Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Fifa World Cup 2022: ఒక్క గోల్ లేకుండానే ముగిసిన మెక్సికో-పోలండ్ మ్యాచ్

Poland and Mexico fail to score goals and ends the game with 0-0 draw

ఫిపా వరల్డ్ కప్‌లో భాగంగా మెక్సికో, పోలండ్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కనీసం ఒక్క గోల్ కూడా చెయ్యలేకపోయాయి. ముందుగా ఛాన్సులు క్రియేట్ చేసుకోవడంలోనే రెండు జట్లు తడబడ్డాయి. మంగళవారం జరిగిన గ్రూప్-సీ మ్యాచ్‌లో పోలండ్ స్టార్ రాబర్ట్ లెవాండోస్కిని మెక్సికో కట్టడి చేసింది. అతన్ని ఒంటరిని చేసి అతని చేతికి బంతి దొరక్కుండా అడ్డుకోగలిగింది. అయితే గెరార్డో మార్టినో సారధ్యంలోని మెక్సికో కూడా మ్యాచ్ ఆసాంతం మంచి అవకాశాలను సృష్టించుకోవడంలో విఫలమైంది. దీంతో ఈ మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది.

తొలి అర్థభాగంలో రెండు జట్లు పెద్దగా అవకాశాలను సృష్టించుకోలేకపోయాయి. ఈ మ్యాచ్‌లో చురుగ్గా కదులుతూ అందరి దృష్టినీ ఆకర్షించిన మెక్సికో స్టార్ హిర్వింగ్ లోజానో.. పోలండ్ డిఫెన్స్‌లోకి చొచ్చుకొచ్చాడు. అక్కడి నుంచి అలెక్సిస్ వేగాకు అద్భుతమైన పాస్ అందంచాడు. కానీ అలెక్సిస్ కొట్టిన షాట్.. గోల్ పోస్ట్‌ను మిస్ అవడంతో ఆ అవకాశం మిస్ అయింది.

ఆ తర్వాత సెకండ్ హఫ్‌లో మెక్సికో ప్లేయర్ హెక్టర్ మోరెనో హద్దు మీరాడు. పోలిష్ ప్లేయర్ రాబర్ట్ లెవాండోస్కీ షర్ట్ పట్టుకొని లాగేశాడు. ఇది చూసిన రిఫరీ.. 'వీడియో అసిస్టెడ్ రిఫరీ' (వీఏఆర్)ను సంప్రదించి పోలండ్‌కు పెనాల్టీ కిక్ ఇచ్చాడు. అయితే మెక్సికో గోల్ కీపర్ గులెర్మో ఒచోవా మరోసారి వరల్డ్ కప్‌లలో తను ఎంత ముఖ్యమో నిరూపిస్తూ అద్భుతమైన సేవ్ చేశాడు. దీంతో పోలండ్ జట్టు సైతం ఒక్క గోల్ కూడా చెయ్యలేకపోయింది. ఆ తర్వాత హెన్రీ మార్టిన్ కొట్టిన షాట్‌ను పోలండ్ గోల్‌కీపర్ కూడా సేవ్ చేసేశాడు. దీంతో రెండు జట్లు 0-0తో నిలిచాయి. చివర్లో పోలండ్ ప్లేయర్ గ్రెగోర్జ్ క్రిచోవియాక్ ఎలాగైనా గోల్ కొట్టాలనే కసితో చాలా దూరం నుంచి సూపర్ షాట్ కొట్టాడు. అయితే ఆ బంతి గోల్ పోస్టులోకి వెళ్లలేదు. దీంతో రెండు జట్లు ఒక్క గోల్ చేయకుండానే మ్యాచ్ డ్రాగా ముగిసింది.

Story first published: Wednesday, November 23, 2022, 9:48 [IST]
Other articles published on Nov 23, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+