‌లో భాగస్వామిగా రెండో స్థానంలో నిలిచింది. ‘చెన్నై సిటీ ఎఫ్‌సి, మినర్వా పంజాబ్ ఎఫ్‌సి ప్రస్తుతం టోర్నీలో చేరుతున్నాయి. వచ్చే ఏడాది జరిగే ఐ - లీగ్ టోర్నీలో 10 జట్లు పాల్గొంటాయి. ఇప్పుడు చెన్నై, పంజాబ్ క్లబ్ జట్ల ప్రతినిధులు మాతో కలిశారు. మేం మరికొందరు మద్దతుదారులను చేరుకుని నూతన మార్కెట్ దిశగా ముందుకు వెళ్లగలం' కుశాల్ దాస్ తెలిపాడు.

సంతోషం ఉంది: సునందో ధార్

సంతోషం ఉంది: సునందో ధార్

ఐ-లీగ్ సిఇఓ సునందో ధార్ కూడా రెండు క్లబ్ల చేరిక పట్ల సంతోషంగా ఉన్నాడు. రెండు కొత్త వేదికల నుంచి కొత్త జట్ల చేరికతో ఐ - లీగ్ టోర్నీకి కొత్త పరిధి ఏర్పడుతున్నదని, తద్వారా భారత ఫుట్ బాల్ ఆటలో టాప్ క్లబ్‌లుగా రూపాంతరం చెందేందుకు వీలు చిక్కుతుందన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+