ఫోటోలు: బెంగళూరు, మొహున్ బగన్ శుభారంభం
బెంగళూరు: ఇండియన్ ఫుట్‌బాల్ అభిమానులకు కనువిందు చేసేందుకు ప్రారంభమైన ఐ లీగ్ టోర్నీ తొలివారం డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు ఎఫ్ సి, కోల్‌కతా జెయింట్స్ టీం మొహున్ బగన్ శుభారంభాన్ని ఇచ్చాయి.
నార్త్ఈస్ట్ ఫ్రాంచైసీ ఐజ్వాల్ ఎఫ్ సి జట్టుతో జరిగిన మరో మ్యాచ్‌లో మరో కోల్‌కతా సిటీ జెయింట్స్ జట్టు ఈస్ట్ బెంగాల్ టీం 1-1 స్కోర్ తేడాతో డ్రా గా ముగించుకున్నది. షిల్లాంగ్ లాజోంగ్ ఎఫ్ సి జట్టుతో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు ఎఫ్ సి జట్టు 3-0 తేడాతో గెలుపొందింది.
ఉదాంతా సింగ్ లాంగ్ రేంజి నుంచి కొట్టిన షాట్‌తో మూడు పాయింట్లు బెంగళూరు ఖాతాలో చేరాయి. ఐజ్వాల్ ఎఫ్ సి, ఈస్ట్ బెంగాల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. రీ సైలెన్స్‌కు మారుపేరుగా నిలిచే ఐజ్వాల్ ఎఫ్ సి జట్టు తనదైన శైలిలో ఆధిపత్యం ప్రదర్శించింది.
చర్చిల్ బ్రదర్స్ జట్టుపై విజయం సాధించేందుకు మొహున్ బగన్ జట్టు అతికష్ట పడాల్సి వచ్చింది. బల్వంత్ సింగ్ చేసిన గోల్‌తో మొహున్ బగన్ జట్టు గెలుపొందింది. కొత్తగా లీగ్‌లో చేరిన మినర్వ పంజాబ్, చెన్నై సిటీ ఎఫ్ సి జట్ల మధ్య మ్యాచ్ గోల్స్ లేకుండానే డ్రా గా ముగిసింది. డిఎస్‌కె శివాజియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో థాయి సింగ్ చేసిన గోల్‌తో ముంబై ఎఫ్ సి జట్టు గెలుపొందింది.
ఆయా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ల వివరాలివి:

ఈస్ట్ బెంగాల్ 1-1 ఐజ్వాల్ ఎఫ్ సి మధ్య మ్యాచ్ డ్రా
ఐజ్వాల్ ఎఫ్ సి జట్టు ప్లేయర్ గుర్విందర్ సింగ్ చేసిన గోల్‌ను ఈస్ట్ బెంగాల్ జట్టు కొత్తగా చేర్చుకున్న విదేశీ డిఫెండర్ ఇవాన్ బుకెన్యా చేసిన గోల్‌తో సమం చేశాడు. దీంతో రెండు జట్ల మధ్య మ్యాచ్ డ్రాగా ముగిసింది.

షిల్లాంగ్ లాజోంగ్ ఎఫ్ సి జట్టుపై 3-0 స్కోర్ తేడాతో బెంగళూరు విజయం
ఉదాంతా సింగ్, సేనా రాల్టే చేసిన గోల్స్‌తో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు ఎఫ్ సి తన టైటిల్ కాపాడుకునే దిశగా ఓ అడుగు ముందుకేసింది. షిల్లాంగ్ లాజోంగ్ జట్టుపై 3-0 స్కోర్ తేడాతో విజయం సాధించింది.

చెన్నై సిటీ, మినర్వ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ గోల్స్ లేని డ్రా
ఐ లీగ్ టోర్నీలో కొత్తగా చేరిన జట్లు చెన్నై సిటీ ఎఫ్ సి, మినర్వ పంజాబ్ ఎఫ్ సి జట్ల మధ్య జరిగిన మ్యాచ్ గోల్స్ లేకుండానే డ్రా గా ముగిసింది.

డిఎస్‌కె శివాజియన్స్‌తో ముంబై గెలుపు
డిఎస్‌కె శివాజియన్స్ జట్టుతో జరిగిన థోయిసింగ్ చేసిన గోల్ ముంబై సిటీ 1-0 స్కోర్ తేడాతో విజయం సాధించింది.

1-0 స్కోర్ తేడాతో చర్చిల్ బ్రదర్స్‌పై మొహున్ బగన్ విజయం
బల్వంత్ సింగ్ చేసిన గోల్ చర్చిల్ బ్రదర్స్ జట్టుపై మొహున్ బగన్ జట్టు 1-0 స్కోర్ తేడాతో గెలుపొందింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications