Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Fifa World Cup 2022: రెండు గోల్స్ చేసిన యంగ్ ప్లేయర్.. నాకౌట్స్ చేరిన రొనాల్డో టీం..

Portugal defeats Uruguay to reach Fifa World Cup 2022 knockouts

ఫిఫా వరల్డ్ కప్ 2022లో పోర్చుగల్ జట్టు నాకౌట్స్ చేరింది. తొలి మ్యాచ్‌లో ఘనాపై విజయం సాధించిన ఆ జట్టు.. రెండో మ్యాచ్‌లో ఉరుగ్వేను ఓడించింది. తద్వారా రెండు వరుస విజయాలతో నాకౌట్స్ చేరుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో పెద్దగా ఆకట్టుకోలేదు. ఒక్క గోల్ కూడా చెయ్యలేకపోయాడు. గ్రూప్ హెచ్‌ నుంచి నాకౌట్స్ చేరే మరో స్థానం కోసం ఘనా, ఉరుగ్వే పోటీ పడుతున్నాయి.

మ్యాచ్ తొలి అర్ధభాగంలో రెండు జట్లకు కూడా గోల్స్ చేసే అవకాశాలు పెద్దగా దక్కలేదు. వచ్చిన ఒకటి, రెండు ఛాన్స్‌లు ఆయా జట్లు ఉఫయోగించుకోలేకపోయాయి. అయితే రెండో అర్ధభాగం మొదలైన తొమ్మిది నిమిషాల్లోనే పరిస్థితి మారిపోయింది. పోర్చుగల్ స్టార్ బ్రూనో ఫెర్నాండెజ్.. అద్భుతమైన లాంగ్ షాట్ కొట్టాడు. అది కర్వ్ అవుతూ వెళ్లి గోల్ నెట్ చివర్లో పడింది. ఈ క్రమంలో క్రిస్టియానో రొనాల్డో తలకు బంతి తాకినట్లుగా కనిపించింది.

కానీ రిప్లేలో రొనాల్డోను బంతి తాకలేదని కనిపించింది. దీంత ఫెర్నాండెజ్ ఖాతాలో ఈ గోల్ చేరింది. దీంతో ఉలిక్కి పడిన ఉరుగ్వే జట్టు తాము కూడా గోల్ చేసి స్కోర్లు సమం చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఆ జట్టు ఎంత చేసినా గోల్ చేయలేకపోయింది. ఉరుగ్వే స్టార్ లూయిస్ సుయారెజ్ కూడా గట్టిగా కష్టపడ్డాడు. కానీ గోల్ చేసే అవకాశం మాత్రం వారికి లభించలేదు.

ఆ తర్వాత కాసేపటికే రొనాల్డోకు విశ్రాంతినిచ్చారు. ఇలాంటి సమయంలో అంపైర్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయంతో పోర్చుగల్‌కు పెనాల్టీ కిక్ లభించింది. బాక్స్ ఏరియాలో ఉరుగ్వే ప్లేయర్ గిమెనెజ్ చేతిని తాకినట్లు కనిపించింది. దీన్ని చూసిన అంపైర్.. పోర్చుగల్ జట్టుకు పెనాల్టీ ఆఫర్ చేశాడు. అప్పటికే రోనాల్డో మైదానం వీడటంతో మరోసారి ఫెర్నాండెజ్ ముందుకొచ్చాడు. పెనాల్టీ కిక్‌ను తెలివిగా క్యాష్ చేసుకున్నాడు. దీంతో పోర్చుగల్ జట్టు 2-0 తేడాతో ఉరుగ్వేను ఓడించింది.

Story first published: Tuesday, November 29, 2022, 9:39 [IST]
Other articles published on Nov 29, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+