Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రధాని మోడీకి రొనాల్డో సంతకంతో కూడిన జెర్సీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేకమైన బహుమతి అందుకున్నారు. ఫుట్ బాల్ ప్రేమికుడైన ఆయనకు పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టా ఈ బహుమతిని అందించాడు. పోర్చుగల్ నుంచి ఫుట్‌బాల్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న నంబర్ వన్ ఆటగాడు 'లా లీగ' జెయింట్స్ రియల్ మాడ్రిడ్ జట్టు సారధి క్రిస్టియానో రొనాల్డో సంతకం చేసిన జెర్సీని ప్రధాని మోదీకి పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టా అందచేశారు.

ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం భారత పర్యటనకు వచ్చిన కోస్టాకు ప్రధాని మోదీ కూడా మరో బహుమతి అందజేశారు. కోస్టా తండ్రి, ఓర్లాండో డా కోస్టా రాసిన ఇంగ్లిష్ ట్రాన్స్ లేషన్ పుస్తకం అందజేశారు. ఇద్దరు ప్రధానమంత్రులు కలిసి ఇరు దేశాల న్రుత్య రూపకాలకు చెందిన ఫామ్స్‌లో పోస్టల్ స్టాంపులను ఆవిష్కరించారు. పోర్చుగల్, భారత్ మధ్య సాంస్క్రుతిక అనుబంధం కలిగి ఉన్నదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇరు దేశాలదీ అద్భుతమైన భావమన్నారు.

Cristiano Ronaldo

గ్రనడతో మ్యాచ్‌కు తిరిగొచ్చిన రొనాల్డో

మాడ్రిడ్: స్పానిష్ ఫుట్‌బాల్ లీగ్ 'లా లీగ' జెయింట్స్ రియల్ మాడ్రిడ్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో తిరిగి జట్టులో వచ్చి చేరాడు. టోర్నీలో ఈ ఏడాది తొలిసారి గ్రనడ టీంతో జరిగే మ్యాచ్‌లో రియల్ మాడ్రిడ్ జట్టు తరఫున పాల్గొనేందుకు వచ్చాడు. సెర్జియో రామోస్, పెపె, గారెథ్ బాలె, లుకాస్ వాన్ క్వెజ్, మాటెయో కొవాసిస్ వంటి ప్లేయర్లు గాయాలతో గైర్హాజరైన నేపథ్యంలో రొనాల్డో రాక ప్రాధాన్యం సంతరించుకున్నది. కొపా డెల్ రే టోర్నీలో బుధవారం సెవిల్లా జట్టుకు వ్యతిరేకంగా జరిగిన మ్యాచ్‌లో రియల్ మాడ్రిడ్ 3 - 0 స్కోర్ తేడాతో విజయం సాధించింది.

బరాసత్‌కు మొహుల్ బగన్ మళ్లింపు

కోల్‌కతా: ఐ - లీగ్ టోర్నీ జెయింట్స్ మొహున్ బగన్ జట్టుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జిటీ) నుంచి అడ్డంకులు ఎదురయ్యాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం రవీంద్ర సారోబార్ స్టేడియంలో మొహున్ బగన్ మ్యాచ్ లు జరుగాల్సి ఉంది. కానీ ఎన్జిటీ ఆదేశాల మేరకు ఈ జట్టు వేదిక బరాసత్ స్టేడియంకు మార్చుకోవాల్సి రావడంతో మొహున్ బగన్ ఫ్రాంచైసీకి తలనొప్పిగా మారింది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో గోవాకు చెందిన చర్చిల్ బ్రదర్స్ జట్టుతో తలపడనున్నది.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+