Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Fifa World Cup 2022: లెజెండ్‌కు అదిరే ఆరంభం.. తొలి మ్యాచ్‌లో ఘనాపై రొనాల్డో టీం విక్టరీ

Portugal defeats Ghana in their first Fifa World Cup 2022 clash

తన కెరీర్‌లో చివరి వరల్డ్ కప్ ఆడుతున్న ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డోకు ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో శుభారంభం దక్కింది. ఘనాతో ఆడిన అతని పోర్చుగల్ జట్టు 3-2 తేడాతో తమ తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ రెండు జట్లు మ్యాచ్‌ను చాలా జాగ్రత్తగా ఆరంభించాయి. అయితే తొలి అర్ధభాగంలో పోర్చుగల్‌దే కొంత పైచేయిగా నిలిచింది. ఈ సమయంలో ఘనాకు బంతిని ఎక్కువగా తమ వద్ద ఉంచుకునే అవకాశం కూడా దక్కలేదు. పోర్చుగల్ ఆటగాళ్లే 70 శాతం సమయం బంతిని తమతో ఉంచుకున్నారు.

పోర్చుగల్ ఆధిపత్యం

పోర్చుగల్ ఆధిపత్యం

రొనాల్డో కెరీర్‌లో చివరి వరల్డ్ కప్ కావడంతో పోర్చుగల్ జట్టు ఎలాగైనా ఈ వరల్డ్ కప్ గెలవాలని మంచి కసితో ఆడింది. ఈ క్రమంలోనే తొలి హాఫ్‌లో ఏడుసార్లు గోల్స్ చేసేందుకు ప్రయత్నించింది. అయితే ఈ దండయాత్రను ఘనా జట్టు తట్టుకొని నిలబడింది. దీంతో తొలి అర్ధభాగాన్ని రెండు జట్లు 0-0తో ముగించాయి. అంతకుముందు కూడా మూడు మ్యాచులు కనీసం ఒక్క గోల్ కూడా లేకుండా డ్రాగా ముగియడంతో ఇది కూడా అలాగే జరుగుతుందా? అనిపించింది.

సెకండ్ హాఫ్‌లో మారిన సీన్

సెకండ్ హాఫ్‌లో మారిన సీన్

కానీ రెండో సగంలో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. రెండు జట్లు తమ ఆటతీరును మార్చుకొని ఎదురుదాడికి దిగాయి. ఈ క్రమంలోనే జట్టుకు దక్కిన పెనాల్టీని గోల్‌గా మలిచాడు రొనాల్డో. దీంతో పోర్చుగల్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వత కాసేపటికే ఘనా ప్లేయర్ ఆండ్రూ ఆయూ గోల్ చేసి స్కోర్లు సమం చేశాడు. ఇది చూసి షాకైన పోర్చుగల్ జట్టు నిమిషాల వ్యవధిలోనే మరో గోల్ చేసింది. బ్రూనో ఫెర్నాండెస్ పంపిన పాస్‌ను చక్కని షాట్‌తో గోల్‌గా మలిచాడు జావో ఫీలిక్స్.

మరో గోల్ చేసిన ఘనా..

మరో గోల్ చేసిన ఘనా..

ఇది జరిగిన రెండో నిమిషంలోనే మరోసారి ఫెర్నాండెస్ రంగంలోకి దిగాడు. ఈసారి రఫేల్ లియోకు పాస్ అందించాడు. అతను కూడా ఎలాంటి పొరపాటూ లేకుండా దాన్ని గోల్ చేశాడు. దీంతో పోర్చుగల్ జట్టు 3-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దీంతో దాదాపుగా పోర్చుగల్ విజయం ఖరారైంది. అయితే చివర్లో అంటే 89వ నిమిషంలో ఘనా ప్లేయర్ ఒస్మాన్ బుకారీ మరో గోల్ చేశాడు. ఈ గోల్‌తో స్కోర్లు 3-2కు చేరుకున్నాయి. కానీ మ్చాచ్‌లో పైచేసి సాధించే అవకాశం అప్పటికే ఘనా చెయ్యి దాటిపోయింది. చివరకు ఈ మ్యాచ్‌లో 3-2తో పోర్చుగల్ విజయం సాధించింది. రొనాల్డోకు ఈ వరల్డ్ కప్‌లో తొలి విజయం దక్కింది. ఈ మ్యాచ్‌లో చేసిన గోల్.. ప్రపంచకప్‌లలో అతనికి ఏడవది కావడం గమనార్హం.

Story first published: Friday, November 25, 2022, 8:43 [IST]
Other articles published on Nov 25, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+