బెర్లిన్: ప్రపంచ కప్ ఫైనల్ లో స్పెయిన్ గెలుస్తుందని ఒక జోస్యం. ఆక్టోపస్ ఈ విషయం చెప్పడంతో ప్రపంచవ్యాప్తంగా జనం దీనిని నమ్ముతున్నారు.పాల్ (అక్టోపస్) తమ జట్టుకు వ్యతిరేకంగా చెబుతుందేమోనని స్పెయిన్, నెదర్లాండ్స్ అభిమానులకు బెంగపట్టుకుంది.
ఎందుకంటే అక్టోపస్ మాట వందశాతం నిజం కావడమే కాక మానసికంగా జట్లపై ప్రభావం చూపుతోంది. ఇప్పటిదాకా జర్మనీ ఆడిన ఆరు మ్యాచ్‌ల ఫలితాలను కచ్చితంగా చెప్పిన అక్టోపస్‌కు అసలు పరీక్ష ముందుంది. మూడో స్థానం కోసం జర్మనీ-ఉరుగ్వే మ్యాచ్ కోసం శుక్రవారం పాల్ జోస్యం చెప్పనుంది. అప్పటికి పాల్ అలసిపోకుండా ఉంటే ఆదివారం స్పెయిన్-నెదర్లాండ్స్ మధ్య ఫైనల్‌కు శనివారం నాడే విశ్వవిజేత ఎవరో గుట్టు విప్పనుంది.