
బ్రెజిల్
ప్రపంచ కప్‌లో ఆతిథ్య బ్రెజిల్ జట్టుకు భంగపాటు ఎదురైంది. జర్మనీ చేతిలో ఓటమితో ఆ జట్టు కప్ ఆశలు గల్లంతయ్యాయి. ఆ జట్టు మూడోస్థానం కోసమే పోరాడాల్సి ఉంది. జర్మనీ చేతిలో ఓడిపోవడంతో బ్రెజిల్ సారథి కన్నీటిపర్యంతమయ్యాడు.

బ్రెజిల్
ఫిఫా ప్రపంచ కప్‌లో ఆతిథ్య బ్రెజిల్ జట్టుకు మంగళవారం భంగపాటు ఎదురైంది. జర్మనీ చేతిలో ఓటమితో ఆ జట్టు కప్ ఆశలు గల్లంతయ్యాయి.

బ్రెజిల్
ప్రపంచ కప్‌లో ఆతిథ్య బ్రెజిల్ జట్టుకు భంగపాటు ఎదురైంది. జర్మనీ చేతిలో ఓటమితో ఆ జట్టు కప్ ఆశలు గల్లంతయ్యాయి. ఆ జట్టు మూడోస్థానం కోసమే పోరాడాల్సి ఉంది. జర్మనీ చేతిలో ఓడిపోవడంతో బ్రెజిల్ సారథి కన్నీటిపర్యంతమయ్యాడు.

బ్రెజిల్
ఫిఫా ప్రపంచ కప్‌లో ఆతిథ్య బ్రెజిల్ జట్టుకు మంగళవారం భంగపాటు ఎదురైంది. జర్మనీ చేతిలో ఓటమితో ఆ జట్టు కప్ ఆశలు గల్లంతయ్యాయి. స్టేడియంలోనే ఏడుస్తున్న బ్రెజిల్ అభిమాని.

బ్రెజిల్
ఫిఫా ప్రపంచ కప్‌లో ఆతిథ్య బ్రెజిల్ జట్టుకు మంగళవారం భంగపాటు ఎదురైంది. జర్మనీ చేతిలో ఓటమితో ఆ జట్టు కప్ ఆశలు గల్లంతయ్యాయి. స్టేడియంలోనే ఏడుస్తున్న బ్రెజిల్ అభిమాని.

బ్రెజిల్
సెమీఫైనల్‌లో జర్మనీతో ఓటమి అనంతరం స్టేడియంలో బాధతో బ్రెజిల్ జట్టు సభ్యులంతా కూలబడిపోయారు. ఓడిపోవడంతో జర్మనీ ఆటగాళ్ల ఆవేదన దృశ్యం.

మ్యాచ్‌కు ముందే ఎదురు దెబ్బలు
బ్రెజిల్ విజయాలకు మూల స్తంభమైన స్టార్ ఆటగాడు నెమార్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడం జట్టును నైతికంగా దెబ్బతీస్తోంది.

మ్యాచ్‌కు ముందే ఎదురు దెబ్బలు
ఎక్కువ శాతం స్కోరింగ్ అవకాశాలు నెమార్ పైనే ఆధారపడ్డారు. అంతటి కీలక ఆటగాడి స్థానంలో ఎవరిని భర్తీ చేసే విషయమై తర్జన భర్జనలు పడ్డారు.

బ్రెజిల్
'బ్రెజిల్ ప్రజలారా! మమ్మల్ని క్షమించండి' అంటూ సారథి డేవిడ్ లూయిజ్ వేడుకున్నాడు. సెమీఫైనల్‌లో జర్మనీ తో ఓటమి అనంతరం స్టేడియంలో బాధతో జట్టు సభ్యులంతా కూలబడిపోయారు.

బ్రెజిల్
తామంతా బ్రెజిల్ ప్రజల ముఖాల్లో విజయానందం చూడాలని భావించామని, అంతా తల్లకిందులై ఘోరమైన పరాజయ భారంతో కుమిలిపోతున్నామన్నాడు.

బ్రెజిల్
ఈ రోజు తమ జీవితాల్లో అత్యంత దురదృష్టకరమైన రోజని లూయిజ్ చెప్పాడు. జర్మనీ మెరుగ్గా ఆడిందని, తమతో పోరుకు జర్మనీ ఆటగాళ్లు సరిగ్గా సన్నద్ధమయ్యారన్నాడు.

బ్రెజిల్
మూడో స్థానం కోసం... నెదర్లాండ్స్, అర్జెంటీనా మ్యాచులో ఓడిన జట్టుతో శనివారం తలపడనుంది. కాగా వందేళ్ల ఫుట్‌బాల్ చరిత్రలో బ్రెజిల్‌కు ఇదే ఘోరమైన ఓటమని చెప్పవచ్చు.

గేమ్
కాగా.. బ్రెజిల్, జర్మనీ మ్యాచులో ఆట ప్రారంభం నుండే జర్మనీ దూకుడుగా ఆడింది. 11వ నిమిషంలో ముల్లర్ గోల్ సాధించి తొలి ఆధిక్యాన్ని అందించాడు.

గేమ్
క్రూన్ ఇచ్చిన కార్నర్‌ను సద్వినియోగం చేసుకుంటూ బాక్స్ సమీపంలో ఉన్న ముల్లర్ గోల్ కొట్టడంతో జర్మనీ ఆధిక్యంలోకి దూసుకు వెళ్లింది.

గేమ్
ఆట 23వ నిమిషంలో జర్మనీ ఆటగాడు క్లోజ్ గోల్ సాధించి జర్మనీ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. మ్యాచులో ఇక్కడి నుండి జర్మనీ తన దూకుడును మరింత పెంచింది.

గేమ్
బ్రెజిల్ రక్షణ శ్రేణి వైఫల్యాన్ని సొమ్ము చేసుకుంటూ గోల్ తర్వాత గోల్ సాధించింది. 24వ నిమిషంలో టోనీ క్రూస్ గోల్‌తో జర్మనీ ఆధిక్యం 3-0కు పెరిగింది.

గేమ్
పిలిప్పీ లామ్ ఇచ్చిన పాస్‌ను గోల్ పోస్ట్ సమీపంలో ముల్లర్ అందుకోలేకపోయాడు. అయితే అతడి వెనుకే ఉన్న క్రూన్ దానిని గోల్‌గా మలిచాడు. తర్వాత క్రూన్ మరో రెండు నిమిషాల వ్యవధిలోనే మరో గోల్ సాధించాడు.

గేమ్
ఆ తర్వాత మరో మూడునిమిషాలకో జర్మని మరో గోల్ చేసింది. ఆట 29వ నిమిషంలో జర్మనీ ఆటగాడు ఖెదిరా గోల్ సాధించాడు. ద్వితీయార్థంలో బ్రెజిల్ నుండి ప్రతిఘటన వచ్చింది.

గేమ్
ఆట 69వ నిమిషంలో గోల్ సాధించి జర్మనీ మళ్లీ ఆధిక్యత సాధించింది. 79వ నిమిషంలో స్కరెల్ గోల్‌తో జర్మనీ ఆధిక్యం 7-0కు చేర్చాడు. బ్రెజిల్ ఖాతా తెరవకుండానే ఆట ముగుస్తుందనుకున్న దశలో 90వ నిమిషంలో బ్రెజిల్ ఆటగాడు ఆస్కార్ గోల్ సాధించాడు.


Click it and Unblock the Notifications













