Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పీలే రష్యా టూర్‌కు సిద్దమే.. టైటిల్ గెలుచుకోవడమే మెక్సికో తొలి ప్రాధాన్యం

Pele set to travel to Russia for World Cup

హైదరాబాద్: బ్రెజిల్ ఫుట్‌బాల్ గ్రేట్ పీలే (77) ఎట్టకేలకు రష్యాలో వచ్చేనెల 14వ తేదీ నుంచి జరుగనున్న సాకర్ కప్ సంరంభంలో పాల్గొననున్నారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పీలేను రష్యాకు వెళ్లేందుకు వైద్యులు అనుమతించారు. వెన్నముక, తుంటి నొప్పి నుంచి బయట పడేందుకు సుదీర్ఘకాలం ఫిజియో థెరపీ చేయిచుకున్నారని పీలే తన వ్యక్తిగత సహాయకుడు జోస్ ఫోర్నోస్ చెప్పాడు.

 పీలే కోసం స్పాన్సరర్లు, ఆర్గనైజర్ల నుంచి డిమాండ్

పీలే కోసం స్పాన్సరర్లు, ఆర్గనైజర్ల నుంచి డిమాండ్

‘వెన్నముక, తుంటి నొప్పితో బాధపడుతున్నా గణనీయమైన పురోగతి సాధించాడని మీడియాలో వార్తలొచ్చాయి. అతిథిగా ఆయన రాక కోసం పలువురు స్పాన్సర్లు, ఆర్గనైజర్ల నుంచి భారీగా డిమాండ్ వస్తోంది. జూన్ నెల మొదటి వారం తన ప్రపంచ కప్ ఎజెండాపై పీలే తన సలహాదారులతో చర్చిస్తారని చైనా అధికార వార్తా సంస్థ ‘జిన్హువా' తెలిపింది. బ్రెజిల్ ది గ్రేట్ పీలే సాదాసీదా ప్లేయర్ కాదు. మూడుసార్లు ప్రపంచ కప్ టైటిల్‍ను బ్రెజిల్ జట్టుకు సాధించి పెట్టిన ఆటగాడు. తన కెరీర్‌లో పీలే 1363 గేమ్స్ ఆడి 1281 గోల్స్ సాధించాడు. తద్వారా ఫుట్‌బాల్ చరిత్రలో గొప్ప చరిత్ర సృష్టించారు పీలే.

 పలు సమస్యలతో పీలే సతమతం

పలు సమస్యలతో పీలే సతమతం

ఇటీవలి కాలంలో తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పీలేకు తాజాగా స్పైనల్ కార్డులో నొప్పి మొదలైంది. ఆ వెంటనే తుంటి మార్పిడి కోసం శస్త్ర చికిత్స పూర్తి చేసినందుకు సమస్యలు తలెత్తాయి. ప్రొస్టేట్, కిడ్నీ సమస్యలతో ఆసుపత్రి పాలయ్యారు. జూన్ 17వ తేదీన రొస్టోవ్‌లో స్విట్జర్లాండ్ జట్టుతో బ్రెజిల్ తలపడనుంది.

టైటిలే మెక్సికో ఏకైక లక్ష్యం

టైటిలే మెక్సికో ఏకైక లక్ష్యం

రష్యాలో జరిగే సాకర్ కప్ సంరంభంలో టైటిల్ గెలుచుకుని స్వదేశానికి రావడమే తమ లక్ష్యమని మెక్సికో డిఫెండర్ హెక్టర్ మొరెనో తెలిపారు. ‘మేం వరల్డ్ కప్ టోర్నమెంటులో పాల్గొంటున్నది టైటిల్ గెలుచుకోవడానికే' అని హెక్టర్ మొరెనో చెప్పాడు. సోమవారం సాపాడెనాలో రోస్ బౌల్ వద్ద వేల్స్ జట్టుపై మెక్సికో జట్టు తలపడనున్నది. ‘మేం టైటిల్ కైవసం చేసుకునే ఫేవరెట్లం కాదు. కానీ మా జట్టు టైటిల్ గెలుచుకోవడంపైనే దృష్టిని కేంద్రీకరించింది' అని మొరెనో చెప్పాడు.

16వ ర్యాంకుతో సరిపెట్టుకుంటున్న మెక్సికో

16వ ర్యాంకుతో సరిపెట్టుకుంటున్న మెక్సికో

2010లో దక్షిణాఫ్రికా, 2014లో బ్రెజిల్ వరల్డ్ కప్ టోర్నమెంట్లలో పాల్గొన్న మొరెనో వరుసగా మూడోసారి రష్యా సాకర్ కప్ సంరంభంలో పాల్గొననున్నాడు. కానీ మెక్సికో జట్టు గత ఆరు టోర్నమెంట్ల నుంచి గ్రూప్ దశలో 16 ర్యాంకుతోనే సరిపెట్టుకుంటున్నది. కానీ రష్యాలో ఆశ్చర్యకరమైన ఫలితాన్ని సాధిస్తుందని మెక్సికో కోచ్ జువాన్ కార్లోస్ ఒసోరియో తెలిపాడు. రష్యాలో జరిగే టోర్నీలో గ్రూప్ ఎఫ్‌లో జర్మనీ, దక్షిణ కొరియా, స్వీడన్ జట్లతో మెక్సికో తల పడనున్నది. టోర్నీలో తొలుత డిపెండింగ్ చాంపియన్ జర్మనీతో మెక్సికో ఆడుతుందని మొరెనో చెప్పాడు.

Story first published: Sunday, May 27, 2018, 14:29 [IST]
Other articles published on May 27, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+