Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రూ. 26 లక్షలు పలికిన ఫుట్‌బాల్‌ లెజెండ్‌ పీలే 'జెర్సీ'

Pele’s last Brazil jersey sells for more than Rs 26,00,000 in Italy

హైదరాబాద్: బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ లెజెండ్‌ పీలే తన చివరి మ్యాచ్‌లో ధరించిన జెర్సీ ఇటలీలో నిర్వహించిన వేలంలో 30,000 యూరోలు(రూ.26 లక్షలు) అమ్ముడైంది. బ్రెజిల్‌ను మూడుసార్లు ప్రపంచ కప్ విజేతగా నిలిపిన పీలే తన చివరి మ్యాచ్‌ని జూలై 1971లో ఆడాడు.

రియో డి జనీరోలోని మరకానా స్టేడియంలో యుగోస్లేవియాతో జరిగిన స్నేహపూర్వక మ్యాచ్‌లో బ్రెజిల్ తరుపున ఆడిన పీలే ఈ జెర్సీని ధరించాడు. సాకర్ ప్రపంచంలో అల్ టైమ్ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా పేరొందిన 79 ఏళ్ల పీలే బ్రెజిల్ తరుపున మొత్తం 92 మ్యాచ్‌లాడి 77 గోల్స్ చేశాడు.

ఇటీలీలోని టురిన్‌లో గురువారం నిర్వహించిన ఈ వేలంలో పీలే జేర్సీనే అత్యధిక ధర పలికిన వస్తువుగా నిలిచింది. ఇక, 1952 టూర్ డి ఫ్రాన్స్‌లో విజయం సాధించిన ఇటాలియన్ సైక్లింగ్ స్టార్ ఫౌస్టో కొప్పి యొక్క పసుపు జెర్సీ 25,000 యూరోలకు అమ్ముడైంది.

1971 UEFA కప్ ఫైనల్లో ఇటాలియన్ డిఫెండర్ లూసియానో స్పినోసి ధరించిన అరుదైన బ్లూ జువెంటస్ జెర్సీ 9,400 యూరోలకు అమ్ముడైంది. అర్జెంటీనా లెజెండ్ డియెగో మారడోనా 1989-90 సీజన్లో నాపోలి కోసం ఆడుతున్న సమయంలో ధరించిన జెర్సీ 7,500 యూరోలకు అమ్ముడైంది.

యుఎస్ బాస్కెట్‌బాల్ గ్రేట్ మైఖేల్ జోర్డాన్ బేస్ బాల్‌ ఆడేందుకు ఉపయోగించిన బ్యాట్ 425 యూరోలు పలికింది.

Story first published: Saturday, December 7, 2019, 11:14 [IST]
Other articles published on Dec 7, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+