For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్యాన్స్‌కు షాక్: వేలానికి పీలే సాకర్ పతకాలు, ట్రోఫీ

By Nageswara Rao

బ్రెజిల్: పీలే.. పుట్ బాల్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ ఈ పేరు సుపరిచితం. తనదైన అద్భుత విన్యాసాలతో ఫుట్‌బాల్ క్రీడారంగంలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. బ్రెజిల్‌కు చెందిన ఈ పుట్‌బాల్ లెజెండ్ సాకర్‌కే కీర్తి ప్రతిష్టతలను తీసుకొచ్చారు.

నల్లజాతీయుడైన పీలే కోచ్‌గా పనిచేస్తానంటే అతనికి కోట్లు కుమ్మరించేందుకు అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్లబ్‌లన్నీ సిద్ధంగా ఉన్నాయి. అయితే కోచ్‌గా ఉండేందుకు ఇష్టపడని 75 ఏళ్ల పీలే డబ్బు కోసం తాను ఎంతో కష్టపడి సాధించిన విజయాల తాలూకు జ్ఞాపకాలను వేలం వేసేందుకు సిద్ధమయ్యాడు.

60 ఏళ్ల తన పుట్‌బాల్ క్రీడా జీవితంలో ఎన్నో అరుదైన పతకాలు, సేకరించిన వస్తువులను వేలం వేయనున్నట్లు పీలే ప్రకటించాడు. తనకు ఎంతో ఇష్టమైన, తన క్రీడా జీవితంలో ఓ మైలు రాయిగా నిలిచిన జూల్స్ రిమైటే ట్రోఫీని కూడా వేలం వేసేందుకు సిద్ధపడ్డాడు.

Pele: Football legend to auction off personal memorabilia

దీంతో పాటు 1970లో సాధించిన ప్రపంచకప్ ప్రతిమతోపాటు ప్రపంచకప్ విజేతగా నిలిచినప్పుడు తాను ధరించిన జెర్సీలు, బూట్లు, అవార్డులు అన్నీ వేలంలో అమ్మకానికి పెట్టాడు. వేలం ద్వారా దాదాపు రూ.47 కోట్లు వస్తాయని ఆశిస్తున్నట్లు పీలే తెలిపాడు.

దశాబ్దాలుగా అరుదైన జ్ఞాపకాలను మిగిల్చిన అపురూప వస్తువులను 75 ఏళ్ల పీలే వేలం వేయడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. పీలే పతకాలు, సాకర్ ట్రోఫీని లండన్‌లోని జూలియన్ ఆక్షన్ హౌస్‌లో వేలం వేయనున్నారు. ఈ వేలం కోసం పీలే ఇప్పటికే లండన్ చేరుకున్నారు.

ప్రతి ఒక్కరికీ డబ్బు అవసరం ఉంటుంది. కానీ, ఈ సొమ్ము నా భవిష్యత్‌కోసం కాదు, నా జీవితానికి అవసరం అని పీలే తెలిపాడు. నేను కోచ్‌గా పనిచేస్తే చాలా డబ్బు వస్తుంది. అలాంటి ప్రతిపాదనలు నా ముందు చాలా ఉన్నాయి. కానీ నాకు కోచ్‌గా పని చేయాలన్న ఆసక్తి లేదు అని పీలే స్పష్టం చేశాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:06 [IST]
Other articles published on Nov 14, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+