న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

'ఎంత కాలం కలిసుంటామో నమ్మకాల్లేవ్'

Paul Pogba non-committal on Manchester United future and talks Jose Mourinho relationship

హైదరాబాద్: ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో పాల్గొనే జెయింట్ క్లబ్ మాంఛెస్టర్ యునైటెడ్ జట్టుకు కెప్టెన్ పాల్ పోగ్బా వ్యవహరిస్తున్నాడు. అయితే తాను సుదీర్ఘ కాలం జట్టుతో కొనసాగుతానన్న గ్యారంటీ లేదని, జట్టు మేనేజర్ జోస్ మౌరిన్హో తాను మంచి స్నేహితులమని స్పష్టం చేయలేనన్నాడు. ప్రీమియర్ లీగ్ టోర్నీలో రెండో సీజన్‌లో పాల్ పోగ్బా ఆటతీరు మిశ్రమ ఫలితాలనిచ్చింది. ఇదే మాంఛెస్టర్ యునైటెడ్ జట్టుకు పాల్ పోగ్బా ప్రాతినిధ్యం గురించి జోస్ మౌరిన్హో బహిరంగంగానే ప్రశ్నలు లేవనెత్తాడు. అందుకే పాల్ పోగ్బా జట్టులో తన భవితవ్యం గురించి హామీ ఇవ్వలేనని తేల్చేశాడు.

భవితవ్యంపై ఇప్పుడే చెప్పలేనన్న పోగ్బా

భవితవ్యంపై ఇప్పుడే చెప్పలేనన్న పోగ్బా

ఈ ఫ్రాన్స్ ఇంటర్నేషనల్ 89 మిలియన్ల యూరోల వేతనం అందుకుంటున్నాడు. పారిస్ సెయింట్ జెర్మైన్ క్లబ్ జట్టుతో అనుబంధం పెంచుకోనున్నాడని వార్తలొచ్చాయి. పాల్ పోగ్బా కూడా ఆ విషయాన్ని కొట్టి పారేయలేకపోవడం గమనార్హం. మాంఛెస్టర్ యునైటెడ్ జట్టులో తన స్థానం నుంచి గ్యారంటీ ఇవ్వలేనని, కానీ కాంట్రాక్టు మాత్రం ఉన్నదని పేర్కొన్నాడు. తన భవిష్యత్ గురించి ఏనాడు ప్రత్యేకంగా దృష్టిని కేంద్రీకరించలేదని పోగ్బా పేర్కొన్నాడు. క్లబ్ మేనేజ్మెంట్, కోచ్ అనుసరించాల్సిన పరిస్థితులను, పరిణామాలను బట్టి ఆధారపడి మాంఛెస్టర్ యునైటెడ్ జట్టులో తన స్థానం ఆధార పడి ఉంటుందని చెప్పాడు.

పీఎస్జీ నా జీవితంలో భాగం కాదని వెల్లడి

పీఎస్జీ నా జీవితంలో భాగం కాదని వెల్లడి

మార్సైల్లి మద్దతుదారులైన తన తల్లిదండ్రులతో అండతోనే తాను ఎదిగానని పాల్ పోగ్బా చెప్పాడు. పారిస్ సెయింట్ జెర్మైన్ (పీఎస్జీ) ఏనాడూ తన రోజువారీ జీవితంలో భాగస్వామి కాలేదన్నాడు. కానీ పార్క్ డెస్ ప్రిన్సెస్ గొప్ప పిచ్ గల స్టేడియం అయినా ఆడలేకపోయానని చెప్పాడు. తనను ప్రశ్నించిన మాంఛెస్టర్ యునైటెడ్ కోచ్ జోస్ మౌరిన్హోనూ ప్రశంసల్లో ముంచెత్తాడు పోగ్బా. జట్టు కెప్టెన్‌గా తనను నియమించినందుకు మౌరిన్హోకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. కానీ బయట ఆయనతో స్నేహ పూర్వక సంబంధాల్లేవని చెప్పాడు.

 బెంచ్‌కు పరిమితమైతే ఇలా

బెంచ్‌కు పరిమితమైతే ఇలా

జట్టు సారధినైనా కొన్నిసార్లు మ్యాచ్‌ల్లో ఆడకుండా ఉండాల్సి వచ్చింది. బెంచ్ కు పరిమితం కావాల్సి వచ్చింది. ఇది ప్రధాన చర్చకు దారి తీసింది. తనను ప్రశ్నిస్తున్న వారంతా తానే పని చేయలేదని భావించారని పేర్కొన్నాడు పాల్ పోగ్బా.

పిచ్‌పై ఇలా పోగ్బా పవర్

పిచ్‌పై ఇలా పోగ్బా పవర్

‘కానీ ఒక కోచ్, ఒక ప్లేయర్ మంచి ప్లేయర్లు కాదు. కలిసి రెస్టారెంట్లకు వెళ్లరు. నేను కూడా మానసికంగా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటున్నాను. కోచ్ నన్ను బెంచ్‌కు పరిమితం చేశాడు. కానీ పిచ్‌పై ఆడుతున్నప్పుడు నా పవరేంటో చూపాను. ప్రతిసారి మ్యాచ్‌లో నేను చేయాల్సింది చేశా' అని పాల్ పోగ్బా చెప్పాడు. ‘ఆయన నాకు నాయకత్వం అప్పగించారు. నాకు ఆయనతో కలిపి బాధ్యతలు ఉన్నాయి. క్లబ్ జట్టులో ఇది నాకు మొదటి. ఇది ఫ్రాన్స్ జట్టులో లీడర్‌గా ఎదిగేందుకు దోహద పడింది' అని పాల్ పోగ్బా చెప్పాడు.

Story first published: Thursday, May 24, 2018, 11:13 [IST]
Other articles published on May 24, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X