న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

పాల్ గైరెర్రోపై నిషేధం మరో 14 నెలల పొడిగింపు

Players’ union asks FIFA to allow Peru captain Paolo Guerrero to play in the World Cup

హైదరాబాద్: తాగే 'టీ'లో కొకెయిన్ కలుపుకుని తాగినట్లు రుజువు కావడంతో పెరు ఫుట్‌బాల్ కెప్టెన్ పాలో గైర్రెరోపై ఆరు నెలల నిషేధం సోమవారంతో ముగిసింది. కానీ, దాన్ని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఎఎస్)గా భావించే వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) మరో 14 నెలలకు పొడిగించింది. ఈ విషయమై రానున్న ఫిఫా వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని నిషేదాన్ని ఉపసంహరించాలని ఫుట్‌బాల్ ప్లేయర్స్ యూనియన్ ఫిఫ్ప్రో తాజాగా ఫిఫా పాలక మండలికి, ఫిఫా చైర్మన్ జియాన్నీ ఇన్‌పాంటినోకు లేఖ రాసింది.

తద్వారా.. టీలో కొకైన్ తాగినందుకు నిషేధం విధించిన పాల్ గైర్రెరోకు వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో ఆడేందుకు అనుమతించాలని అభ్యర్థించింది.

ఫిఫా నుంచి పురోగతి ఉంటుందని ఫిఫ్ప్రో ఆశాభావం

ఫిఫా నుంచి పురోగతి ఉంటుందని ఫిఫ్ప్రో ఆశాభావం

ఫిఫా పాలక మండలి నుంచి ఈ విషయమై పురోగతి కనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ‘ఫిఫ్ప్రో' ట్వీట్ చేసింది. ‘వాడా' విధించిన నిషేధం అమలులోకి రావడంతో 36 సంవత్సరాల తర్వాత అర్హత సాధించిన ‘పెరు' తరఫున పాల్ గైర్రెరో (34) వచ్చే నెల రష్యాలో జరిగే ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్‌కు అనుమతిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తపరిచింది.

వాడా కోడ్ అమలులో అధికార దుర్వినియోగం

వాడా కోడ్ అమలులో అధికార దుర్వినియోగం

మెరుగైన ఆటతీరు ప్రదర్శించే సామర్థం గల లీడింగ్ స్కోరర్ పాల్ గైర్రెరోకు గల సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, తాను తాగిన టీలో ఏముందో తెలుసుకోకుండా ‘కాస్' నిషేధాన్ని పొడిగించడం సరి కాదని ఫిఫ్ప్రో పేర్కొన్నది. వాడా కోడ్ అమలు చేస్తున్న ఫిఫా తన అధికారాలను దుర్వినియోగం చేస్తోందని ఫిఫ్ప్రో విమర్శించింది. ఆండ్రియన్ దేశాల్లో అనారోగ్యం నుంచి బయటపడేందుకు సంప్రదాయమైన చికిత్సా విధానం కొకెయిన్ ఆకులను టీలో కలిపి తాగడం సాధారణమని ఫిఫ్ప్రో పేర్కొంది.

 పెరిగిపోవడంతో హెడ్ కోచ్ షిన్ తాయ్ యోంగ్‌కు

పెరిగిపోవడంతో హెడ్ కోచ్ షిన్ తాయ్ యోంగ్‌కు

వచ్చే నెలలో రష్యాలో మొదలు కానున్న సాకర్ సంరంభానికి దక్షిణ కొరియా ప్లేయర్ లీ కౌన్ దూరం కానున్నారు. గత వారాంతంలో కొరియా లీగ్‌లో గాంగ్వాన్ ఎఫ్ సీ క్లబ్ జట్టుపై ఆడి కుడి మోకాలికి గాయమైంది. మాజీ ఆసియాన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ లీ కౌన్.. 2012 కాంటినెంటల్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఆసియాన్ చాంపియన్స్ లీగ్ లైటిల్ పోరులో ఉల్లసాన్ హుండాయికి సాయం చేసినందుకు లీ కౌన్‌కు ఈ కాంటినెంటల్ అవార్డు అందుకున్నారు. ఇలా దక్షిణ కొరియా ప్లేయర్లలో గాయాల పాలైన ఆటగాళ్ల జాబితా చాంతాడంత పెరిగిపోవడంతో హెడ్ కోచ్ షిన్ తాయ్ యోంగ్‌కు పెద్ద తలనొప్పిగా పరిణమించింది.

సాకర్ కప్ టోర్నమెంట్‌కు దూరం కావడం ఖాయమే

సాకర్ కప్ టోర్నమెంట్‌కు దూరం కావడం ఖాయమే

లీ కౌన్ వచ్చే నెలలో జరిగే సాకర్ కప్ టోర్నమెంట్‌కు దూరం కావడం ఖాయమేనని దక్షిణ కొరియా ఫుట్ బాల్ అసోసియేషన్ ధ్రువీకరించింది. ఆయనతోపాటు గాయాలతో సెంట్రల్ డిఫెండర్ కిమ్ మిన్ జాయి, క్వోన్ చాంగ్ హూన్ కూడా టోర్నీకి దూరమే. కిమ్ కాలికే గాయంకాగా, క్వోన్ కాలి కండరాలు కదిలిపోవడంతో ఆటలో పాల్గొనలేకపోతున్నారని ఫుట్‌బాల్ అసోసియేషన్ తెలిపింది. ఇక కిమ్ జిన్ షూ కూడా మోకాలి గాయంతో టోర్నమెంటులో పాల్గొనడం అనుమానమే. వచ్చేవారం ఫ్రెండ్లీ మ్యాచ్‌ల్లో కూడా కిమ్ ఆడటమే సందేహమేనని షిన్ తెలిపారు.

Story first published: Thursday, May 24, 2018, 12:36 [IST]
Other articles published on May 24, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X