న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

మ్యాచ్ చూడాలని వచ్చారని 35 మంది మహిళలను అరెస్టు చేశారు

photos of Iranian football fans has gone viral

హైదరాబాద్: భారతదేశమంతటా క్రికెట్‌కు అమితాదరణ దొరుకుతుంది. కానీ, యావత్ ప్రపంచంలో ఫుట్‌బాల్ కి ఉన్నంత అభిమానం మరే ఆటకు ఉండదు. సాధారణంగానే పురుషులతో పాటే మహిళలకు సమానంగానే ఆసక్తులుంటాయ్. అలానే ఫుట్‌బాల్ అంటే కూడా అభిమానం ఉండటంతో మహిళలు స్టేడియంలోకి రావడానికి యత్నించారు. దీంతో వాళ్లను అరెస్టు చేశారు. ఈ ఘటన ఇరాన్ లో చోటు చేసుకుంది. ప్రత్యక్షంగా వీక్షించేందుకు వారు ఎంతకైనా తెగిస్తారనడానికి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న ఓ వీడియోను చూస్తే తెలుస్తోంది.

స్త్రీలను దేశంలో ఫుట్‌బాల్‌ క్రీడలకు నో

స్త్రీలను దేశంలో ఫుట్‌బాల్‌ క్రీడలకు నో

1979లో వచ్చిన ఇస్లామిక్‌ విప్లవం నాటి నుంచి స్త్రీలను దేశంలో ఫుట్‌బాల్‌ క్రీడలకు అనుమతించరు. ఎలాగైన ఏప్రిల్‌ 27న ముగిసిన ఛాంపియన్‌ ట్రోపీ మ్యాచ్‌ను తిలకించాలనుకున్న ఐదుగురు స్త్రీలు పురుషుల దుస్తులు ధరించి, పెట్టుడు గడ్డాలు, మీసాలు పెట్టుకొని వచ్చి పురుషులతోపాటు ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ను తిలకించారు.

 పురుషుల్లాగానే అల్లరి చేశారు

పురుషుల్లాగానే అల్లరి చేశారు

తమను ఎవరైనా గుర్తుపడతారన్న భయంతో వారేమీ మౌనంగా కూర్చొని మ్యాచ్‌ను చూడలేదు. పురుషుల్లాగానే ఎంత అల్లరి చేయాలో అంత చేశారు. మ్యాచ్‌ అనంతరం వారిని పోలీసులు అరెస్ట్‌ చేశారని తెల్సింది. ఇదే విషయమై అక్కడి పోలీస్‌ అధికారులను అడిగితే అరెస్ట్‌ చేయలేదని, అదుపులోకి తీసుకొని అనంతరం వారిని వారి ఇళ్లకు పంపించి వేశామని చెప్పారు.

35 మంది మహిళలను అరెస్ట్‌ చేశారు

35 మంది మహిళలను అరెస్ట్‌ చేశారు

వారం రోజుల క్రితమే స్టేడియంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన 35 మంది మహిళలను అరెస్ట్‌ చేశారు. ఆ నేపథ్యంలోనే ఈ సంఘటన జరగడం విశేషం. ఆడవాళ్లు మగవాళ్లలాగా దుస్తులు ధరించి ఫుట్‌బాల్‌ మ్యాచులు చూడడం ఇరాన్‌లో కొత్తేమి కాదు. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లకు మహిళలను అనుమతించాలని ఎప్పటి నుంచో ఇరాన్‌ మహిళలు డిమాండ్‌ చేస్తున్నారు. అనుమతించకపోవడం మహిళలను అవమానపర్చడమేనన్నది వారి వాదన.

మగవాళ్లతోపాటు మహిళలను సమానంగా

అయితే తాము మహిళలను అధికంగా గౌరవమిస్తామని, వారి మీదున్న గౌరవంతోనే కేకలు, అరుపులతో అల్లరిచిల్లరగా ఉండే స్టేడియంలోకి అనుమతించడం లేదని పాలకులు చెబుతుంటారు. గౌరవం సంగతి పక్కన పెడితే సోషల్‌ మీడియా విస్తరిస్తున్న నేటి సమయంలో మగవాళ్లతోపాటు మహిళలను సమానంగా చూడాలనే డిమాండ్‌ ఊపందుకుంటోంది.

Story first published: Monday, April 30, 2018, 20:54 [IST]
Other articles published on Apr 30, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X