For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొస్టిగ మ్యాజిక్: విజయంతో టాప్‌లోకి కోల్‌కతా

By Nageshwara Rao

గౌహతి: సారధి హెల్డర్ పొస్టిగ స్ఫూర్తితో అట్లెటికో డీ కోల్‌కతా (ఎటికె) జట్టు శుక్రవారం గౌహతితోని ఇందిరాగాంధీ అథ్లెటిక్స్ స్టేడియంలో నార్త్ఈస్ట్ యునైటెడ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించి టాప్‌లోకి దూసుకెళ్లింది. 30 వేల మందికి పైగా అభిమానులు హాజరైన ఈ మ్యాచ్‌లో పొస్టిగ, జువాన్ బెలెంకోసో గోల్స్‌తో కోల్‌కతా విజయం సాధించింది.

తద్వారా 12 పాయింట్లతో ముంబై సిటీని దాటేసి మొదటి స్థానంలో సెటిలైంది. ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్నా నార్త్ఈస్ట్ జట్టు ప్రారంభంలో దూకుడుగానే ఆడింది. ఫస్టాఫ్‌ 39వ నిమిషంలో ఎమిలియానో అల్ఫారో చేసిన గోల్‌తో నార్త్ఈస్ట్ 1 - 0 స్కోర్ ఆధిక్యం సాధించింది.

సెకండాఫ్‌ 63వ నిమిషంలో సారధి హెల్డర్ పొస్టిగ చేసిన గోల్‌తో స్కోర్ సమం కాగా, 82వ నిమిషంలో జువాన్ బెలెంకోసో గోల్స్ చేయడంతో అనూహ్యంగా కోల్‌కతా ఆధిక్యంలోకి వచ్చేసింది. తర్వాత నార్త్ఈస్ట్ కుర్రాళ్లు స్కోర్ సమంచేసి మ్యాచ్ డ్రాగా ముగించడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.

కోల్‌కతా సారధి హెల్డర్‌పొస్టిగ రంగ ప్రవేశంతోనే మ్యాచ్ ఫలితం మారిపోయిందని నార్త్ఈస్ట్ హెడ్ కోచ్ నెలో వింగాడ వ్యాఖ్యానించడం గమనార్హం. ఒక టోర్నీలోనే తొలిసారి గోల్ చేయడంతోపాటు జట్టు విజయానికి కారణమైనందుకు కోల్ కతా సారధి పొస్టిగ ఆనంద పారవశ్యంలో మునిగిపోయాడు.

తొలుత కోల్‌కతా కుర్రాడు జావీయర్ లారా పంపిన బంతిని గోల్ కీపర్ సుబ్రతాపాల్ తేలిగ్గానే తిప్పికొట్టాడు. ఆ వెంటనే రాబర్ట్ కుల్లెన్ 14వ నిమిషంలో బంతిని దేబ్జిత్ మజుందార్ అడ్డుకున్నాడు. అదే సమయంలో అందివచ్చిన స్ట్రాంగ్ పెనాల్టీ అవకాశాన్ని కస్తుమి యుసా సద్వినియోగంచేసుకునేందుకు ప్రయత్నించినా మజుందార్ నియంత్రణ మంత్రం ముందు పనిచేయలేదు.

ఇరు జట్లు స్లిక్ పాసింగ్‌గేమ్‌కు ప్రాతినిధ్యం ఇవ్వడంతో హై టెంపో కొనసాగింది. ప్రబీర్ దాస్ దూరం నుంచి పంపిన బంతిని సుబ్రతాపాల్ సరైన సమయంలో అందుకుని వెనుకకు పంపాడు. 35వ నిమిషంలో ఎమిలియానో అల్ఫారో తెలివిగా గోల్‌పోస్ట్‌కు పంపిన బంతిని కీపర్ మజుందార్ బయటకు పంపేశాడు.

కానీ 39వ నిమిషంలో కస్తుమి యుసాకు పంపిన క్విక్ బంతి నేరుగా దూసుకెళ్లింది. యుసా నుంచి వచ్చిన బంతిని అల్ఫారో హెడ్డర్ ద్వారా గోల్ పోస్ట్ కు పంపడంతో 1 - 0 స్కోర్ తేడాతో నార్త్ఈస్ట్ లీడ్‌లోకి వచ్చేసింది. కానీ సెకండాఫ్ మాత్రం కోల్‌కతాకు పూర్తిగా అనుకూలంగా మారిపోయింది.

సారధి హెల్డర్ పొస్టిగతోపాటు రాబర్ట్ లాల్‌త్లమౌనా ముందు వరుసలో నిలిచి ప్రత్యర్థి నార్త్ఈస్ట్ జట్టుకు చుక్కలు చూపారు. నార్త్ఈస్ట్‌కు పలు అవకాశాలొచ్చినా వాటితోనే కోల్‌కతా కౌంటర్ దాడికి దిగింది. పదేపదే సారధి పొస్టిగ అవకాశాల కోసం ప్రయత్నించినా 63వ నిమిషంలో పరిస్థితి డివిడెండ్ రూపంలో కలిసి వచ్చింది.

లాల్రిందికా రాల్టే క్రాస్ ద్వారా పంపిన బంతిని సుబ్రతా పాల్ హెడ్డర్ ద్వారా తిప్పికొట్టినా.. అది నేరుగా పొస్టిగ వద్దకు చేరింది. ఈ అవకాశాన్ని ఆయన వదులుకోలేదు. నేరుగా కిక్ కొట్టడంతో బంతి గోల్ పోస్ట్ లో చేరిపోయింది. రెండు జట్ల స్కోర్ సమమైంది.

Postiga scores as ATK rally to beat NE United and go top of ISL table

హెన్రింక్యూ సెరెనో అద్భుతమైన అవకాశం కల్పించినా గోల్ కీపర్ సుబ్రతాపాల్ దాన్ని సేవ్ చేశాడు. కానీ ఈ పరిణామంతో ఎప్పుడు అవకాశం చిక్కుతుందా? అన్న ధోరణితోనే అట్లెటికో డీ కోల్ కతా కుర్రాళ్లు ప్రతి క్షణం డిఫెన్సివ్‌గా ఆడుతూనే చాన్స్ కోసం వేచి చూశారు.

ఈ దశలో నార్త్ఈస్ట్ గోల్ కీపర్ సుబ్రతాపాల్ గాయంతో వైదొలిగాడు. ఆయన స్థానంలో కీపర్ గా వచ్చిన విల్లింగ్టన్ గోమ్ కు 82వ నిమిషంలో కోల్‌కతా ప్లేయర్ జువాన్ ఖాళీగా ఉన్న గోల్ పోస్ట్ కు బంతిని పంపి గోల్ తో స్వాగతం పలుకడం సర్వ సాధారణ పరిణామంగా మారింది.

అప్పటికి స్కోర్ 2 - 1 తేడాతో కోల్ కతా జట్టు ఆధిక్యంలోకి వచ్చింది. అప్పటి నుంచి మ్యాచ్ ముగిసే వరకు అదే పనిగా గోల్ తో మ్యాచ్ ను డ్రా చేసేందుకు నార్త్ ఈస్ట్ చేసిన ప్రయత్నాలన్నీ కీపర్ మజుందార్ తిప్పికొట్టాడు. కోల్ కతా డిఫెండర్ రీగన్ సింగ్ సైతం నార్త్ఈస్ట్ పంపిన బంతులను అడ్డుకుని.. జట్టు లీడ్ ను అదే స్థాయిలో కాపాడుకున్నాడు.

నాలుగు మ్యాచ్‌ల తర్వాత బరిలోకి దిగిన సారధి పొస్టిగ గోల్ చేసినందుకు పూర్తిగా సంతోషిస్తున్నాడు. ఇక ఒక మ్యాచ్ సస్పెన్షన్ కారణంగా కోల్ కతా కోచ్ జోస్ మొలినా స్టాండ్స్ కు పరిమితమై జట్టు ఆటతీరును గమనించాడు. 82వ స్థానంలో జువాన్ చేసిన గోల్ తో జట్టు 2 - 1 స్కోర్ తేడాతో ఆధిక్యం సాధించి పాయింట్ల పట్టికలో 7 గేమ్స్ లో 12 పాయింట్లతో టాప్‌లో నిలిచింది.

పది పాయింట్లతో నార్త్ఈస్ట్ మూడో స్థానానికి పరిమితమైంది. నార్త్ఈస్ట్ కుర్రాళ్లు తమకు అంది వచ్చిన అవకాశాలు అనవసరంగా మిస్ చేసుకున్నారు. తాను సొంతంగా గోల్ చేయడంతోపాటు జట్టు విజయం సాధించి మూడు పాయింట్లు పొందినందుకు పూర్తిగా సంతోష సాగరంలో మునిగిపోయాడు.

రెండు వారాలుగా గాయంతో బాధపడుతున్న తాను మ్యాచ్ లో పాల్గొనలేకపోయానని, తాను ఆడటం వల్లే జట్టు టాప్ స్థానానికి చేరుకోవడం సంతోషకరమన్నాడు. తాము చాలా పటిష్ఠమైన టీంతో ఆడామని, తొలి హాఫ్ లో తమ ప్రత్యర్థి జట్టును ఎదుర్కోలేకపోయామని అంగీకరించాడు.

దీనిపై సెకండాఫ్ కు ముందు కోచ్ ఇచ్చిన సూచనలను పాటించడంతో ఆటతీరులో మార్పు తెచ్చుకోవడంతో రెండు గోల్స్ చేశామన్నాడు. మ్యాచ్ లో బెలెంసోకో వంటి ఫార్వర్డ్ ప్లేయర్లు గోల్ చేసేందుకు ముందుకు రావడం శుభ పరిణామం అని చెప్పాడు.

కోల్ కతా విజయం సాధించడంతో రాబర్ట్ లాల్ త్లామౌనా ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. సెకండాఫ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన రాబర్ట్.. రెండు ఫుల్‌బ్యాక్ స్ట్రోక్‌లు, నాలుగు క్రాస్‌లతో తన వంతుగా జట్టు విజయానికి క్రుషిచేశాడు. ఐఎస్ఎల్ లీగ్ టోర్నీ గడువు కొద్దిగా ఉండటం వల్ల తాము దూసుకెళ్లలేకపోతున్నట్లు తెలిపాడు.

కాగా కోల్ కతా జట్టు చాలా మంచి జట్టని నార్త్ఈస్ట్ హెడ్ కోచ్ నెలో వింగాడ చెప్పాడు. తదుపరి మ్యాచ్‌లో తిరిగి పుంజుకుంటామని ఆశాభావం వ్యక్తంచేశాడు. మ్యాచ్ ఓటమికి కారణాలను విశ్లేషించుకుని తదుపరి మ్యాచ్ లోనైనా అలా జరుగకుండా చూడాలని నార్త్ఈస్ట్ ప్లేయర్ ఎమిలియానో అల్ఫారో వ్యాఖ్యానించడం కొసమెరుపు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+