ప్రత్యేక ఆకర్షణగా మోడీ: స్టాండ్లన్నీ ఖాళీ, టికెట్లు ఉచితంగా
హైదరాబాద్: భారత్ తొలిసారిగా ఆతిథ్యమిస్తోన్న ఫిఫా అండర్-17 ఫుట్‌బాల్ వరల్డ్ కప్ శుక్రవారం అట్టహాసంగా ఆరంభమైంది. ఫిఫా ఆదేశాల మేరకు ఆరంభోత్సవం లేకుండా సాదాసీదాగా ప్రారంభ వేడుకను ముగించారు. అయితే ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఆతిథ్య భారత్, అమెరికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు ప్రధాని మోడీ ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
ఘనా-కొలంబియా మధ్య ఆరంభ మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రధాని మోడీ స్టేడియానికి విచ్చేశారు. అనంతరం భారత్-అమెరికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మ్యాచ్‌కి ముందు ఇరు జట్ల సభ్యులతో కరచాలనం చేసి శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ గీతం ఆలపించినప్పుడు జట్లతో పాటు మోడీ కూడా అక్కడే నిల్చున్నారు.

ఫుట్‌బాల్ దిగ్గజాలను సన్మానించిన ప్రధాని మోడీ
అంతకముందు భారత పుట్‌బాల్‌కు విశేష సేవలందించిన ఫుట్‌బాల్ దిగ్గజాలు పీకే బెనర్జీ, నయీమూద్దీన్, విజయ్, బైచుంగ్ భుటియాలతో పాటు ప్రస్తుత భారత కెప్టెన్ సునీల్ ఛెత్రిని ప్రధాని మోడీ శాలువాతో సన్మానించారు. క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్, అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్, ఫిఫా ప్రధాన కార్యదర్శి సమౌరా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సగానికిపైగా అమ్ముడవకపోని టిక్కెట్లు
అయితే క్రికెట్‌కు అలవాటు పడిన భారత క్రీడాభిమానులు భారత్‌లో తొలిసారిగా జరుగుతున్న ఫిఫా అండర్-17 వరల్డ్ కప్‌ను పెద్దగా పట్టించుకోక పోవడం విశేషం. ఇందుకు నిదర్శనమే తొలిరోజు భారత్ మ్యాచ్‌కు సగానికిపైగా టిక్కెట్లు అమ్ముడవకపోవడం. భారత్, అమెరికా మ్యాచ్‌కు వేదికైన దేశ రాజధానిలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం సామర్థ్ధ్యం 56,000.

స్టాండ్లన్నీ ఖాళీగా కనిపించడం
ఇందులో ఏకంగా 30వేలకు పైగా టిక్కెట్లు మిగిలిపోవడం నిర్వాహకులను ఆందోళనకు గురిచేసింది. మరోవైపు ఈ మ్యాచ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథి కావడంతో స్టేడియంలోని స్టాండ్లన్నీ ఖాళీగా కనిపించడం ఇష్టంలేని నిర్వాహకులు 27వేల టిక్కెట్లను నగరంలోని పాఠశాలలకు ఉచితంగా పంపిణీ చేశారు.

గతంలో కామన్వెల్త్ గేమ్స్‌కు ఇలానే
మ్యాచ్ రాత్రి సమయం కావడంతో విద్యార్థుల సౌకర్యార్థం వాళ్లను స్టేడియానికి తీసుకురావడం, ఇంటిదగ్గర దించే బాధ్యతను కూడా నిర్వాహకులే తీసుకున్నారు. ఏడు సంవత్సరాల క్రితం ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యమిచ్చినప్పుడు కూడా ఇదే తరహా పరిస్థితి తలెత్తింది. అప్పట్లోనూ స్టేడియంలో పోటీలను చూసేందుకు ఎవరూ ఆసక్తిని కనబర్చలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications