బ్రెజిల్ కోచ్ ఆశలు గల్లంతు..: గాయంతో డానీ అల్వెస్ దూరం

హైదరాబాద్: వచ్చేనెలలో రష్యాలో జరుగనున్న ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్ ఫైనల్స్‌కు గాయం కారణంగా డానీ ఆల్వెస్ హాజరు కాలేకపోవడం విచారకరమని బ్రెజిల్ ఫుట్ బాల్ గ్రేట్ పీలే వ్యాఖ్యానించాడు.
కౌపీ డీ ఫ్రాన్స్ ఫైనల్స్ మ్యాచ్‌లో పారిస్ సెయింట్ జెర్మైన్ జట్టు తరఫున ఆడిన డానీ అల్వెస్ మోకాలికి గాయమైందని బ్రెజిలియన్ ఫుట్‌బాల్ కాన్ఫిడరేషన్ (సీబీఎఫ్) ధ్రువీకరించింది. డానీ ఆల్వెస్ మోకాలికి శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపింది.

ఫిఫా టోర్నీలో పాల్గొనడం కష్టమే
దీంతో డానీ అల్వెస్ తాను వచ్చేనెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో పాల్గొనే అవకాశం లేదని తేల్చేశాడు. ఇప్పటివరకు బ్రెజిల్ జట్టు కెప్టెన్‌గా డానీ అల్వెస్ పేరును జట్టు కోచ్ టైట్ ఖరారు చేశాడు. కానీ పరిస్థితి మారిపోవడంతోనే బ్రెజిల్ జట్టుకు కొత్త కెప్టెన్‌ను నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

1958లో పీలే సారథ్యంలో బ్రెజిల్‌కు తొలి సాకర్ కప్
ఫుట్‌బాల్ బ్రెజిల్ లెజెండ్ పీలే హయాంలో జట్టును 1958 సాకర్ ఫైనల్స్‌కు తీసుకు వెళ్లాడు. నాటి నుంచి ఇప్పటివరకు బ్రెజిల్ జట్టుకు మూడు ట్రోఫీలు పీలే తెచ్చి పెట్టారు. 1966లో ఇంగ్లండ్‌లో గాయపడ్డ విషయం వినడానికి విచారకరంగా ఉన్నదని పీలే తెలిపాడు. ‘ఫుట్‌బాలర్స్ గేమ్స్ మిస్ కావడాన్ని ద్వేషిస్తారు. కానీ తొలిసారి ప్రపంచ కప్ మిస్ అవుతున్నందుకు దారుణంగా ఉన్నదని ట్వీట్ చేశాడు.

డానీ అల్వెస్ కోలుకోవడానికి ఆరు నెలలు
డానీ అల్వెస్ శస్త్రచికిత్స నుంచి కోలుకోవడానికి ఆరు నెలల సమయం పడుతుందని సీబీఎఫ్ డైరెక్టర్ రోడ్రిగో లాస్మార్ ధ్రువీకరించారు. ‘ఆఫ్ కోర్స్ ఆయన చాలా దిగ్ర్భాంతికి గురయ్యాడు. ఆయన చాలా అనుభవం గల ఆటగాడు. ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో మ్యాచ్ శక్తి సామర్థ్యాలను సమం చేస్తాడు. ఆయన చాలా తొందరగా రికవరీ కావాలని కోరుకుంటున్నాడు' అని రోడ్రిగో లాస్మార్ తెలిపాడు.

17న బ్రెజిల్ వర్సెస్ స్విట్జర్లాండ్
డానీ ఆల్వెస్ గాయపడటం బ్రెజిల్ జట్టు మేనేజర్ టైట్ ప్రణాళికలకు గట్టి ఎదురు దెబ్బ అని భావిస్తున్నారు. ఫిబ్రవరిలో 15 మంది ఆటగాళ్లతో కూడిన తుది జట్టులో డానీ అల్వెస్ పేరు కూడా చేరింది. మాంఛెస్టర్ సిటీలో డానిలో, బేయర్న్ మ్యునిచ్‌కు చెందిన రాఫిన్హా వంటి ప్లేయర్లు కూడా బ్రెజిల్ జట్టులో సభ్యులుగా ఉన్నారు. వచ్చేనెల 17వ తేదీన స్విట్జర్లాండ్ జట్టుతో ప్రపంచకప్ టోర్నమెంట్‌లో బ్రెజిల్ జట్టు ఆడనున్నది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications