Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సాకర్ అంటే రష్యన్లకు అమితమైన ప్రేమ: పోర్చుగల్ లెజెండ్

Portugal’s Luis Figo: Russians passionate about football, FIFA World Cup to be success

లియాన్: ఫుట్‌బాల్ అంటే రష్యన్లు ఎంతగానో ప్రేమిస్తారని పోర్చుగల్ మాజీ ఫుట్ బాల్ ప్లేయర్ లూయిస్ ఫిగో తెలిపారు. జూన్ నెల నుంచి సుమారు 30 రోజుల పాటు సాకర్ సంరంభం వేడుకగా నిర్వహించేందుకు రష్యన్లు సర్వం సన్నద్ధం అవుతున్నారు.

'మనముందు ఒక అందమైన, అద్భుతమైన టోర్నమెంట్ మనకోసం ఎదురవుతున్నది' అని ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లూయిస్ ఫిగో తెలిపారు. ఫుట్‌బాల్ ఆటను రష్యన్లు ఎంతగా ప్రేమిస్తారో నేను చూశాను. ఇప్పటివరకు జరిగిన టోర్నమెంట్లలో అత్యుత్తమైందిగా ఉంటుందని నేను విశ్వసిస్తున్నా' అని చెప్పారు.

ఫుట్‌బాల్‌లో అన్ని అంశాలను ఎంజాయ్ చేయాలి

ఫుట్‌బాల్‌లో అన్ని అంశాలను ఎంజాయ్ చేయాలి

'ఒక ఫుట్‌బాల్ టోర్నీలో ఎదురయ్యే అన్ని అంశాలను తప్పక ఎంజాయ్ చేయాలన్నారు. నిజమైన మానవత్వం, అథ్లెటిక్ విలువలను సమానంగా గౌరవించాల్సి ఉంది' అని లూయిస్ ఫిగో తెలిపాడు. యూరోపియన్ ఫుట్‌బాల్ చాంపియన్స్ షిప్స్ టోర్నమెంట్లలో పోర్చుగల్ జట్టు తరఫున ఆడి రజత, కాంస్య పతకాలను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.

2000లో బెస్ట్ ఫుట్ బాలర్ అవార్డు అందుకున్న లూయిస్ ఫిగో

2000లో బెస్ట్ ఫుట్ బాలర్ అవార్డు అందుకున్న లూయిస్ ఫిగో

నాలుగుసార్లు స్పానిష్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్, పోర్చుగీస్ చాంపియన్ షిప్ ఆరుసార్లు, ఇటలీ టోర్నమెంట్ టైటిల్ నాలుగుసార్లు గెలుచుకున్నాడు లూయిస్ ఫిగో. 2002లో రియల్ మాడ్రిడ్ జట్టు తరఫున మిడ్ ఫీల్డర్‌గా ఆడి యుఇఎఫ్ఎ చాంపియన్స్ లీగ్ ట్రోఫీని గెలుచుకున్నాడు. అంతకుముందు 2000లో బెస్ట్ ఫుట్ బాలర్ అవార్డు అందుకున్నాడు. అంతే కాదు బాలోన్ డీ ఓర్ ట్రోపీ గెలుచుకున్నాడు.

రష్యాకు 40 వేల మంది మెక్సికన్లు

రష్యాకు 40 వేల మంది మెక్సికన్లు

సాకర్ కప్ సంరంభాన్ని వీక్షించే తమ ప్లేయర్లను ప్రోత్సహించేందుకు రష్యాకు మెక్సికో నుంచి 40 వేల మంది అభిమానులు రానున్నారు. ఈ విషయాన్ని మెక్సికో సెనెట్ అధ్యక్షుడు ఎర్నెస్టో జావియర్ కార్డెరో ఆరోరో గురువారం రష్యా దిగువ సభ స్పీకర్ వ్యాచెస్లావ్ వోలోడిన్‌తో చెప్పారు. వారంతా ఎంతో ఆసక్తిగా ఉన్నారని, స్నేహానికి మారు పేరన్నారు. దీనిపై వ్యాచెస్లావ్ వోలోడిన్ స్పందిస్తూ మెక్సికో టీం, అభిమానుల రాక పట్ల ఆనందంగా ఉన్నామని తెలిపారు.

రిటైర్మెంట్ ప్రకటించిన సాండ్రో వాగ్నర్

రిటైర్మెంట్ ప్రకటించిన సాండ్రో వాగ్నర్

జర్మనీ స్ట్రైకర్ సాండ్రో వాగ్నర్ అంతర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. వచ్చేనెలలో రష్యాలో మొదలయ్యే సాకర్ కప్ సంరంభం కోసం జర్మనీ ఎంపిక చేసిన ప్రిలిమినరీ వరల్డ్ కప్ స్క్వాడ్‌లో ఆయన పేరు చోటు చేసుకోలేదు. తాను కోచింగ్ ఇవ్వడానికి ఫిట్‌గా లేనని అర్థమైందని బిల్డ్ డైలీకి చెప్పారు. ఈ విషయం బహిరంగంగా, నిజాయితీగా చెబుతున్నానని తెలిపారు. లైప్జింగ్‌కు చెందిన టిమో వెర్నర్, స్టుట్టగార్ట్‌కు చెందిన మారియో గోమెజ్, ఫ్రై బర్గ్‌కు చెందిన నిల్స్ పీటర్సన్ పట్ల జర్మనీ కోచ్ జోయాచిమ్ ల్యూ ఆసక్తిగా ఉన్నారు. జొయాచిం ల్యూ స్పందిస్తూ గోమెజ్, పీటర్సన్ కోసం నిర్ణయం తీసుకున్నామని, సాండ్రో వాగ్నర్‌కు వ్యతిరేకం కాదన్నాడు. 29వ ఏట అడుగు పెట్టిన సాండ్రో వాగ్నర్ ఇంతకుముందు ప్రపంచ కప్ టోర్నీలో ఆడుతానని ప్రకటించాడు. కానీ తనకు అవకాశం లభించక పోవడంతో జీవితంలో ఫుట్ బాల్ కంటే ముఖ్యమైన అంశాలెన్నో ఉన్నాయని వేదాంతం చెబుతున్నాడు.

Story first published: Wednesday, May 23, 2018, 14:14 [IST]
Other articles published on May 23, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+