For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Football: కాగ్గియరీని చిత్తు చేసిన రోమా

By Stats Perform

'సిరి ఏ'లో భాగంగా కాగ్లియరీతో జరిగిన మ్యాచ్‌లో రోమా 4-0తో విజయం సాధించింది. పాలో డైబాలా మెరుపు ప్రదర్శనతో రెండు గోల్స్ సాధించి విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ ఘన విజయంతో రోమా పాయింట్ల పట్టికలో అయిదో స్థానానికి దూసుకెళ్లింది. రోమాకు ఇది హ్యాట్రిక్ విజయం. మ్యాచ్ ఆరంభమైన రెండు నిమిషాలకే రోమా ఖాతా తెరిచింది. లారెంజ్ పెల్లెగ్రి గోల్ కొట్టి స్కోరుబోర్డును బోణీ చేశాడు.

Italy Soccer Serie A

ఆ తర్వాత 23వ నిమిషంలో పాలో డైబాలో గోల్ చేసి రోమా ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. సెకండ్ హాఫ్ ప్రారంభమైన ఆరు నిమిషాలకు రోమాకు మరో గోల్ లభించింది. ఆండ్రియా పెటాగ్నా చేతికి బంతి తాకడంతో పెనాల్టీ షూట్ దక్కింది. ఈ అవకాశాన్ని రోమా సద్వినియోగం చేసుకుంది.

ఆ తర్వాత డీన్ హుయిజ్ సెన్ మరో గోల్ సాధించి స్కోరును 4-0కి చేర్చాడు. మరోవైపు ప్రత్యర్థి జట్టులో రోమా మాజీ బాస్ క్లాడియో రానియరీ నిస్సహాయంగా నిలబడ్డాడు.

మరోవైపు స్పెయిన్‌లో జరిగిన మ్యాచ్‌లో రేయో వల్లేకానో‌పై సెవిల్లా ఎఫ్‌సీ 2-1 తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో సెవిల్లాకు ఇది నాలుగో విజయం మాత్రమే సాధించింది. టోర్నీ నుంచి నిష్క్రమణ రేసులో ఉన్న ఆ జట్టు పోరాడుతోంది.

మ్యాచ్ ప్రారంభమైన 19వ నిమషంలో ఎన్-నెస్రీ అద్భుతమైన గోల్ కొట్టాడు. ఆ తర్వాత 10 నిమిషాలకు ఇసి పలాజె గోల్ చేసి స్కోరును సమం చేశాడు. కానీ ఎన్-నెస్రీ మరో గోల్ చేసి జట్టును గెలిపించాడు.

Story first published: Tuesday, February 6, 2024, 17:17 [IST]
Other articles published on Feb 6, 2024
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+